Nelson mandela history in telugu

Nelson Mandela Biography who fought against Racial discrimination by following mahatma gandhi rules, nelson mandela biography, nelson mandela history in telugu, nelson mandela biography in telugu, nelson mandela birthday special, nelson mandela news, nelson mandela story in telugu, nelson mandela birthday news, nelson mandela fought against racial descrimination, nelson mandela follows mahatma gandhi rules, mahatma gandhi latest news

Nelson Mandela Biography who fought against Racial discrimination by following mahatma gandhi rules

గాంధీ సూత్రాలను పాటించిన నల్లజాతి సూరీడు!

Posted: 07/18/2014 10:55 AM IST
Nelson mandela history in telugu

మన భారతదేశ జాతిపిత అయిన మహాత్మాగాంధీ బోధించిన శాంతియుత విధానాలు, అహింస, శత్రువును సంస్కారయుతంగా ఎదుర్కునే పద్ధతులను స్ఫూర్తిగా తీసుకుని జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదట అధ్యక్షుడు నెల్సన్ మండేలా! ఈయన పూర్తిపేరు నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా! దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు అయిన ఈయన... ఆ దేశానికి పూర్తిస్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడిగా చరిత్రలో సరికొత్త రికార్డును సృష్టించాడు. ఈయన జీవిత విశేషాలు, ఆశయాలకు సంబంధించి తెలుగులో కూడా ‘‘నల్లజాతి సూరీడు’’ అనే పేరుతో పలువ్యాసాలు కూడా వర్ణించబడి వున్నాయి.

మండేలా అధ్యక్షుడు కాకముందు జాతివివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్వహించిన మొదటి ఉద్యమకారుడు. ఈయన జరిపిన ఈ వ్యతిరేక పోరాటంలో ఒక మారణకాండకు సంబంధించి దాదాపు 27 సంవత్సరాలవరకు ‘‘రోబెన్’’ అనే ద్వీపంలో జైలు శిక్షను అనుభవించాడు. దాంతో ఈయన జాతి వివక్షతకు వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు, వర్ణ సమానతకు ప్రపంచవ్యాప్తంగా సంకేతంగా నిలిచిపోయాడు. 20వ శతాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధులైన నాయకుల జాబితాలో ఈయన తన పేరును నమోదు చేసుకోగలిగాడు. రాజకీయ జీవితంలో అడుగుపెట్టిన అనంతరం ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌కు, దాని సాయుధ విభాగమయిన ‘‘ఉంకోంటో విసిజ్వే’’కి అధ్యక్షుడిగా పనిచేశారు.

1990 ఫిబ్రవరి 11వ తేదీన జైలు నుంచి విడుదలయిన తరువాత నెల్సన్ మండేలా... దేశంలో నెలకొన్ని జాతి వైర్యాన్ని నివారించడానికి, తన రాజకీయ లక్ష్యాన్ని సాధించడానికి, అందరి మధ్య సయోధ్యను పెంచడానికి ఎంతో కృషి చేశాడు. అందుకు ఈయన తన పూర్వపు ప్రతిస్పర్థుల నుంచి ప్రశంసలను పొందడమే కాకుండా... వందకుపైగా అవార్డులను సొంతం చేసుకున్నాడు. వివిధ దేశాలలో వుండే సంస్థల కూడా ఈయనను సత్కరించాయి. అందులో 1993లో ఈయనకు లభించిన నోబెల్ శాంతి బహుమతి ఎంతో ముఖ్యమైంది.

మన భారతదేశం నుంచి కూడా మండేలాకు ఎంతో సమర్ధన లభించింది. మన దేశం కూడా ఈయనకు ‘‘భారతరత్న, జవహర్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ సయోధ్య’’ బహుమతులతో సత్కరించింది. మహాత్మాగాంధీగారు పాటించిన శాంతియుత విధానాలు తనకెంతో స్ఫూర్తినిచ్చాయంటూ ఆయన ఎన్నోసార్లు చెప్పుకున్నారు. హింసా మార్గంలో ఉద్యమాలను ప్రారంభించిన మండేలా.. ఆ తరువాత వాటిని గాంధేయ మార్గంలో ఆయన మలుచుకున్న తీరువల్ల ఆయనకు దక్షిణాఫ్రికా గాంధీగా పేరు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే కోట్లాదిమంది అమరవీరులకు మండేలా ఒక ప్రతీకగా మారిపోయారు. మానవజాతికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిని మండేలా 2013 డిసెంబర్ 5వ తేదీన మరణించారు. ఇతని మృతికి గౌరవసూచకంగా మన కేంద్ర ప్రభుత్వం ఐదురోజులపాటు సంతాపదినాలుగా ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(13 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles