England tourism and information

England Information, England, United Kingdom, Europe,

England Information and Tourism Europe - England is the largest country in the United Kingdom of Great Britain and borders Wales to the West and Scotland to the North. The English Channel and the North Sea separates England from Europe and the Irish Sea separates Ireland

England Tourism and Information.png

Posted: 01/31/2013 03:25 PM IST
England tourism and information

towerbridge

ప్రపంచ దేశాల్లో మనకు ఏ దేశం తెలిసినా, ఏ దేశం తెలియక పోయినా ఇంగ్లండ్ తప్పక తెలిసి ఉంటుంది. యూరప్ నుంచి ఇండియాకు సముద్రమార్గాన్ని కనుక్కున్న పోర్చుగీసు వాళ్లనైనా మర్చిపోతామేమో కానీ వ్యాపారం పేరుతో వచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకున్న బ్రిటిషర్లు మనకు ఎరుకే. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనే ట్యాగ్‌లైన్ కోసం దేశాలు, దీవులు, ఖండాల మీద తన మార్కు కోసం తపించిన దేశం ఇది. మనవాళ్లు భారతదేశంలో బ్రిటిష్ పాలనను వ్యతిరేకించినప్పటికీ బ్రిటన్‌లో చదువుకోవడాన్ని గొప్పగా భావించేవాళ్లు. అలాంటి దేశం యొక్క జీవన శైలి, పర్యాటకం గురించి ఈ వారం తెలుసుకుందాం....

వందల ఏళ్ల నిర్మాణాలు... !

ఇంగ్లండ్‌లో ఆరు వందల ఏళ్లనాటి ఇళ్లు ఇప్పటికీ వాడకంలో ఉన్నాయి. చారిత్రక భవనాలతోపాటు సామాన్య నిర్మాణాలు కూడా వందలయేళ్లపాటు పటిష్టంగా ఉంటాయి. ఇక్కడ ఇళ్ల నిర్మాణం మంచు జారిపోవడానికి వీలుగా ఏటవాలు కప్పుతో ఉంటుంది. గడ్డకట్టించే మంచు ఇంట్లో దూరకుండా కిటికీలకు లావు అద్దాలుంటాయి. దానిపైన ఉడెన్ డోర్, ఐరన్ మెష్ ఉంటుంది. మంచు తెల్లగా ఆకాశం నుంచి దూదిరాలుతున్నట్లు ఉంటుంది. చలికాలంలో ఎండ వచ్చినా వెలుతురు తప్ప వెచ్చదనం ఉండదు. వెలుతురును చూసి గ్లవ్స్ తీసేస్తే చేతులు గడ్డకట్టిపోతాయి. తమాషా ఏమిటంటే... ఇంత చలిలోనూ ఐస్‌క్రీమ్ పార్లర్లు జనంతో నిండుగా ఉంటాయి. ఇళ్ల ముందు ఓక్ చెట్లు బారులు తీరి ఉంటాయి. గ్రామాల్లో పచ్చదనం కళ్లు చెదిరేలా ఉంటుంది. ఇల్లు ఎక్కడో ఒకటి - రెండు తప్ప పెద్దగా కనిపించవు. గ్రామాల్లో ఆవులను పెంచుతారు. డైరీ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. వీళ్ల ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులు వాడకమూ ఎక్కువే. మన దగ్గర చెరకు పంటకు అనుబంధంగా బెల్లం, చక్కెర పరిశ్రమలు ఉన్నట్లు ఇక్కడ ద్రాక్ష పంట, దానికి అనుబంధంగా వైన్ తయారీ పరిశ్రమ అభివృద్ధి చెందింది.

london-iజీవన శైలి....!

ఇంగ్లండ్ వాళ్ల్లు మంచి ఎత్తు, రంగుతో దృఢంగా, డిగ్నిఫైడ్‌గా కనిపిస్తారు. వీళ్లు ఎవరితోనూ పెద్దగా కలవరు. తమను తాము గొప్ప అనుకుంటారు. టూరిస్టుల ప్రదేశాల్లో అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటారు. వెచ్చదనం కోసం కాబోలు నల్లరంగు ఎక్కువ వాడతారు. కార్లు కూడా నల్లవే. తెల్లకారు కనిపించదు. ఇక్కడ ఉద్యోగులు ఉదయం కారు అద్దెకు తీసుకుని ఆఫీసుకు వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తూ వెనక్కి ఇస్తుంటారు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లెసైన్స్ ఉంటే పర్యాటకులకు కూడా కారు అద్దెకిస్తారు. ఇక్కడ నెలకు రెండువేల పౌండ్లు సంపాదించేవాళ్లు కూడా సొంతకారు కొనగలుగుతారు. ఇక్కడ రెగ్యులర్ ఉద్యోగులకు పనిగంటల్లో వెసులుబాటు ఉంటుంది. ఆఫీసుకు రావడం ఓ అరగంట లేటయితే డ్యూటీ అవర్స్ తర్వాత అరగంట ఎక్కువ పని చేస్తే చాలు. ఎన్ని గంటలు పనిచేశారన్నదే ముఖ్యం.

ప్రధాన ఆదాయవనరుల్లో సింగిల్ నంబర్ లాటరీ, రేసులు, కాసినోలు ఉంటాయి. ముసలివాళ్లు వారానికొకసారి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తీసుకుని లాటరీ, రేసులో పెడతారు. పబ్‌లు సందుసందుకీ, నివాసగృహాల పక్కన కూడా ఉంటాయి. పదిపౌండ్లు మెంబర్ షిప్ కడితే నెలరోజులు వెళ్లవచ్చు. స్థానికులు చాలామంది పబ్బులకు అడిక్ట్ అయి వారమంతా సంపాదించి వారాంతంలో ఖర్చు చేస్తుంటారు.

రవాణా వ్యవస్థ....!

ఇంగ్లండ్‌లో నాలుగు రకాల రైళ్లు నడుస్తుంటాయి. అండర్ గ్రౌండ్ ట్రైన్ రిమోట్‌తో నడుస్తుంది. రైళ్లు ఆగిన తర్వాత డోర్ ఓపెనింగ్ టైమ్, క్లోజింగ్ టైమ్ అనౌన్స్‌మెంట్ వస్తుంది. రైల్వేస్టేషన్‌లో న్యూస్‌పేపర్ ఫ్రీ. ఎవరికి కావల్సిన పేపర్ వాళ్లు తీసుకుని చదువుతూ రెలైక్కుతారు, చదవడం అయ్యాక ఆ పేపర్‌ను మరొకరు చదవడానికి రైల్లో వదిలేస్తారు. రైలు ప్రయాణించే ప్రదేశాల పేరు, అక్కడ చూడాల్సిన పర్యాటక ప్రదేశాల వివరాలు వినిపిస్తుంటాయి, డిస్‌ప్లే బోర్డులో కనిపిస్తుంటాయి. ఇంగ్లిష్ వస్తే గైడ్ లేకుండా తిరగవచ్చు. ఇక్కడ బస్సులన్నీ డబుల్‌డెక్కర్‌లే. రైలుకి, బస్సుకి అయిస్టర్ అని ఒకే ట్రావెల్ కార్డు. ఎంట్రన్స్‌లో గేట్ దగ్గర కార్డు చూపిస్తే సెన్సర్ గ్రహించి గ్రీన్‌లైట్ వెలిగి లాక్ ఓపెన్ అవుతుంది. ట్రైన్ దిగిన స్టేషన్‌లో బయటకు వెళ్లేటప్పుడు మళ్లీ కార్డుని సెన్సర్ దగ్గర చూపించాలి. ట్రావెల్ కార్డు నుంచి మనం ప్రయాణం చేసిన దూరానికి తగిన అమౌంట్ తగ్గిపోతుంది. ఇక్కడ టెక్నాలజీ ప్రతిరంగంలోనూ ముందంజలోనే ఉందనిపిస్తుంది.

big-benఇంగ్లండ్ పర్యాటకం... !

ఇంగ్లండ్‌లో రాజరికపు ఠీవి, రాణివాసపు సుకుమారం కలగలిసి ఉంటాయి. ఇక్కడ మ్యూజియాలు ఎక్కువ. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం, అపోలో 17 వ్యోమనౌకకు నిలయం సైన్స్ మ్యూజియం, జాతి గొప్పదనాన్ని చాటే నేషనల్ మ్యూజియం ఉన్నాయి. బ్రిటిష్ మ్యూజియంలో రాజుల కత్తులు, ఆభరణాలు, దుస్తులు ఉన్నాయి. మొట్టమొదటి రైలింజన్, అపోలో అంతరిక్షం నుంచి తీసిన భూమి ఫొటో కూడా చూడవచ్చు. ఇక్కడ పర్యటనలో లండన్ ఐ, థేమ్స్ నదిలో విహారం, షేక్స్‌పియర్ ఇల్లు, లండన్ బ్రిడ్జి, బ్రిటిష్ లైబ్రరీ, క్వీన్స్ ప్యాలెస్, రాయల్ ఫ్యామిలీ ప్యాలెస్ చూస్తూ 10 డౌనింగ్ స్ట్రీట్‌లో విహారం, రాయల్ అబ్జర్వేటరీ, బిగ్‌బెన్ క్లాక్ టవర్ ముఖ్యమైనవి.

భద్రత పటిష్టం !

ఈ దేశం భద్రత విషయంలో ఏ మాత్రం రాజీపడదు. ప్రపంచంలో సగం నిఘా కెమెరాలు ఇంగ్లండ్‌లోనే ఉంటాయని చమత్కరిస్తుంటారు కూడా. మనం నివసించే ఫ్లాట్‌లోకి వెళ్లాలన్నా అపార్ట్‌మెంట్‌లో కెమెరా ముందు నిలబడితే ముఖం స్కాన్ అయిన తర్వాత డోర్ ఓపెన్ అవుతుంది. ట్రాఫిక్‌ను మానిటర్ చేసిదీ కెమెరాలే. పోలీసులు కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తుంటారు. సర్వీస్ ఎంత చక్కగా ఉంటుందంటే... లిఫ్ట్ ఆగిపోయినప్పుడు అలర్ట్ బటన్ నొక్కి మన కంప్లయింట్ రికార్డు చేస్తే రెండు నిమిషాల్లో వచ్చి రిపేరు చేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  United arab emirates tourism
History of prayag  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles