Nalanda university great history bihar state gautam budha time

nalanda university, nalanda university news, nalanda university history, nalanda university wikipedia, nalanda university story, nalanda university history story, nalanda university wikipedia, nalanda university biography, great universities in india, indian universities

nalanda university great history bihar state gautam budha time

ప్రపంచంలోనే మొట్టమొదట రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం

Posted: 11/12/2014 03:54 PM IST
Nalanda university great history bihar state gautam budha time

ప్రాచీన సంస్కృతీ-సంప్రదాయాలకు భారతదేశం ఎంతో గొప్ప నిలయంగా పేర్కొబడిన విషయం తెలిసిందే! యావత్తు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడాలేని విధంగా రాజులకాలంనాటికి చెందిన కొన్ని అద్భుతమైన కట్టడాలు కొలువై వున్నాయి. అటువంటి వాటిల్లో నలంద విశ్వవిద్యాలయం కూడా ఒకటి! నలంద అనే సంస్కృతంలో జ్ఞానాన్ని ఇచ్చేదని అర్థం. చారిత్రక అధ్యయనాల ప్రకారం.. ఈ విద్యాలయం క్రీ.శ. 450లో ప్రారంభమైందని తెలుస్తోంది. ఆనాడు గుప్త చక్రవర్తులు.. ముఖ్యంగా ప్రత్యేకించి కుమారగుప్తుడు చేత ఇది నిర్మించబడిందని.. ఆయన దీనికి పోషకులుగా ఉండేవారని కొన్ని శాసనాలు తెలుపుతున్నాయి. దీనికి ‘నలంద’ అనే పేరు రావడానికి ఒక చరిత్ర దాగివుంది. చైనా తీర్థయాత్రికుడైన హ్యూయన్ త్సాంగ్ ఇచ్చిన వివరణ ప్రకారం.. ఒకప్పుడు బోధిసత్వుని రాజధాని ఇక్కడ ఉండేదని... ఆయన నిరంతరం పేదలకు దానాలు చేసేవాడని... అందుకే నలందా అన్న పేరు వచ్చిందని వివరించాడు.

విషయాలు :

బీహార్ రాష్ట్రంలో వున్న ఈ విశ్వవిద్యాలయం పాట్నాకు ఆగ్నేయంగా 55 మైళ్ల దూరంలో వుంది. ఇది క్రీ.శ. 427 నుంచి క్రీ.శ. 1197 వరక బౌద్ధవిజ్ఞాన కేంద్రంగానూ... పాక్షికంగా పాలవంశం పాలనలో వుందని కొన్ని శాసనాలు తెలుపుతున్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి రెసిడెన్షియల్ (విద్యార్థులుకోసం వసతి గృహాలు కలిగి వుండే విద్యాలయం) విశ్వవిద్యాలయమైన నలందాలో సుమారుగా 10,000 మంది విద్యార్థులు, 2,000 మంది బోధకులు వుండేవారు. పెనుగోడ, ద్వారంతో ఇది ‘అతి ఘనమైన కట్టడం’గా గుర్తించబడింది. ఇందులో పదిగుళ్లూ, ఎన్నొ ధ్యాన మందిరాలు, తరగతి గదులు వుండేవి. ఆవరణలో కొలనులు, ఉద్యాన వనాలు ఉండేవి. ఇందులో వున్న గ్రంథాలయం తొమ్మిది అంతస్థుల భవనం. ఈ విశ్వవిద్యాలయం అప్పట్లో విదేశీ వాళ్లను సైతం ఆకర్షించింది. ఆ నేపథ్యంలోనే ఎంతోమంది సందర్శకులు ఇక్కడే స్థిరపడ్డారు కూడా!

పతనం :

1193 సంవత్సరకాలానికి ముందు ఒక గొప్ప విశ్వవిద్యాలయంగానూ, పాక్షిక రాజ్యాధికారంగా వుండే ఈ నలంద విశ్వవిద్యాలయం.. ఆ తరువాత వచ్చిన రాజవంశస్థులు దీని రూపురేఖలే మార్చేశారు. 1193లో  భక్తియార్ ఖిల్జీ నాయకత్వములో తురుష్క సేనలు దండెత్తి నలందా విశ్వవిద్యాలయ సముదాయాన్ని కొల్లగొట్టాయి. ఈ సంఘటన వల్లే భారతదేశంలో బౌద్ధమత క్షీణతకు మైలురాయిగా మారిందని భావిస్తారు. అయితే 1235లో టిబెట్ అనువాదకుడు ఛాగ్ లోట్స్‌వా నలందను సందర్శించినపుడు.. అది కొల్లగొట్టబడి జీర్ణవ్యవస్థలో వున్నప్పటికీ కొంతమంది భిక్షవులతో నడపబడేది. కానీ తర్వాతి సంగతి మాత్రం తెలియరాలేదు. అయితే నలంద నాశనం కావడం వల్లే గణితము, ఖగోళశాస్త్రము, రసాయన శాస్త్రం స్వరూపశాస్త్రం మొదలగు శాస్త్రాలలో ప్రాచీన భారతీయ విజ్ఞానము అకస్మాత్తుగా అంతరించిపోయింది.

బుద్ధుని కాలంలో నలంద :

గౌతమబుద్ధుడు చాలాసార్లు ఈ నలంద విశ్వవిద్యాలయం చుట్టుపక్కల ప్రాంతంలోనే తిరిగేవాడని.. అక్కడే కొన్నిరోజులవరకు వున్నాడని అంటాడు. ఆయన నలందను సందర్శించిన సమయంలో సాధారణంగా పావారిక మామిడితోపులో బస చేసేవాడు. అక్కడే ఉపాళీ-గహపతి, దీఘాతపస్సీలతో చర్చలు జరిపేవాడని.. అలాగే కేవత్తతో, అసిబంధకపుత్తతో కూడా అనేక చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కేవత్తసుత్త ప్రకారం... బుద్ధునికాలంలోనే నలందకు ఎక్కువ ప్రాముఖ్యత వుండేదని.. ఆ సమయంలో ఎక్కువ జనాభాతో ఆ నగరం బాగానే వృద్ధి చెందిందని ఆధారాలు తెలుపుతున్నాయి. అయితే బుద్ధుని వెళ్లిన తర్వాత అది చాలాకాలం వరకు విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందలేదని సమాచారం. బుద్ధుని కుడిభుజంగా పిలువబడే ఆయన శిష్యుడు సారిపుత్త ఈ నలందలోనే జన్మించి, మరణించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nalanda university  great universities india  india history  telugu news  

Other Articles