Telugu journalists gif

suravaram pratap reddy, suravaram pratap reddy biography, suravaram pratap reddy history, suravaram pratap reddy wiki, suravaram pratap reddy latest news

suravaram pratap reddy biography : the biography of suravaram pratap reddy who is campaign against nizam government

రాజకీయ చైతన్యవంతుడు.. తెలంగాణ ‘వరం’ ఉద్యమకారుడు!

Posted: 09/12/2014 05:32 PM IST
Telugu journalists gif

స్వాతంత్రసమరం.. సురవరం! క్రీయాశీల ఉద్యమకారుడిగా తనవంతు పాత్ర పోషించి.. రాజకీయ - సాంఘిక చైతన్యం అంటే ఏమిటో నేర్పించిన తొలి తెలంగాణ ఉద్యమకారుడు సురవరం ప్రతాపరెడ్డి! అంతేకాదు... పత్రికా సంపాదకుడిగా, పరిశోధకుడిగా, పండితుడిగా, రచయితగా, ప్రేరకుడిగా.. ఇలా రకరకాల బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి ఎంతో అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో అసలు కవులే లేరనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన వాటిని సవాలుగా తీసుకొని ఏకంగా 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు!

తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం. నైజాం నిరంకుశ పాలనలో తెలుగు వారి అణచివేతను వ్యతిరేకించిన ఆయన.. ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషిచేశాడు. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫారసీ, ఆంగ్ల తదితర భాషలలో నిష్ణాతులైన ఈయన.. ‘‘గోల్కొండ పత్రిక’’, దానికి అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందాడు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయోద్యమము ఇతని ఇతర ముఖ్య రచనలు. తెలుగుజాతికి ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ఈయన విగ్రహాన్ని ప్రతిష్టించారు. 1955లో ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు గాను "కేంద్ర సాహిత్య అకాడమి" అవార్డు లభించింది.

జీవిత చరిత్ర :

1896 మే 28వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడులో సురవరం ప్రతాపరెడ్డి జన్మించారు. పాఠశాల చదువు అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ, తిరువాన్‌కూరులో బి.ఎల్ చదివారు. అనంతరం కొంతపాలంపాటు న్యాయవాది వృత్తి నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయన అనేక భాషలను అభ్యసించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలకు వ్యతిరేకంగా ఆయన తన గళాన్ని విప్పడం మొదలుపెట్టారు. 1926 లో ఆయన నెలకొల్పిన గోలకొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. ఆనాటి నిజాం ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని గోల్కొండ పత్రిక ద్వారా ఆయన సూటిగా ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన నిజాం.. సంపాదకీయాలు, సమాచారలు తమ అనుమతితోనే ప్రచురించాలని నిబంధనలు పెట్టారు. అయితే దానిని ఖాతరు చేయకుండా ప్రతాపరెడ్డి మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయాన్ని ప్రచురించారు.

అటు తెలంగాణలో కవులే లేరని ఒక ఆంధ్ర పండితుడు ఎగతాళి చేస్తే.. దానికి దీటుగా 350 మంది కవుల రచనలతో గోలకొండ కవుల సంచిక అనే సంకలనాన్ని 1934లో ప్రచురించి తిరుగులేని సమాధానం ఇచ్చారు. ఇప్పటికీ ఆ సంచిక అపురూపమైనదిగా పరిగణించబడుతుంది. తెలంగాణాలో గ్రంథాలయోద్యమంలో ప్రతాపరెడ్డి ప్రముఖపాత్ర వహించాడు. 1942లో ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు అధ్యక్షత వహించాడు. 1943లో ఖమ్మంలో జరిగిన గ్రంథాలయ మహాసభకు, 1944లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆయనే అధ్యక్షుడు. 1951లో ప్రజావాణి అనే పత్రికను ప్రారంభించాడు. 1952లో హైదరాబాదు రాష్ట్రానికి జరిగిన మొదటి ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరపున వనపర్తి నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. న్యాయవాదిగా ఆయన జీవితం ప్రారంభించి... రచయితగా, కార్యకర్తగా, సంపాదకుడుగా జీవితం సాగించి తెలంగాణ ప్రజల హృదయాలలో ముద్రవేసుకున్నాడు. అనారోగ్య కారణాల వల్ల 1953 ఆగష్టు 25న ఆయన కన్నుమూశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : suravaram pratap reddy  telangana state  telugu journalists  golconda news paper  

Other Articles