Information about houston

Houston Traffic, Houston commuting, Houston Information, Houston Relocation, moving to houstion, Houston realtor, relocating to Houston, Houston real estate, Houston realtors

A list of important milestones in Houston's history

Information About Houston.gif

Posted: 06/25/2012 06:07 PM IST
Information about houston

Information_About_Houston_city

Housten-city

చంద్రుడితో మాట్లాడిన నేల. ఖండాంతర జల రవాణా కేంద్రం. ప్రపంచ ప్రఖ్యాత హెల్త్ సెంటర్ స్థానం. భూగర్భ అంతరిక్ష పరిశోధనల స్థావరం. రికార్డుకెక్కిన ఐదుముఖాల చేజ్ టవర్ కృత్రిమ జలపాతం వాటర్‌వాల్ సముద్రాన్ని తోడి తెచ్చినట్లు అక్వేరియం నగరం నడిబొడ్డున జూ... ప్రాచీన కళల్ని ఒడిలో దాచుకున్న మ్యూజియాల నిలయం ఈ నేల. వ్యాపార ఉద్యోగాలకు బెస్ట్ అంటూ ఫోర్బ్స్ కితాబునందుకున్న నగరం హ్యూస్టన్... విశేషాలు తెలుసుకుందాం.

టెక్సాస్ రాష్ట్రంలో పెద్ద నగరం హ్యూస్టన్. అమెరికాలో టెక్సాస్ ఎడారి ప్రదేశం, వేడిగా ఉంటుంది. కానీ హ్యూస్టన్ నగరంలో ఎటు చూసినా పచ్చదనం, చల్లదనమే. ఈ విషయాన్ని నగర వాసులు గర్వంగా చెప్పుకుంటారు. వారమంతా కాలంతో పరుగులు తీస్తూ పని చేసి వారాంతంలో ఎంజాయ్ చేయడం వంటి సాధారణ పాశ్చాత్య సంస్కృతి ఇక్కడ కూడా ఉంది. డిసెంబర్‌లో నగరం పండుగ వాతావరణాన్ని సంతరించు కుంటుంది.

789రికార్డు టవర్!

జెపి మోర్గాన్ చేజ్ టవర్ ఐదు ముఖాలుగా కట్టిన 75 అంతస్తుల భవనం. ఇది ప్రపంచ రికార్డు. పర్యాటకులను 60వ అంతస్తు వరకు అనుమతిస్తారు. ఇక్కడి నుంచి బయటి వ్యూను ఫొటోలు తీసుకోవచ్చు కానీ బయటి నుంచి ఈ భవనాన్ని ఫొటో తీయడం నిషిద్ధం. అప్‌టౌన్ డిస్ట్రిక్ట్‌లో విలియమ్స్ వాటర్‌వాల్ మరో అద్భుతం. 60 అడుగుల ఎత్తు గోడ మీద నుంచి నీరు జాలువారుతూనే ఉంటుంది. సహజమైన జలపాతాలు లేని ప్రదేశం కావడంతో ఇక్కడి వాళ్లు ఇలా కృత్రిమంగా ఏర్పాటు చేసుకుని సంతోషపడుతుంటారు. ఇది గొప్ప నిర్మాణ ప్రక్రియ. ట్యాంకులోని నీరు మోటారు సాయంతో పైకి వెళ్లి అర్ధవలయాకారపు గోడ మీద నుంచి కిందకు పడుతుంది, అదే నీరు తిరిగి ట్యాంకులోకి వెళ్తూ సైకిల్ అవుతుంది.

చక్కటి మ్యూజియాలు...

మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ భవనాలు ఎదురెదురుగా ఉంటాయి. ఒక బిల్డింగ్‌లోకి ఎంటర్ అయిన వాళ్లం అండర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో మరో బిల్డింగ్‌లోకి వెళ్లి అక్కడి నుంచి బయటకు వస్తాం. విశాలమైన ఈ మ్యూజియంలో గ్రీకువీరుల శిల్పాలు, భారతీయ కళాఖండాలు ఉంటాయి. మన దక్షిణదేశ చోళ, నాయక రాజులు ఉపయోగించిన కెంపులు పొదిగిన బంగారు వక్కపొడి భరిణె, బంగారు కడియాలు, ఇతర అలంకరణ ఆభరణాల వంటివి కూడా ఉంటాయి.

మ్యూజియం ఆఫ్ నేచర్ హిస్టరీ...

ఇదీ అదీ అన్న తేడా లేకుండా భూగోళంలో ప్రతి భాగాన్ని ప్రతిబింబిస్తుంది. జంతు శిలాజాల నుంచి మయా నాగరికత కాలంలో ప్రజలు ఉపయోగించిన వస్తువులు, దుస్తులు కూడా ఉన్నాయి. కలప ట్రేలు, పాత్రలకు వేసిన అందమైన పెయింటింగ్, వంట పాత్రలు, ఆభరణాలు, వాళ్లు నివసించిన ఇళ్ల నమూనాలు ఉంటాయి. ఇదే ప్రాంగణంలో బటర్‌ఫ్లై పార్కు ఉంది. ఇందులో వందల రకాల సీతాకోక చిలుకలు ఉంటాయి. ఇవి సహజమైన ప్రకృతిలో జీవించే ఏర్పాట్లు నగరం మధ్యలో చేశారు. పచ్చటి మొక్కలు, తీగలు, చిన్న మడుగు, ముప్పై అడుగుల ఎత్తు నుంచి ఏర్పాటు చేసిన జలపాతం ఉన్నాయి. నగరంలో ఇంకా చైల్డ్ మ్యూజియం, హెల్త్ మ్యూజియం, హోలోకాస్ట్ మ్యూజియం, జూ ఉన్నాయి. సిటీలో ఎటువెళుతున్నా ఇది నగర శివారు, ఇది కేంద్ర స్థానం అన్నట్లు ఉండదు. నగరం నడిబొడ్డున కూడా భారీ ఓక్ చెట్లు బారులు దీరి ఉంటాయి. హర్మన్ పార్క్‌లో భారీ వృక్షాలు ఉంటాయి.

వ్యోమగాముల శిక్షణ ఇక్కడే!

జాన్సన్‌స్పేస్ సెంటర్ అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములకు సూచనలు చేసే మానిటరింగ్ వింగ్. ఇక్కడ నుంచి సైంటిస్టులు అంతరిక్షంలో ఉన్న రాకెట్ గమనాన్ని, స్థితిగతులను పరిశీలిస్తూ, అవసరమైన సూచనలు చేస్తారు. సముద్రంలో కూలిపోయిన స్కైలాబ్ మోడల్, అపోలో క్యాప్సూల్ ఉన్నాయి. అంతరిక్షంలోకి పంపించే వ్యోమగాములకు శిక్షణనిచ్చే రాకెట్, రాకెట్ లోపల వ్యోమగాముల జీవనశైలిని తెలియచేసే రాకెట్, నేచురల్‌గా అనిపించే డమ్మీ మనుషులను చూస్తున్నంత సేపు మరో లోకంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇలా ఒక్కొక్కటి చూపిస్తూ ముందుకు వెళ్లే ట్రామ్‌ట్రైన్‌ను ఒకచోట ఆపి ఎవరినీ దిగవద్దని అక్కడి నుంచే చూడమని ఒక గార్డెన్‌ని చూపిస్తారు. అది స్పేస్ సెంటర్ మెమోరియల్ గార్డెన్. అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి జ్ఞాపకార్థం ఒకచెట్టును నాటుతారు. ఆ సంగతి చెప్పినప్పుడు మనవాళ్లలో చాలామందికి కల్పనాచావ్లా గుర్తొచ్చి గుండె బరువెక్కుతుంది.

భూగర్భ వనరుల స్థావరం !

ఆ నగరంలో స్లెంబర్జర్ ఆయిల్ అండ్ నేచురల్ రిసోర్సెస్ రీసెర్చ్ సెంటర్ ఉంది. ఇలాంటి పెద్ద చిన్న కంపెనీలన్నీ కలిసి అట్లాంటిక్ తీరంలో దాదాపు రెండువేలకు పైగా ఉంటాయి. ఇవి భూమిలోని చమురు, ఖనిజాల ఆనవాళ్లను తెలుసుకుని ఆయిల్ కంపెనీలకు సమాచారం ఇస్తాయి. గాల్వెస్టన్ బీచ్ ఇక్కడ ప్రధానమైన జలరవాణాకేంద్రం, పర్యాటక కేంద్రం కూడ. ఇది అట్లాంటిక్ మహా సముద్రంలో దీవి. హ్యూస్టన్ నగరం నుంచి ఈ దీవిని కలుపుతూ బ్రిడ్జి ఉంది. రోడ్డు మీద వెళ్తూ రెండు వైపులా సముద్రాన్ని చూడడం చాలా థ్రిల్. అట్లాంటిక్ సముద్రపు నీరు స్వచ్ఛంగా, తీరంలో ఇసుక మెత్తగా పిండిలాగ ఉంది. ఇక్కడ బీచ్‌లో సాయంత్రానికి పక్షులు గుంపులు నిరీక్షిస్తుంటాయి. ఒక మహిళ రోజూ పక్షులకు గింజలు వేస్తుంది. పావురాలు ఆమె కంటే ముందే వచ్చి ఎదురు చూస్తుంటాయి.

Shoping_complexమన ఆహారం!

నగరంలో భారతీయులు మెండుగానే ఉంటారు. మళయాళీలు బొట్టుతో తమ సంప్రదాయాన్ని తెలియచేస్తుంటారు. ఇండియన్ రెస్టారెంట్లు మన ఆహారంతో పాటు సంప్రదాయ నేపథ్యాన్ని తలపిస్తుంటాయి. స్థానికులు ఎక్కువగా బ్రౌన్ బ్రెడ్, పొటాటో ఫింగర్ చిప్స్, టర్కీ సాసేజ్, వెజిటబుల్ ఆమ్లెట్, ప్లమ్ కేక్ వంటివి తింటారు. ఆఫీసు నుంచి నేరుగా రెస్టారెంటుకి వచ్చి పుస్తకం చదువుకుంటూ ప్రశాంతంగా భోజనం చేసి మిగిలిన పదార్థాలను ప్యాక్ చేసుకుని ఇంటికి పట్టుకెళ్లడం కనిపిస్తుంది. రాత్రి ఎనిమిది దాటితే రెస్టారెంట్లలో భోజనం ఉండదు. నగరంలోని ఇండియన్ గ్రోసరీ షాప్‌ను చూస్తే చాలామంది ఇండియన్స్ ఉన్నారనిపిస్తుంది. నగరం మొత్తానికి ప్రధానమైన షాపింగ్ మాల్ గలేరియా. ఇది కిలోమీటరుకు పైగా ఒక వీధంతా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్ వరకు కిలోమీటరు పొడవునా ఒకటే శ్లాబ్. గ్రౌండ్ ఫ్లోర్ కంపార్ట్‌మెంట్‌లుగా ఉంటుంది. పై అంతస్తులకు వెళ్లిన వాళ్లు ఎక్కడైనా కిందకు దిగి రోడ్డు మీదకు వెళ్లవచ్చు. వెయ్యి ఎకరాల్లో నిర్మించిన టెక్సాస్ మెడికల్ సెంటర్ ప్రపంచంలో పెద్దది. ఇక్కడ యాభైవేల మంది ఉద్యోగులుంటారు. విదేశీ వాణిజ్యం, రవాణా, అంతరిక్ష కేంద్రం... వంటి రంగాల కారణంగా ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ.

అంతరిక్షానికి ఆధారం!

నాసా అంతరిక్ష పరిశోధన కేంద్రాల్లో ఒకటి హ్యూస్టన్ నగరంలో ఉంది. దానిని జాన్సన్ స్పేస్ సెంటర్ అంటారు. టామ్ ట్రైన్‌లో అంతరిక్ష పరిశోధన కేంద్రం ప్రాంగణం అంతా తిప్పి చూపిస్తారు. ముఖ్యమైన ప్రదేశాల్లో ట్రైన్ ఆపి అందర్నీ లోపలకు తీసుకెళ్తారు. అలా ఒక్కొక్క రాకెట్‌ను చూపిస్తూ దాని విశేషాలను, అది నిర్వహించిన కీలకమైన పరిశోధనలను వివరిస్తారు. చంద్రుడి మీద అడుగు పెట్టిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ బృందం వాడిన వస్తువులు, చంద్రుడి మీదకు వెళ్లి వచ్చిన రాకెట్, వ్యోమగాములు చంద్రుడి మీద నుంచి తెచ్చిన రాళ్లు, మట్టి పెళ్లలను చూడవచ్చు. చంద్రుని మీద అడుగుపెట్టిన బృందం నేల మీద ఉన్న సైంటిస్టులతో మాట్లాడింది ఈ సెంటర్ నుంచే. చంద్రుడి మీద నుంచి తెచ్చిన రాళ్లు ఇక్కడ అద్దాల్లో ఉంటాయి. ఒక రాయి మాత్రం అద్దాల ఫ్రేములో మన చేయి దూరే సందుతో ఉంటుంది. దానికి ‘టచ్ ద మూన్’ అన్న క్యాప్షన్ ఉంటుంది. ఆ రాయిని తాకినప్పుడు చంద్రుడిని అందుకున్నట్లు, గిలిగింతలు పెట్టిన అనుభూతి కలుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The city of light paris
Liposuction treatment  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles