Information about italy

Italy, vacation, tourism, art, culture, history, events, nature, thermal, spas, sport, lakes, mountains, golf, sci, boating, adventure

Italy, vacation, tourism, art, culture, history, events, nature, thermal, spas, sport, lakes, mountains, golf, sci, boating, adventure

Information about Italy.png

Posted: 09/03/2012 02:50 PM IST
Information about italy

Information_about_Italy

Italyముస్సోలినీ పదఘట్టనలతో దద్దరిల్లిన నేల ఇది. రాజరికపు ఆనవాళ్లుగా రోమన్ కోటలు... అభివృద్ధి చిహ్నాలుగా ఫియట్... ఫెరారీ ఫ్యాక్టరీలకు నిలయం. పారిశ్రామికరంగంలో ఉన్నత శిఖరాలను అందుకుంటున్న ఈ దేశం... భారత్‌ను పోలిన మరో ద్వీపకల్పం. హిమాలయాలను పోలిన ఆల్ఫ్స్ పర్వతాలకు... ఎవరెస్టును పోలిన మౌంట్ బ్లాంక్ శిఖరానికి ఆలవాలం ఈ నేల. ఆధునికత బాటలో పయనం... ప్రకృతిని ప్రేమించే గుణం... ఇక్కడి ప్రజల సొంతం. కాలం విలువ ఎరిగి మసులుకోవడం... ఇక్కడి మనుషుల నైజం. ఇటలీ... నగరం విశేషాలు...

ఇటలీని భిన్నత్వంలో ఏకత్వంలో మన దేశంతో పోల్చవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఉన్నట్లే ప్రాంతాల వారీగా వేర్వేరు సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు ఉంటాయి. ప్రాచీన కాలంలోనే శిఖరాన్నంటిన సంస్కతి, ప్రకృతి వనరులతో సస్యశ్యామలం అయిన నేల, సమృద్ధిగా విలసిల్లుతున్న జనావాసాల మీద పొరుగు రాజ్యాల కన్ను పడడంతో నిరంతర యుద్ధాలు... వంటి అనుభవాలు ఈ దేశానికీ ఉన్నాయి. ఇండియాలాగానే ఇటలీ కూడా మూడు వైపులా నీళ్లు ఒక వైపు పర్వతాలు ఉన్న ద్వీపకల్పం.యాడ్రియాటిక్, లోనియన్, టైరెనియన్ సముద్రాలు మూడు వైపులా ఉన్నాయి. పురాతన నివాస ప్రాంతాలు, పాత రాతి యుగం ఆనవాళ్లు, మధ్యధరా సముద్రంతో మమైకం అయిన గ్రీకు, రోమ్ సంస్కృతులు, వాటి తాలూకు చారిత్రక, సాంస్కృతిక ఆకర్షణలు, అందమైన సముద్రతీరాలు, తీరప్రాంతవాసుల ప్రత్యేకమైన జీవనశైలి, వీటి ఆధారంగా అభివృద్ధి చెందిన పర్యాటకరంగం... ఇలా అనేక ప్రత్యేకతలున్న దేశం. ఇటలీ పర్యటనలో అమితంగా ఆకర్షించేవి ఇక్కడి వంటలు, వైన్.

ప్రకృతిని రక్షిస్తే... మనల్ని రక్షిస్తుంది !

ఇటలీ మాత్రమే కాదు యూరప్ దేశాలన్నీ ప్రకృతి సహజత్వాన్ని కాపాడడమే మనిషికి రక్ష అనే సిద్ధాంతాన్ని నమ్ముతాయి. ప్రకృతిని కాపాడితే అది మనల్ని రక్షిస్తుందని బలంగా నమ్ముతారు. ఇక్కడి వారిలో మంచి అలవాటు తమ పనులను తామే చేసుకోవడం. పనివారి మీద ఆధారపడడం చాలా తక్కువ. జనాభా తక్కువ కావడంతో పనివారికి డిమాండ్ ఎక్కువ. సర్వెంట్ మెయిడ్‌ని మెయింటెయిన్ చేయడం చాలా ఖర్చుతో కూడిన పని. యంత్రాల వాడకం ఎక్కువ కావడానికీ ఇదీ ఒక కారణమే.పైగా ఎవరి పనులను వారు చేసుకోవడాన్ని నామోషీగా భావించరు. పెద్ద హోటల్‌కు యజమాని కూడా మన దగ్గర కింది స్థాయి ఉద్యోగులు చేసే పనిని స్వయంగా చేసుకుంటాడు. యూరప్ వాసుల్లో మరో మంచి అలవాటు సమయపాలన. రైలు రావాల్సిన సమయం 8:23 నిమిషాలు అంటే ఇరవై రెండో నిమిషం రాదు, ఇరవై నాలుగో నిమిషమూ రాదు. ఇరవై మూడో నిమిషంలోనే ప్లాట్‌ఫామ్ మీద ఉంటుంది. అదే ప్లాట్ ఫామ్ మీద ఎనిమిది ఇరవై ఒకటికి ఒక రైలు వస్తే... మన రైలే రెండు నిమిషాలు ముందుగా వచ్చిందని ఎక్కామా! ఇక అంతే మరో గమ్యస్థానానికి చేరతాం. కొన్ని చోట్ల రైళ్లకూ బస్సులకూ ఒకే టికెట్ చెల్లుబాటులో ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ రూల్‌ని ప్రత్యక్షంగా మనిషి నియంత్రించడు.ప్రపంచ అద్భుతాల జాబితాలోకెక్కిన లీనింగ్ టవర్... పిసా నగరంలో ఉంది. ఇది పన్నెండవ శతాబ్దికి చెందిన ప్రసిద్ధ క్రైస్తవ ప్రార్థనా మందిరం. దీని పేరు టోర్ పెండెంట్ ది పిసా. ప్రార్థనమందిరంగా కంటే వాలిపోతున్న నిర్మాణంగానే ఎక్కువమందికి పరిచయం. అలాగే పర్యాటక ప్రదేశమైంది.

దేశభక్తి ఎక్కువ!

Italy_యూరప్‌వాసులకు దేశభక్తి ఎక్కువే. వాహనం మీద, ముఖ్యమైన వస్తువుల మీద ‘ఐ లవ్ మై కంట్రీ’ అని ఆ దేశం పేరు ఉంటుంది. కొంతమంది ‘ఈ దేశ పౌరుడిగా ఉన్నందుకు గర్విస్తున్నాను’ అని రాసుకుంటారు. నంబర్ ప్లేట్ల మీద ఆ దేశ జాతీయ పతాకం గుర్తు, యూరప్ చిహ్నం విధిగా ఉంటాయి. ఇటలీ అయితే ఇంగ్లిష్ అక్షరం ‘ఐ’ ఉంటుంది. దేశభక్తి గీతాలు కూడా దేశాభివృద్ధి, ప్రగతి కాంక్షతోనే ఉంటాయి. యువత కూడా ఈరోజు కంటే రేపు మరింత వేగంగా ప్రగతి దిశగా సాగాలన్న లక్ష్యంతో, అంకిత భావంతో కనిపిస్తారు. డబ్బు, అధికారం కోసం పరుగులు తీయడం ఇక్కడ చాలా అరుదు. స్విట్జర్లాండ్ మినహా మిగిలిన యూరప్ దేశాలలో యూరో వాడుకలో ఉంది. నాణేనికి ఒక వైపు కామన్‌గా యూరో చిహ్నం, మరో వైపు ఆ దేశ చిహ్నం ఉంటాయి. దానిని బట్టి అది ఏ దేశ నాణెమో గుర్తించవచ్చు.

మహిళలకు రక్షణగా చట్టాలు!

ఇక్కడ వివాహ వ్యవస్థను ప్రత్యేకంగా చెప్పుకోలేం, కానీ మహిళలకు రక్షణ చట్టాలు చాలా ఉన్నాయి. మహిళలు పురుషులతో సమానంగా పనిచేస్తారు. ఆర్ధిక స్వావలంబన సాధించడానికే మొగ్గు చూపుతారు. ఒకరి ఆధారపడి జీవించడాన్ని ఇష్టపడరు, స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. మనకు వీళ్లకూ తేడా ఏమిటంటే... జనాభా నియంత్రణ కోసం మన ప్రభుత్వాలు శ్రమిస్తుంటే... ఇక్కడ జనాభా పెరుగుదల కోసం ప్రోత్సాహకాలను ఇస్తోంది. నిరుద్యోగ భృతి కూడా ఇలాంటిదే. ఇక్కడ రాజకీయరంగం కూడా కొన్ని నిర్దేశిత విద్యాప్రమాణాలతో ఉంటుంది. రాజకీయల్లో పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్లు ఉంటారు. మంత్రులకు జీతాలు ఉంటాయి.సామాన్యులకు వర్తించే నిబంధనలన్నీ మంత్రులకూ వర్తిస్తాయి. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యబీమా వర్తిస్తుంది. ప్రమాదం జరిగితే గాయాలు తగలకపోయినా సరే ప్రమాద వాతావరణం ఒత్తిడి నుంచి బయటపడి మానసిక సాంత్వన కలిగేవరకు స్పా వంటి చోట్ల ఉంచుతారు. పారిశుద్ద్యానికి ప్రాధాన్యతనిస్తారు. బహిరంగ విసర్జనలు నిషేధం. పబ్లిక్ టాయిలెట్లు అద్దంలాగా ఉంటాయి. దోమలు, ఈగలను చూద్దామన్నా కనిపించవు. అకాల వర్షాల బారి నుంచి పంటలను రక్షించుకోవడానికి వేలాది ఎకరాలను ప్లాస్టిక్ కవర్‌తో కప్పేస్తారు. దేశంలో ఏరోస్పేస్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్రీ బాగా అభివృద్ధి చెందాయి.

పురాతన పర్యాటకం!

Italy__ఇటలీలో ప్రధాన పర్యాటక నగరాలు రోమ్, మిలన్, వెనిస్‌లు. రోమ్‌లో కలోజియం, వాటికన్ సిటీ, వాటికన్ మ్యూజియం, త్రెవి ఫౌంటెయిన్, పాంథెయోన్, సెయింట్ పీటర్స్ బాసిలికా ఉన్నాయి. దేశానికి రాజధాని నగరం రోమ్ అయితే రోమ్ నగరం మధ్యలో ఉన్న మరో దేశం వాటికన్‌సిటీ. సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చ్ వాటికన్‌లోనే ఉంది. దేశం మొత్తం వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందిన ప్రదేశం వాటికన్.* వెనిస్... ఈ నీటి మీద తేలే నగరం ఇటలీలో మరో వైవిధ్యభరిత ప్రదేశం. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి పడవలో వెళ్లే వీరి జీవితం అంతా నీటిమీదనే. వ్యాపారమూ నీటిమీదనే. పడవల్లో జరిగే ఈ విపణి ఫ్లోటింగ్ మార్కెట్ అంటారు. ఇటలీలో 47 ప్రదేశాలను వరల్డ్ హెరిటేజ్ సైట్లుగా గుర్తించింది యునెస్కో.* స్విట్జర్లాండ్ నుంచి ఇటలీకి రోడ్డు మార్గాన 17 కి.మీలు భూగర్భంలో ప్రయాణించాలి. కొండల కింద విస్తృతమైన నాలుగు లైన్ల రోడ్డు ఉంది. ఈ సొరంగాల్లో కూడా వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. భూగర్భం మొత్తం లైటింగ్ ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Saudi arabia tourism information
American space legend neil armstrong  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles