Information about switzerland

Switzerland, Confoederatio Helvetica, Administration, Canton, Kanton, Culture, Economy, Education, Food, Geography, Government, History, Holidays, Statistics

Information about Switzerland, including facts about Administration, Cantons, Culture, Economy, Education, Geography, History, Statistics and much more.

Information about Switzerland.png

Posted: 10/03/2012 03:17 PM IST
Information about switzerland

Switzerlandఅతర్జాతీయ సంస్థల కేంద్రస్థానం ఈ ప్రదేశం...సంపన్నదేశాల్లో తొలి ఐదుస్థానాల్లో ఉండే దేశం ఇది...ఇక్కడ అందరూ పనిమంతులే... ప్రణాళిక ఉన్నవాళ్లే. పరిశుభ్రతకు ప్రతీకలు ఈ ప్రదేశాలు... మనుషులు జలపాతాలు... నదితీరాలు...మంచుకొండలు... కొండవాలులో ఇళ్లు... ఆహ్లాదకరమైన ప్రదేశాల సుమహారం ఈ దేశం. సైన్స్ పరిశోధనలకు అనువైన ప్రదేశం. ప్రకృతి సౌందర్యాన్ని సొంతం చేసుకున్న ప్రదేశాలను ఒక్కమాటలో చెప్పాలంటే...మన రాష్ట్రానికి వైజాగ్... దేశానికి కాశ్మీర్... ప్రపంచానికి స్విట్జర్లాండ్...ఈ నగరం యొక్క విశేషాల పై ఓ సారి లుక్కేద్దాం....

స్విట్జర్లాండ్ అందమైన దేశం అని సింపుల్‌గా చెప్పేస్తే సరిపోదు. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి జోహార్ అనాల్సిందే. అంతకంటే ఎక్కువగా ప్రకృతిని పరిరక్షించుకునే విధానానికి ఇక్కడి ప్రజలకు అభివాదం చేయాలి. దేశంలో జ్యూరిక్, జెనీవా వంటి ప్రపంచ ప్రసిద్ధ నగరాలతోపాటు పట్టణాలు, గ్రామాలు అన్నీ పక్కాగా ఉంటాయి. వీళ్లది పూర్తిగా నగర సంస్కృతి కావడంతో గ్రామాలు కూడా మన పట్టణాల్లాగానే ఉంటాయి. చెప్తే తప్ప ఇది రూరల్ ఏరియా అనిపించదు. మనకు మహానగరాల్లో ఉండే బహుళజాతి కంపెనీల షాపింగ్‌మాల్‌లు, సూపర్‌మార్కెట్‌లు ఇక్కడ గ్రామాల్లోనూ కనిపిస్తుంటాయి. ప్రతి భవనమూ సౌకర్యవంతమైన నిర్మాణమే, చక్కటి లే అవుట్‌తో చూడడానికి ముచ్చటగా ఉంటాయి. జ్యూరిక్ దగ్గర రైన్ నది జలపాతం ఉంది, ఇది ఎక్కువ ఎత్తు ఉండదు మన ఎత్తిపోతల జలపాతాన్ని తలపిస్తుంది. యూరప్‌లో పెద్ద జలపాతం అని చెబుతారు. దీని ఎత్తు తక్కువే కానీ వేగం చాలా ఎక్కువ.

పనిమంతులు!

ఇక్కడ అందరూ పని చేస్తారు, ఒక్కరు కూడా బద్ధకంగా... ఏ పనీ లేకుండా జీవితాన్ని గడిపేయాలన్న ధోరణితో ఉండరు. ప్రతి ఒక్కరికీ అనేక పనులు వచ్చి ఉంటాయి. ఇంటికి పెయింటింగ్, చిన్న చిన్న రిపేర్లు సొంతంగా చేసుకుంటారు. పనికి విలువనిస్తారు, శ్రమైక జీవనాన్ని గౌరవిస్తారు. నిజాయితీ పరులు కూడ. స్విట్జర్లాండ్ ఫైనాన్షియల్ హబ్ కావడానికి ఇక్కడి వారిలో ఉండే కష్టించే తత్వం, కూడబెట్టే జాగ్రత్త, నిజాయితీగా వ్యవహరించే గుణం... ఈ మూడూ కారణాలే. దేశంలో పాడి పరిశ్రమ ఎక్కువ. ఇది పాడిపశువులను పెంచుకునే వ్యక్తుల సమూహాలు ఇక్కడికి వచ్చి స్థిరపడడంతో ఏర్పడిన దేశం. ఇక్కడ పాల ఉత్పత్తులకు అనుబంధంగా చాక్లెట్ల పరిశ్రమ కూడా విస్తృతంగా అభివృద్ధి చెందింది. చిన్న కుటుంబాలు!స్విస్‌లో ఫ్యామిలీ లైఫ్ ఆలస్యంగా మొదలవుతుంది. మహిళలు, పురుషులు ఇద్దరూ చదువుకుని కెరీర్‌లో స్థిరపడిన తర్వాత మాత్రమే పెళ్లి గురించి ఆలోచిస్తారు. మిగిలిన యూరప్ దేశాలతో పోలిస్తే స్విస్ మహిళ తొలిబిడ్డను కనే వయసు ముప్పైకి చేరుతోంది. ఇటీవల మన దగ్గర కూడా యువతీయువకులు జీవితాన్ని కెరీర్ కోణంలో చూస్తుండడంతో ఇదే పద్ధతి కొనసాగుతోంది. ఇక్కడ అన్నీ చిన్న కుటుంబాలే, ఒకరు లేదా ఇద్దరు పిల్లలనే కంటారు. ఇక్కడ జీవనవ్యయం చాలా ఎక్కువ. ఇది కూడా చిన్న కుటుంబాలకు కారణం. ప్రతి ఒక్కరూ కెరీర్ ఓరియెంటెడ్‌గా ఉంటారు కాబట్టి పిల్లల పెంపకం కోసం సమయం కేటాయించడమూ కష్టమే. ఇక్కడ వివాహవ్యవస్థ, కుటుంబ వ్యవస్థ పటిష్ఠంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ విడాకులు మిగిలిన యూరప్ దేశాల్లో ఉన్నట్లు ఉండవు.

Switzerland_ప్రకృతిని రక్షిస్తారు!

ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుకు ట్రామ్‌లు, ఎలక్ట్రిక్ బస్‌లు నడుస్తుంటాయి. శబ్దం ఉండదు, పొల్యూషన్ ఉండదు. బస్ వెనుక బస్ ఉన్నట్లు ఉండే ట్రైలర్ బస్సులు ఎక్కువ. రైళ్లు కూడా ఎక్కువే. పాదచారుల దారులు కూడా విశాలంగా, పరిశుభ్రంగా ఉంటాయి. ప్రజలు కానీ ప్రభుత్వం కానీ చేసే ప్రతి పనీ ప్రొడక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ప్రకృతిని కాపాడడానికి ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. కొండల మీద పచ్చదనాన్ని కూడా నిర్లక్ష్యం చేయరు. ఇక్కడి ప్రజలు, ప్రభుత్వాలు డెవలప్‌మెంట్ పేరుతో ప్రకృతిని అడ్డగోలుగా ధ్వంసం చేయడానికి వ్యతిరేకం. ఇక్కడ స్ట్రీట్‌ఫుడ్‌ని ప్రోత్సహించరు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఎక్కువ. రోడ్డు పక్కన ఉండే చిన్న రెస్టారెంట్‌లు కూడా నీట్‌గా ఉంటాయి. పైగా చట్టానికి చాలా విలువనిస్తారు. ఇలా చెప్పడం కంటే చట్టాన్ని, నియమాలను ఏ మాత్రం అతిక్రమించినా శిక్షలు కచ్చితంగా అమలవుతాయి. కాబట్టి రిజిస్ట్రేషన్ లేకుండా చాయ్ దుకాణం వంటి చిన్న వ్యాపారం కూడా జరగదు. బస్‌లో తినడం ఇక్కడ నిషిద్ధం.

మంచు ఇళ్లను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నిర్మాణ కౌశలం అద్భుతం అనిపిస్తుంది. మంచుతోనే షాపులు, రెస్టారెంట్లు ఉంటాయి. కేబుల్ కార్‌లో ఒక మంచు పర్వతం నుంచి మరో మంచు పర్వతం మీదకు వెళ్లేటప్పుడు కలిగే అనిర్వచనీయమైన అనుభూతిని వర్ణించలేం. ఇక్కడ మనకు ఆశ్చర్యం అనిపించే మరో అంశం ఏమిటంటే... ఏడాదిలో లక్షల మంది పర్యాటకులు సందర్శించే ఈ ప్రదేశంలో అపరిశుభ్రత మచ్చుకు కూడా కనిపించదు. ఇంటర్‌లేకెన్ దేశంలో ఆహ్లాదకరమైన హాలిడే స్పాట్. ఇంటర్నేషనల్ టూరిస్ట్ ప్లేస్ కూడ. బెర్న్ రాజధాని నగరం మాత్రమే కాదు దేశంలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న పురాతన నగరం. ఈ దేశంలో ప్రధాన నగరాలు బెర్న్, జెనీవా, జ్యూరిక్‌లు అత్యున్నత జీవన ప్రమాణాలున్న నగరం, శాంతియుత నగరం, నిజాయితీ నిండిన నగరం ఇలా ప్రపంచ ప్రఖ్యాతి పొందినవే.

సూర్యుని కోసం...

ఇక్కడ కాలం మనకంటే మూడున్నర గంటల వెనుక ఉంటుంది. మనకు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇక్కడ పగలు పదకొండున్నర. సూర్యుడు ఉదయిస్తే రోజు మొదలవుతుందని ఎదురు చూస్తే ఏడాదికి రెండొందల రోజులు కూడా నిండవు. సూర్యుడు అరుదుగా కనిపిస్తాడు. ఎండకాలం జూలైలో అత్యధిక ఉష్ణోగ్రత 26 డిగ్రీలుసెంటీగ్రేడ్ నమోదవుతుంది. డిసెంబర్, జనవరి నెలల కనీస ఉష్ణోగ్రత మైనస్ 0.5 సెంటీగ్రేడ్ నుంచి రెండు డిగ్రీలకు లోపే ఉంటుంది. ఇక్కడి వాళ్లు సూర్యరశ్మి కోసం వారాంతాల్లో ఇటలీకి వెళ్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Israel information and tourism
Success story of satish dhawan space centre shar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles