Chowmahalla palace story which is built by nizam in hyderabad telangana state

Chowmahalla Palace history, Chowmahalla Palace story, Chowmahalla Palace news, Chowmahalla Palace photos, Chowmahalla Palace wikipedia, Chowmahalla Palace nizam built, Chowmahalla Palace exhibition, hyderabad city, telangana state, nizam dynasty, Chowmahalla Palace nizam rules, india history, hyderabad city history

Chowmahalla Palace story which is built by nizam in hyderabad telangana state

నిజాంకాలంనాటి చౌమహల్లా ప్యాలెస్ అద్భుత విశేషాలు

Posted: 11/14/2014 04:23 PM IST
Chowmahalla palace story which is built by nizam in hyderabad telangana state

నిజాంపరిపాలన కాలంనాటికి సంబంధించిన పురాతన కట్టడాలు, శిలాశాసనాలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఎంతో వైభవంగా కనువిందు చేస్తుంటాయి. కొన్ని నిర్మాణాలు మూతపడిపోయివుంటే.. మరికొన్ని మాత్రం అద్భుతంగా కనువిందు చేస్తూ ప్రేక్షక-పర్యాటకుల్ని బాగానే ఆకర్షిస్తున్నాయి. అటువంటివాటిల్లో చౌమహల్లా ప్యాలెస్ కూడా ఒకటి! ఇది ఎంతో విలాసవంతమైన భవంతి! ఆనాడు నిజాంరాజులు ఏవిధంగా రాజభోగాలు అనుభవించేవారో ఈ భవంతిని చూస్తే పూర్తిగా అర్థమైపోతుంది... అంతటి అద్భుతమైన నిలయం అది!

చరిత్ర :

అసఫ్ జాహి వంశపు పరిపాలనా రాజధానిగా వుండే హైదరాబాదులో వున్న ఈ అద్భుతమైన నిజాం నివాసం స్థలం... బర్కత్ అలీ ఖాన్ ముకర్రం జాహ్ ఆస్తిగా పరిగణించబడుతుంది. ఆనాడు ఉన్నతస్థాయి ప్రభుత్వ, రాజరిక కార్యక్రమాలన్నీ ఈ ప్యాలెస్ లోనే జరిగేవి. ఈ ప్యాలెస్ ను నిర్మించడానికి కొన్ని దశాబ్దాలకాలం పట్టింది. 1750వ సంవత్సరంలో సలాబత్ జంగ్ అనే ఒకతను దీని నిర్మాణాన్ని ప్రారంభించాడు. అప్పటినుంచి మొదలైన ఈ నిర్మాణ కార్యక్రమాలు కొన్ని దశాబ్దాల వరకు కొనసాగుతూనే వచ్చాయి. అలా సాగుతున్న నేపథ్యంలోఐదవ నిజాం అయిన అసఫ్ జాహ్ 5 దీనిని 1857 - 1869 మధ్యకాలంలో పూర్తిచేశాడు. విలక్షణమైన నిర్మాణానికి ప్రసిద్ధి అయిన ఈ సౌధం.. టెహ్రాన్ లోని షాహే ఇరాన్ సౌదానికి నమూనాగా భావిస్తారు. మొదట్లో ఈ సౌధం 45 ఎకరాల్లో విస్తరించి వుండేది కానీ.. నేడు కేవలం 14 ఎకరాల్లో మాత్రమే వుంది.

నిర్మాణం :

కొన్ని దశాబ్దాలపాటు జరిగిన నిర్మాణ సమయంలో కొత్తకొత్త ఒరవడులు చవిచూసిన నేపథ్యంలో.. ఇందులో చాలామార్పులు చేయాల్సి వచ్చింది. అందుకే దీని నిర్మాణం వందేళ్లకుపైగా ఎక్కువ సమయం పట్టింది. ఈ సౌధంలో దక్షిణ, ఉత్తరం పేర్లతో రెండు ప్రాంగణాలు వున్నాయి.

ఇందులో దక్షిణ భాగం గురించి విశ్లేషిస్తే.. సౌధంలో ఇది ఎంతో పురాతనమైన భాగం. ఇందులో అఫ్జల్ మహల్, మహతాబ్ మహల్, తహ్నియత్ మహల్, ఆఫ్తాబ్ మహల్ అనే నాలుగు చిన్న సౌధాలున్నాయి. ఇవి నూతన సాంప్రదాయక రీతిలో నిర్మించబడి వున్నాయి.

ఇక ఉత్తర భాగంలో ‘‘బారా ఇమాం’’ వుండేది. తూర్పువైపున ఓ పొడవైన గదుల సమూహమైన ఈ విభాగంలోనే ప్రభుత్వ పరిపాలనా విభాగముండేది. అలాగే మొఘలుల శైలిలో గల అనేక గుమ్మటాలు, పర్షియన్ నిర్మాణశైలిలో గల అనేక రూపాలు వున్నాయి.

చౌమహల్లాలో వుండే అద్భుతమైన నిర్మాణాలు :

ఖిల్వత్ ముబారక్ : ఇది చౌమహల్లా ప్యాలెస్ కు గుండెకాయగా పరిగణించబడుతుంది. ఇది ఆసఫ్ జాహీ వంశపు అధికారిక ప్రదేశం. ఇందులోని ఉన్నత స్తంభాల విశాలమైన హాలు, ప్లాట్-ఫాం పాలరాయితో నిర్మితమయింది. దీనిపై తక్తే-నిషాన్ (సింహాసనం) వున్నది. నిజాంలు ఇక్కడ తమ దర్బారును (సభను) సమావేశాపరచేవారు. ఇవే గాక మతపరమైన ఉత్సవాలుకూడా ఇక్కడ జరిపేవారు. ఇందులో బెల్జియం నుండి తేబడిన 19 ఝూమర్లు లేదా షాన్డిలియర్స్ ఒక ప్రత్యేక ఆకర్షణ.

క్లాక్ టవర్ : చౌమహల్లా సౌధంలోని ప్రధాన ద్వారంపై నిర్మింపబడిన గడియార స్తంభమే ఈ క్లాక్ టవర్. దీనినే ఖిల్వత్ గడియారం అని అంటారు. ఈ స్తంభంపై వున్న ఈ గడియారం దాదాపు 250 సంవత్సరాలుగా ‘‘టిక్ టిక్’’ అంటూ నడుస్తూనే వుంది. ఇది మెకానికల్ గడియారం కావడం వల్ల.. గడియారపు రిపేరీకి చెందినా ఒక కుటుంబం వారు ప్రతివారం దీనికి ‘‘కీ’’ ఇస్తూ వుంటారు.

కౌన్సిల్ హాల్ : ఇందులో అమూల్యమైన అనేక గ్రంధాలు, ప్రతులు వున్నాయి. నిజాం తన ముఖ్య అనుచరులను, అధికారులను, అతిథులను ఇక్కడే సమావేశ పరిచేవాడు. ప్రస్తుతం ఇది ఒక తాత్కాలిక ఎక్జిబిషన్ గా నడుస్తోంది. ఇందులో ప్యాలెస్ కు చెందినా అనేక విలువైన వస్తువులు, చారిత్రిక వస్తుసామాగ్రి, మొదలగునవి ప్రదర్శిమ్పబడుతాయి.

రోషన్ బంగ్లా : ఆరవ నిజాం తన తల్లి రౌషన్ బేగం జ్ఞాపకార్థంగా దీనిని నిర్మించారని చరిత్రకారులు చెబుతుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chowmahalla Palace  nizam family history  hyderabad city  telangana state  telugu news  

Other Articles