Kondagattu anjaneyaswamy temple special story

kondagattu, karimnagar district, kondagattu temple, anjneyaswamy temples in telangana, anjneya swamy temple karimnagar district, telangana temples

kondagattu anjaneyaswamy temple in karimnagar district telangana special article

కొండలలో వెలసిన కొండగట్టు అంజన్న

Posted: 12/20/2014 05:15 PM IST
Kondagattu anjaneyaswamy temple special story

తెలంగాణ రాష్ట్రములో ఎంతో ప్రసిద్ది చెందిన పుణ్య క్షేత్రాలలో కొండగటు ఒకటి. ఈ దేవాలయం కరీంనగర్ జిల్లాలోని మల్యాల మండల కేంద్రంలోని ముత్యంపేట గ్రామ సమీపంలో ఉంది. ఇది కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి దాదాపు 35 కి.మీ.లు దూరములో ఉన్న ఒక ఆంజనేయ స్వామి దేవాలయము. ఇది జిల్లాలోని ఒక ప్రధాన కేంద్రం జగిత్యాల నుండి 15 కెలోమీటర్ల దూరములో కలదు. కొండలు, లోయలు మరియు సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు చాలా ప్రకృతి సౌందర్యము కలిగిన ప్రదేశము. జానపదాల ప్రకారము, ఈ గుడిలో 40 రోజుల పాటు పూజ చేస్తే సంతానము లేని వారికి సంతానము కలుగుతుందని భక్తుల నమ్మకము. కొండగట్టు చూడటానికి చాల రమణీయ ప్రదేశం. ఇక్కడ పలు రకాల జంతు జ్జతులు కూడా ఉంటాయి. ఒక కొండ పైన వెలసిన ఆంజనేయ స్వామి ని దర్శించుకోవటానికి యేటా వేలల్లో భక్తులు వస్తుంటారు. ఆలయ పరిసరాల్లో చుట్టూ ఎటు చుసిన పచదనం పరచుకున్న అడవే ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత.

విగ్రహ విశేషాలు

ఓ వైపు నృసింహస్వామి మరో వైపున ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంఖు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు. ఈ ఆన్జనేయుడిని ఎక్కువగా ఆకులతో అలంకరిస్తూ నితం పూజలు చేస్తూ ఉంటారు.

ఆలయ చరిత్ర

త్రేతాయుగంలో ఈ ప్రాంతంలోని ఋషులు తపం యజ్ఞయాగా దులు చేసుకొంటున్న సమయంలో హనుమంతుడు లక్ష్మణుడి రక్షణార్థం సంజీవని పర్వతం తీసుకొని వెళ్ళసాగాడు. అది గమనించిన ఋషులు, రామదూతను సాదరంగా ఆహ్వానించారు. మీ మర్యాద బాగుంది. ఇది ఆగవలసిన సమయం కాదు కదా! శ్రీరాముడి కార్యానికై త్వరగా వెళ్ళాలి, తిరిగి వస్తాను అని చెప్పి వాయుసుతుడు వేగంగా వెళ్ళి పోయాడు. కొన్నిరోజులకు అవ్యక్త దుష్టగ్రహ శక్తులు ఆ ఋషుల దైవకార్యాలను ఆటంకపర్చసాగారు. తిరిగి వస్తానన్న హనుమ రాలేదు. వారిలో కొంతమంది ఋషులు గ్రహనాథులకు వైరియైన భూతనాథుడి భేతా ళాన్ని ప్రతిష్టించారు. లాభం లేకపోయింది. వారి ఉపాసనా తపశ్శక్తిని ధారపోయగా, వారి తపస్సుకు మెచ్చి పవిత్రమూర్తి పవనసుతుడు 'శ్రీ ఆంజనేయుడు' స్వయంభువుగా వెలిసాడు. నాటినుండి ఋషులు శ్రీ స్వామివారిని ఆరాధిస్తూ, వారి దైవకార్యాలను నిర్విఘ్నంగా చేసుకో సాగారు.

ఈ దేవాయలయంతో పాటు కొండగట్టు దగ్గర కొండల రాయుని స్థావరం, మునుల గుహ, సీతమ్మ కన్నీటి ప్రదేశం, తిమ్మయ్యపల్లె శివారులోని బోజ్జ పోతన గుహలు, అటవీ మార్గం గుండా కొండపైకి పురాతన మెట్లదారి, భేతాళుడి ఆలయం, పులిగడ్డ బావి,, కొండలరాయుని గట్టు, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీవేంకటేశ్వర ఆలయం, అమ్మ వారు, శ్రీరామ పాదుకలు, అందమైన ఆకృతులతో కనువిందు చేసే బండరాళ్లు, హరిత వర్ణంతో స్వాగతం పలికే వృక్షాలు కనువిందు చేస్తాయి. దేవాలయానికి సమీపంలో గుట్ట కింద నిర్మించిన అతి పెద్ద ఆంజనేయస్వామి విగ్రహాలు చూపరులను ఆకర్శిస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kondagattu temple  karimnagar district  telangana  famous temple  

Other Articles