Our exploration to be continued

exploration, human life, money, name, prestige, status, Feng Shui, families, children, happiness,

our exploration to be continued

మన అన్వేషణని కొనసాగిద్దాం !

Posted: 05/17/2013 06:10 PM IST
Our exploration to be continued

నిన్న చెప్పుకొన్నట్టు గా , ప్రతీ రోజు మన అన్వేషణ ప్రశాంతమైన జీవితం కోసమే . ఈ ప్రశాంతత మీకు వేరుగా ఉంటె , మీ చుట్టూ ఉన్నవారు ఈ పదానికి అర్ధం ఇంకోలా చెబుతారు . కొందరికి , డబ్బు , పేరు , పలుకుబడి , హోదా ప్రశాంతతని ఇస్తే , ఇంకొందరికి , మానవ ,సంబంధాలు ప్రేమ బంధాలు మెరుగుపరచుకోవడం లోనే ఆనందం ఉంది . మరి , ఇక ఏ రకంగా అయినా , మనస్సు ప్రశాంతతని కోరుకుంటున్నట్లయితే , నిన్నటి అన్వేషణకు కొనసాగింపుగా , మరి కొన్ని ఫెంగ్ షుయి చిట్కాలు , మీ ప్రశాంతతని మీరు అన్వేషించుకునే దిశగా ;

చిన్న పిల్లలు పడుకునే గది (ఐదేళ్లలోపువారు) కొట్టొచ్చినట్లు ఉండే రంగులలో కాకుండా, లైట్ కలర్‌లలో ఉండాలి. లేనప్పుడు వారికి ప్రశాంతతగా నిద్రపట్టదు. ఈ మధ్య స్ట్రయిట్, కోకొకోలా లాంటి బాటిల్ రంగు రంగులవి వస్తున్నాయి. మీ బాషువా ప్రకారం మీకు కలిసివచ్చు రంగున్న బాటిల్‌లో మంతి నీళ్లు తాగండి. అలాగే కనీసం వారానికి ఒకసారైనా లెటర్ రాసేటప్పడైనా ఇలా స్వంత పనులకైనా మీకు కలిసివచ్చు రంగున్న పెన్ వాడండి. నిజానికి దోషాలున్నప్పుడు వివాహానికి, ఉద్యోగానికి ఇలా సరిపోయే రత్నాలు వర్తించే రంగుల్లో ఎంచుకోండి. మీరు ఇల్లు మారేటప్పుడు అందులో ఉండగా జరిగిన కనీసం ఒక మంచి అంశాన్ని మీకు కలిసి వచ్చే రంగులో ఒక కాగితంపై రాయండి. దానిని ఒక నీరున్న పళ్ళెం లేదా గిన్నెలో పెట్టండి. గాజుదైతే మంచిది. ఇలా చేయడం వల్ల మీరు సరైన రీతిలో దానికి కృతజ్ఞత చెప్పినట్లు అవుతుంది.

ఫెంగ్‌షుయ్ ప్రకారం గాలి, వెలుతురు, నీరు ఎంత ముఖ్యమో శుభ్రత కూడా అంతే ముఖ్యం. అందుకే ఇంట్లో పనికిరాని వస్తువుల్ని తీసి బయట పారేయాలనేది ఫెంగ్‌షుయ్‌లో ప్రథమ సూత్రం. రాత్రిపూట బట్టలు ఉతికేయవద్దని ఫెంగ్‌షుయ్ హెచ్చరిస్తోంది. అలా రాత్రివేళ ఉతికి ఆరేసిన బట్టలు దయ్యాలను, అతీతశక్తులను ఆకర్షిస్తాయని చైనీయుల నమ్మకం. కొంతమంది అర్జెంటుగా రాత్రి రాత్రే బట్టలు ఉతికి బయట ఆరేస్తారు. అలాంటి పని మానుకోమని ఫెంగ్‌షుయ్ హెచ్చరిస్తోంది.

మనలో చాలా మంది గ్రూప్ ఫోటోలు దిగుతారు. అయితే చైనీష్ వాస్తు ప్రకారం ముగ్గురు వ్యక్తులు వరసగా నిలబడున్న ఫోటోలు మంచివి కావు. అయితే ఈ నిబంధన కుటుంబ సభ్యులున్న ఫోటోలకు వర్తించదు. అలా ఫోటోల్లో ముగ్గురు వ్యక్తులు వుంటే అది సంఘర్షణకు దారితీస్తుందని చైనీయుల నమ్మకం.

మానసిక ఆందోళనలతో చాలామందికి రాత్రిళ్లు వెంటనే నిద్రపట్టదు. అలాంటి వారు కొన్ని ఫెంగ్‌‌షుయ్ పరిష్కారాలను పాటిస్తే చక్కగా నిద్ర పడుతుంది. ముందుగా మీరు పడుకునే మంచం గోడకు ఆనుకుని (సపోర్ట్‌గా) ఉండాలి. గోడనుండి ఒక అడుగు దూరం స్థలాన్ని వదిలేసి మంచాన్ని వేసుకోండి. అలాగే మీ బెడ్‌ని ప్రతిఫలించే విధంగా ఏ రకమైన అద్దం బెడ్‌రూమ్‌లో ఉండకూడదు. అంతేకాక చాలామంది గాలి బాగా వస్తుందని మంచాన్ని కిటికి, ద్వారం దగ్గర లేదా క్రిందగా ఏర్పాటు చేసుకుంటారు. కాని ఫెంగ్‌షుయ్ ప్రకారం అది తప్పు. మీ మంచం కిటికీలకు, తలుపులకు దూరంగా ఉండాలి.

మాతృత్వం ఓ మధురానుభూతి. జీవితంలో ఓ వెలుగును నింపే సంతానం కలుగలేదని బాధపడుతున్నారా.. అయితే ఫెంగ్‌షుయ్ సూచనలు పాటించండి. సంతానం లేని దంపతులు ఫెంగ్‌షుయ్ చిట్కాలు పాటించడం ద్వారా పండంటి బిడ్డను కనవచ్చునని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా దంపతులు శయనించే బెడ్‌కి సమీపంలో చిన్న పిల్లలున్న బొమ్మలను గాని, పెయింటింగ్ గానీ వేలాడదీయండి. అలాగే మీ భర్త భాఘువా నెంబర్‌ని కనుక్కొని, దాని ప్రకారం అతడికి కలిసొచ్చేలా మంచాన్ని జరపండి.

మీరు కొత్తగా పెళ్లైన దంపతులా? మీ బెడ్‌రూమ్‌లో ఆనందకరమైన వాతావరణం నెలకొనాలని భావిస్తున్నారా? అయితే ఫెంగ్‌షుయ్ పేర్కొన్న కొన్ని సూచనలు పాటిస్తే సరిపోతుంది. ముఖ్యంగా పెళ్లైన మొదటి రోజుల్లో బెడ్‌రూమ్‌ని ఎరుపురంగులతో అలంకరించండని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఎరుపు డైనమిజానికి చిహ్నం. అలాగే పెళ్లైన కొత్త దంపతులు వాడే బెడ్‌రూమ్‌లో తెల్లని బెడ్‌షీట్‌లకు వాడకూడదు. బెడ్‌రూమ్‌లో ఎప్పుడూ మొక్కలను, పువ్వులను ఉంచకూడదు. అలాగే మీ పడకగదిలో ఎప్పుడూ నీళ్లకి సంబంధించిన వాటిని తొలగించడం మంచిది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles