Pamukkale tourist attractions

pamukkale, pamukkale guide, pamukkale travel guide, pamukkale transportation, pamukkale information

pamukkale, pamukkale guide, pamukkale travel guide, pamukkale transportation, pamukkale information

మంచు సోయగాల నగర సౌందర్యం

Posted: 12/03/2013 08:34 PM IST
Pamukkale tourist attractions

టర్కీలోని పర్యాటక ప్రాంతాలను పూర్తిగా చూడాలంటే మూడు నెలలు పడుతుందనేది ప్రసిద్ధ నానుడి. ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన టర్కీ విషయంలో ఈ నానుడి తప్పు అని నిరూపిస్తుంది ‘పముక్కలే’. ప్రకృతి సౌందర్యాలనెన్నో ఒడిలోదాచుకొన్న ఈ దేశంలో పముక్కలే అందాన్ని ఆస్వాదించడానికే ఆరు రుతువులు సరిపోవు! ఎందుకంటే ఒక్కో రుతువు ఒక్కో రకమైన సౌందర్యాన్ని తెచ్చి పెట్టుకుంటుంది. అందానికి మంచు రూపంలో నిర్వచనం చెబితే అది పముక్కలే! టర్కీ భాష లో పముక్కలే అంటే ‘కాటన్ క్యాజల్ ’ అని అర్థం. పట్టులా కనిపించే తెల్లని మంచు వల్ల దీనికి ఈ పేరు వచ్చింది.

క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నుంచే పముక్కలే ఒక పర్యాటక ప్రాంతంగా పేరు పొందింది. అప్పటి నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తూనే ఉన్నారు. ఇంకా తనివితీరలేదు. మెట్లు మెట్లుగా ఉన్న లైమ్ స్టోన్ కొండ చరియలను మంచు కప్పి ఉంటుంది. అందులో ఉండే నీరు స్పష్టంగా, స్వచ్ఛంగా ఉంటుంది. ఒక అందమైన అనుభూతిని మిగులుస్తుంది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్  అభివృద్ధి చెందిన మానవ నాగరకతకు ప్రతినిధి లాంటిది.  చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం, కాలుష్య కారకాలను జయించి నిర్మితమైన నగరాలు, ప్రకృతి సోయగాలు, అద్భుత నిర్మాణాలు టర్కీలోని ప్రధాన ఆకర్షణలు. సౌకర్యాల పరంగా ఇస్తాంబుల్ ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో నిలుస్తోంది. పముక్కలే కొండ ప్రాంతంలో వేసవి కాలంలో చుట్టూ మంచు ఉన్నప్పటికీ, ఆ మంచు కరగకపోయినా ఈ చెలమల్లోని నీరు వెచ్చగా ఉంటుంది. ఆ సమయంలో ఈ నీటిలో స్నానం చేస్తే రక్తపోటు, నేత్ర, చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం.

ఈ నమ్మకం పముక్కలేకు విజిటర్ల సంఖ్యను పెంచుతోంది. ఒకవైపు ప్రకృతి సౌందర్యం, మరోవైపు ట్రావెటైన్‌లో స్నానం ఇవి పముక్కలే ప్రాధాన్యతను పెంచుతున్నాయి. ఇక్కడ క్లియోపాత్ర అనే కొలను ఉంటుంది. అందులో నీరు స్వచ్ఛతకు ప్రసిద్ధి. ఎంతమంది స్నానాలు చేస్తున్నా ఆ నీరు చాలా స్వచ్ఛంగా అలాగే ఉంటుంది. నీటి కింద ఈదుతున్న వారిని కూడా స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ జలకాలాటకు జనం పోటీ పడుతుంటారు. పముక్కలే కేవలం నాలుగు వీధులున్న ఒక చిన్న టౌన్. చిన్న చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు, సర్వీసెస్ షాపులు, బస్ టికెట్ ఆఫీసులుంటాయి. టూరిజం పరంగా చాలా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో బస చేసే అవకాశాలకు కొదవలేదు. సంవత్సరమంతా పముక్కలేని సందర్శించవచ్చు. అయితే శీతాకాలంలో మాత్రం పముక్కలే అందం వర్ణింప శక్యం కానిది. ముక్కలేలో వేసవి కాలంలో ఉదయం ఐదున్నరకే సూర్యుడు పలకరిస్తాడు. రాత్రి ఎనిమిది గంటలకు గానీ సూర్యాస్తమయం కాదు. అదే శీతాకాలంలో అయితే పగటి సమయం మరీ తక్కువ.

ఏ పది గంటలో కాస్తంత వెలుగు ఉంటుంది. ఆ తర్వాత చీకట్లు కమ్ముకొంటాయి. సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో కాంతి పరావర్తనంతో మంచు విభిన్న రంగుల్లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. 1988లో పముక్కలేని ప్రపంచ వారసత్వ స్థలాల్లో ఒకటిగా ప్రకటించారు. ఈ ప్రాంతానికి చేరుకోవడానికి చాలా సౌకర్యాలు ఉన్నాయి. పముక్కలేకు చేరుకోవాలంటే టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్  ప్రధాన విమానాశ్రయం. ప్రపంచంలోని దాదాపు అన్ని పెద్దదేశాల్లోని ప్రధాన నగరాల నుంచి ఇక్కడకు విమానాలుంటాయి. అక్కడి నుంచి డెనిజిల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని 45 నిమిషాలు కారులో ప్రయాణిస్తే పముక్కలే వస్తుంది. లేకపోతే ఇస్తాంబుల్ నుంచే నేరు బస్సు ద్వారానో, కారు ద్వారానో చేరుకోవచ్చు. రోడ్లు అంత బాగోకపోయినా చుట్టూ పరిసరాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles