Penchalakona temple narasimha swamy statue history the myth of land

penchalakona temple, penchalakona temple history, penchalakona temple news, penchalakona temple photos, penchalakona place history, penchalakona biography, penchalakona history in telugu, penchalakona the myth, penchalakona temple wikipedia, penchalakona temple wiki in telugu, penchalakona

penchalakona temple narasimha swamy statue history the myth of land

ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ‘పెంచలకోన’

Posted: 11/29/2014 03:11 PM IST
Penchalakona temple narasimha swamy statue history the myth of land

హిందూదేవతలు స్వయంభువులుగా వెలిసిన పుణ్యక్షేత్రాలు భారతదేశంలో ఎన్నోవెలిశాయి. అందులో ముఖ్యంగా దక్షిణభారతంలో అయితే చాలా ఎక్కువగానే వున్నాయి. అటువంటి క్షేత్రాల్లో ‘పెంచలకోన’ ఒకటి! దక్షిణాదిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఈ క్షేత్రం పేరుగాంచింది. చుట్టూ సుందరమైన, సర్పాకృతిలో దట్టమైన చెట్లతో కూడిన కొండలు నడుమ ఈ  దివ్యమైన దేవస్ధానం వెలసింది. ఇక్కడ కూడా ప్రతియేటా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దేశనలమూలల నుంచి భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు వస్తుంటారు. ఈ ఆలయం వెనుక పురాణ కథనం వుంది.

స్థలపురాణం :

శ్రీమహావిష్ణువు కృతయుగంలో ప్రహ్లాదునిని హిరణ్యకశుపుని చెరనుంచి సంరక్షించేందుకు అతడిని హతమార్చిన అనంతరం వెలిగొండల కీకారణ్యంలో ఆవేశంగా గర్జిస్తూ సంచరిస్తూ వుంటాడు. ఆ సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మీ తనతోబాటు చెలికత్తెలను తీసుకుని అడవిలో విహరిస్తుంటుంది. అప్పుడు భీకరరూపంలో వున్న స్వామివారిని చూసి చెలికత్తెలు పారిపోగా.. చెంచులక్ష్మీ మాత్రం అక్కడే వుండిపోతుంది. దీంతో ఆమె అందాలకు, ధైర్యసాహసాలకు ముగ్ధుడైన స్వామి.. చెంచురాజుకు సకలవైభవాలు అందచేసి అతని కూతురిని తనకిచ్చి వివాహం చేయాల్సిందిగా కోరతాడు.

అనంతరం ఆమెను వివాహం చేసుకున్న తర్వాత స్వామి ఆమెను పెనవేసుకొని అక్కడే స్వయంభువుగా వెలిశాడని చరిత్రలో రాయబడింది. అందుకే.. ఆ ఆలయంలోని స్వామివారిని పెనుశిల లక్ష్మీనసింహస్వామిగా పిలుస్తారు. ఇదిలావుండగా.. చెంచులక్ష్మీని స్వామివారు వివాహం చేసుకున్నారనే విషయాన్ని తెలుసుకున్న ఆయన భార్య ఆదిలక్ష్మీ అమ్మవారు ఆగ్రహంతో రగిలిపోతారు. తానుండగా ఇంకొకరితో వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆమె స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్లిపోయిందని పురాణ కథనం. అందుకే.. అమ్మవారికి ఇక్కడ దేవస్ధానం నిర్మించారు.

మరొక కథనం :

పెంచలకోనకు ఆరు కిలోమీటర్ల దూరంలో గోనుపల్లికి చెందిన ఒక గోర్రెలకాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచలకోన అడవిలోకి వెళ్లాడు. అతడిని గమనించిన స్వామి వృద్ధుని రూపంలోలోకి మారిపోయాడు. అప్పుడు ఆ కాపరిని పిలిచి.. నరసింహస్వామి ఈ ప్రాంతంలో శిలారూపంలో వెలిసి వున్నారని.. వెంటనే ఈ విషయం గ్రాస్తులకు తెలిపి ఇక్కడ ఆలయం నిర్మించాలని చెప్పారట! అలా చెప్పిన అనంతరం కాపరి తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతుండగా అతనిని వెనుతిరిగి చూడకుండా వెళ్లాలని స్వామి ఆదేశించాడు. అందుకు సరేనన్న కాపరి కొద్ది దూరం వెళ్ళిన తరువాత వెనుతిరిగి చూడడంతో స్వామి శిలగా మారినట్లు ఈ ప్రాంత వాసులు చెబుతుంటారు. ఈ విషయం తెలుసుకున్న ఆలయం నిర్మించారు.

పెనుశిల నరసింహస్వామి దేవాలయం :

ఈ పుణ్యక్షేత్రం నెల్లూరులోని రాపూరు మండలంకి 35 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. చుట్టూ పెద్ద కొండలు, పచ్చని చెట్ల మధ్య ఈ దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ పెంచలస్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల పల్లెటూర్ల నుండి చాలా మంది వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మే, ఏప్రిల్ మధ్యలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. కన్వ మహర్షి ఇక్కడ తపస్సు చేసారని అంటూ ఉంటారు.  

ఆలయ విశేషాలు :

నెల్లూరు-కడప జిల్లాల మధ్య తూర్పుకనుమల పర్వత ప్రాంతాలల్లో ఈ క్షేత్రం వుంది. నెల్లూరు జిలా కేంద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో సముద్రమట్టానికి 3వేల అడుగుల ఎత్తులో వుంటుంది. కోనలోని గర్భగుడి సుమారు 700 సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లు తెలుస్తుంది.భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగారని... ఆయనను పెంచిన కణ్వమహర్షి ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారని పురాణ పుస్తకాల్లో రచించబడి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles