zoroastrian region birth history

Zoroastrian region birth history

zoroastrian, zoroastrian region history, zoroastrian life story, zoroastrian story book

zoroastrian region birth history : The Birth History of zoroastrian region.

హిందూ, క్రైస్తవ మతాలకంటే పూర్వం ఆవిర్భవించిన ‘జొరాస్ట్రియన్’!

Posted: 03/25/2015 08:07 PM IST
Zoroastrian region birth history

ప్రాచీన పర్షియా (నేటి ఇరాన్)లో జొరాస్తర్ లేదా జరాతుష్ట్ర స్థాపించిన మతము పేరే ‘జొరాస్ట్రియన్’. వీరు భగవంతుణ్ణి ‘అహూరా మజ్దా’ అని పిలుస్తారు. వీరి పవిత్ర గ్రంధం ‘జెండ్ అవెస్తా’. వీరి దేవాలయాన్ని 'అగ్ని దేవాలయం' లేదా 'ఫైర్ టెంపుల్' లేదా 'అగియారీ' అని అంటారు.

మతం ఆవిర్భావం చరిత్ర :

పూర్వం ఆర్యుల సమాజంలో విగ్రాహాల ఆరాధన, జంతు బలులు ఎక్కువగా ఉండేవి. అటువంటి రోజుల్లో.. సృష్టి కర్త అయిన ‘అహురా మాజ్దా’ యుక్త వయసులో ఉన్న జొరాస్టర్ కలలోకి ‘ఓహు మనా’ అను దేవ దూతను దర్శనమిచ్చేలా చేశాడు. ఆ దైవదూత జోరాస్టర్ కి దర్శనమిచ్చి దైవ ప్రకటకన చెప్పగా... ‘దేవుడు ఒక్కడే’ అని అతను నమ్మాడు. అప్పుడు అతను ఆనాడు ఆయా పెద్దలకు వ్యతిరేకంగా ప్రచారం చేయసాగాడు. పూజారులు నమ్మే దేవతలను, దేవుళ్ళను దెయ్యాలుగా వర్ణించసాగాడు.

అతను ఆ విధంగా ప్రచారం చేయడంతో తీవ్రంగా ఆగ్రహించిన పెద్దలు.. జొరాస్తర్ ను అంతంచేయాలనుకుని ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ.. వాళ్లు విఫలమయ్యారు. జొరాస్తర్ తన బోధనలతో బాక్ట్రియా సామ్రాజ్యపు రాజైన విష్తాస్పను ప్రభావితం చేయగలిగాడు. ఇక అప్పటినుంచి ఈ మతం అమలులోకి రావడం మొదలయ్యింది. శతాబ్దాల తరువాత బాక్ట్రియాలో ఉన్న ప్రజలు జొరాస్త్రమతాన్ని స్వీకరించారు. (అతని పేరుమీదుగానే ఈ మతానికి ఆ విధంగా పేరు పెట్టినట్లు తెలుస్తోంది).

ఇదిలావుండగా.. జొరాస్తర్ ముగ్గురు స్త్రీలను వివాహం చేసుకొని ఆరుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. ఈ క్రమంలోనే ఇతనిని అంతమొందించాలని ప్రయత్నాలు చేవారు. చివరికి ట్యురాన్ సామ్రాజ్యానికి, పర్షియా సామ్రాజ్యానికి జరిగిన యుద్ధంలో ట్యురాన్ దేశపు రాజు చేతిలో జొరాస్తర్ మరణించాడు.

జొరాస్త్రియన్లు అగ్నిని తమ దేవుడు ‘అహురా మజ్దా’ చిహ్నంగా భావిస్తారు. గుంపుగా ఒకచోట చేరి అగ్నికి ఎదురుగా కూర్చుని అవెస్తాలోని మంత్రాలు చదువుతూ యజ్ఞాలు నిర్వహిస్తారు. జొరాస్త్ర మతము ఏర్పడిన క్రొత్తలో జోరాస్త్రియన్లకు ఎటువంటి దేవాలయాలు ఉండేవి కాదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : zoroastrian history  worlds different regions  

Other Articles