History of delhi exclusively on andhrawishesh

Services International, Chandni Chowk, Old Delhi, The Ghats, Rajpath & India Gate, India, Travel & Tourism, Tourist Places, Interesting Places, Delhi, Temples, Indian Tourism, Travel, Travel to India, Tourist Destinations

Some of the places in Delhi are Chandni Chowk, Old Delhi, The Ghats, Rajpath & India Gate,

history of Delhi exclusively on Andhrawishesh.gif

Posted: 11/30/2011 03:17 PM IST
History of delhi exclusively on andhrawishesh

history_of_Delhi_exclusively_on_Andhrawishesh2

Delhi

అన్ని రాష్ట్రాల సంస్క్రతుల సమ్మేళనం ఈ నగరం. సంప్రదాయ - ఆధునికతల సమన్వయం.... భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. వేల ఏళ్ళ చరిత్ర... లెక్కకు మించిన రాజవంశాలను స్వాగతించిన నగర... ఒకరి విజయం.... మరోసారి పరాజయం... అడుగడుగునా రక్తపాతం తీపి చేదు గుర్తుల సుమాహారం... చారిత్రక కట్టడాల పురిటిబిడ్డ... జాతి గౌరవానికి, దర్పానికి దర్పణం ఈ నగరం. సైకిక కవాతులు... త్రివర్ణ పతాకం రెపరెపలు... క్షిపణుల ప్రదర్శనలు... సాంకేతిక పురోగమనం... అన్నింటినీ మమేకం చేసుకున్న మన దేశ రాజధాని ఢిల్లీ మహానగరం.

ఆ పేరు ఎలా వచ్చిందంటే...

పర్షియా భాషలో దహ్లాజ్ అంటే ప్రత్యేక ద్వారం అని అర్థం. అదే క్రమంగా ఢిల్లీగా వాడుకలోకి వచ్చి ఉండవచ్చని ఒక అభిప్రాయం. అలాగే రాజా ధిల్లుఅనే మౌర్య రాజు గుర్తుగా క్రీ.శ. 50లో నగరాన్ని నిర్మించినట్లు అదే ఢిల్లీగా వాడుకలోకి వచ్చందని అంటారు.

ఢిల్లీలో నార్మల్ లైఫ్ చాలా హాయిగా ఉంటుంది. అన్ని రకాల ఆదాయ వర్గాలకు అనువైన నివాస ప్రాంతం. దేశంలో ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వారైనా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవించవచ్చు. నగర పోలీసు వ్యవస్థ ప్రపంచంలోని అత్యంత అతిపెద్ద పోలీసు వ్యవస్థల్లో ఒకటి. శాంతిభద్రతల సమస్యే ఉండదు. జనసాంద్రత ఎక్కవగా ఉండే రైల్వేస్టేషన్ వంటి దగ్గర తనిఖీ కఠినంగా ఉంటుంది. అయినా అప్పడప్పుడు నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అవి ప్రధాన వార్తల్లోకి రావడంతో రాజధాని నగరంలో రక్షణ కరువు అన్న భావన కలుగుతుంది. కానీ నిజానికి ఢిల్లీ సేఫ్ సిటీ.

మెట్రో నగరంలో....

ఢిల్లీ పరిసర ప్రదేశాలను కలిపి నేషనల్ కాపిటల్ రీజియన్ (ఎన్ సి ఆర్) అంటారు. హర్యానా రాష్ట్రానికి చెందిన గుర్ గావ్, ఫరీదాబాద్, ఉత్తర ప్రదేశ్ కు చెందిన నోయిడా, ఘజియాబాద్లు ఢిల్లీ మెట్రోపాలిటన్ లో భాగాలు. అన్నీ కలిసి మెట్రోపాలిటన్ గా ఉన్నప్పటికినీ కరెంట్, వాటర్, ఫోన్ కనెక్షన్ వంటి సర్వీసులన్నీ ఆయా రాష్ట్రాల నుంచే అందుతాయి. రోడ్ల నిర్వహణ కూడ ఢిల్లీ మున్సిపాలిటీ పరిధిలోని ప్రాంతాల్లో రోడ్ మెయింటనెన్స్, వాటర్ సప్లయ్ వంటివి చాలా సిస్టమాటిక్ గా ఉంటాయి. మెట్రోరైల్ వచ్చిన తరువాత సామాన్యులకు ప్రయాణం చాలా సౌకర్యంగా మారింది.

జాతీయ వేడుక....

ఢిల్లీలో నివసించే వారికి అద్భుతమైన వరం రిపబ్లిక్ పేరేడ్ ను స్వయంగా చూడగలం. రాష్ట్రపతి భవన్ నుండి ఇండియా గేట్ దాకా రాజ్ పథ్ పేరేడ్ జరుగుతుంది. పేరేడ్ కు పక్క లాన్స్ లో సిట్టింగ్ ఏర్పాటు చేస్తారు. ముందుగా అనుమతితో ఆ కార్యక్రమానికి హాజరు కావచ్చు. కొత్త క్షిపణులను స్వయంగా చూడవచ్చు. గ్రేడ్ ల వారిగా సైన్యం కవాతు నిర్వహించడం, అశ్విక దళాలు కవాతు, బెలూన్లను గాల్లో ఎగరవేయం లాంటి విన్యాసాలను చూసే అవకాశం ఢిల్లీ వాసులకే ఎక్కువ. ఈ కార్యక్రమానికి వెళ్ళిన వారికి ఇదొక స్వీట్ మెమరీ.

గార్డెన్ సిటీ....

ఢిల్లీ గార్డెన్ల నగరం. వాటిలో రాష్ట్రపతి భవన్ లోని మొఘల్ గార్డెన్స్ ప్రత్యేకం. రోషనార గార్డెన్, లోఢి గార్డెన్ కూడా ముఖ్యమైనవే. మనం తరుచూ వార్తల్లో వినే జన్ పథ్ లో రాజకీయ పార్టీల కార్యాలయాలు, అఫీషియల్ గన్ మెన్ తో ఎంపీల నివాసాలు, పార్లమెంట్ భవన్ వంటి ముఖ్యమైన నిర్మాణాలు ఉన్నాయి. ఇది హై సెక్యూరిటీ జోన్. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల పండుగలు, కల్చరల్ యాక్టివిటీలు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివెల్ లు లోహి రోడ్ లో జరుగుతాయి.

లెక్కలేనన్ని పిక్ నిక్ స్పాట్లు.....

అమరవీరుల త్యాగాలకు ప్రతీక ఇండియా గేట్. ఇక్కడి గార్డెన్స్ ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో ఫరీదాబాద్ లో సూరజ్ కుండ్ క్రాఫ్టు మేళా, ఢిల్లీ హాట్ పెద్ద పిక్నిక్ స్పాట్లు. కుటుంబం మొత్తం ఎంజాయ్ చేయడానికి ఫన్ అండ్ ఫుడ్ విలేజ్, అప్పు ఘర్, జూ, పురానా ఖిలా బోటింగ్ మంచి ప్రదేశాలు, ఫన్ అండ్ ఫుడ్ విలేజ్ లో రూ. 300 టికెట్ తో రోజంతా ఎంజాయ్ చేయవచ్చు.

ఢిల్లీ లైఫ్ స్టయిల్ ....

మన జీవన శైలి ఢిల్లీ వారాంతానికి అనువుగా మారాలి. శీతాకాలంలో ఇంట్లో కూడా స్వెట్టర్, మంకీ క్యాప్, సాక్స్ వేసుకోవాలి. రొట్టెలు తింటే దేహానికి వేడి అందుతుంది. అన్ని ప్రాంతాల వారు స్నేహంగా మెలగుతారు. తమ సాంప్రదాయాలకు విలువనిస్తూనే ఇతరుల సాంప్రదాయాలను గౌరవిస్తారు. బిన్నత్వంలో ఏకత్వంలాగా అన్నీ సంస్క్రతులతో మమేకమైన నగరమే మన ఢిల్లీ నగరం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rare people of the world
Childrens day celebration  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles