Suryapet jathara telangana second huge festival history

suryapet jatara, suryapet jatara news, suryapet jatara latest news, telangana jatara, telangana festivals

suryapet jathara telangana second huge festival history : Suryapet jatara started in nalgonda district which is called as second highest jatara in telangana state.

మొదలైన సూర్యాపేట జాతర.. జనంతో కిక్కిరిసిన ప్రాంతం

Posted: 02/09/2015 07:25 PM IST
Suryapet jathara telangana second huge festival history

తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే జాతరల్లో సూర్యాపేట జాతర ఒకటి! ఈ జాతరను వీక్షించడానికి లక్షలకొద్దీ జనంతో ఇతర ప్రాంతాల నుంచి తరలివస్తారు. ఎప్పుడో ప్రాచీనకాలంలో ప్రారంభమైన ఈ జాతర... నేటికి ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. సంస్కృతీ-సంప్రదాయాలకు ప్రతీకగా ఇక్కడి ప్రజలు ప్రాచీన ఆచార వ్యవహారాల మేరకే ఈ జాతరను జరుపుకుంటారు. ఇప్పుడు ఈ జాతర సంబరాలు మొదలయ్యాయి కాబట్టి.. సూర్యాపేటకు లక్షలకొద్దీ ప్రజలు తరలి వస్తున్నారు. ఎంతో ఘనంగా ఆరంభం కావడంతో జాతీయ రహదారిపై విపరీతంగా ట్రాఫిక్ స్తంభించిపోయిందని సమాచారం!

ఈ జాతరను తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా అభివర్ణిస్తారు. మొత్తం ఐదురోజులపాటు అంగరంగవైభవంగా జరిగే ఈ జాతరకు పొరుగురాష్ట్రాల నుంచి కూడా దాదాపు 30 లక్షలకుపైగా ప్రజలు హాజరవుతారని అధికారులు వెల్లడిస్తున్నారు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర ప్రతిసారీ ఫిబ్రవరి రెండోవారంలోనే జరుగుతుంది. 65వ జాతీయ రహదారిపై సూర్యాపేట దగ్గర కొలువైన యాదవుల పవిత్ర దైవం లింగమంతుల స్వామి, చౌడమ్మతల్లి పెద్దగట్టు జాతరకు దాదాపు 150 సంవత్సరాల చరిత్ర ఉందని పలువురు పెద్దలు చెబుతుంటారు.

సూర్యాపేట పట్టణం చాలా చారిత్రక విషయాలతో అనుబంధం కలిగి వుంది. పురాణాల్లో సైతం ఈ పట్టణ విశేషాలు పొందుపరిచి వున్నాయి. దీనిని తెలంగాణ ముఖద్వారం అని కూడా అంటారు. మొదట ఈ పట్టణం పేరు భానుపురిగా వుండేది. అయితే కాలక్రమంలో ఇది సూర్యాపేటగా మారింది. తెలుగు, కోయ ఇక్కడి ప్రాంతీయ భాషలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : suryapet jatara updates  telangana jatara  

Other Articles