Justice handyala l dattu sworn in as chief justice of india

Ananth Kumar, Chief Justice of India, LK Advani, M Venkaiah Naidu, Pranab Mukherjee, Rajnath Singh, Rashtrapati Bhawan, Ravi Shankar Prasad, Supreme Cour,tHandyala L Dattu

Justice Handyala Lakshminarayanaswamy Dattu was today sworn in as the 42nd Chief Justice of India

సుప్రీంకోర్టు సీజేగా దత్తు ప్రమాణ స్వీకారం..

Posted: 09/28/2014 01:43 PM IST
Justice handyala l dattu sworn in as chief justice of india

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హండ్యల లక్ష్మీనారాయణస్వామి దత్తు ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జస్టిస్ హెచ్.ఎల్ దత్తుతో ప్రమాణం చేయించారు. భగవంతుడిపై ప్రమాణం చేసిన అనంతరం దత్తు బాధ్యతలు స్వీకరించారు. గతంలో కేరళ, ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దత్తు 14నెలల పాటు పదవిలో కొనసాగుతారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నిన్న పదవీ విరమణ చేసిన జస్టిస్ ఆర్ ఎం లోధా స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసు విచారిస్తున్న ధర్మాసనంలో జస్టిస్ దత్తు కూడా వున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. తన విధులను నిర్వహించేందుకు ధైర్యం, నమ్మకం కావాలని వీటితో పాటు తనకు దేశ ప్రజల ఆశీర్వచనాలు కావాలని కోరారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, రవిశంకర్‌ప్రసాద్, వెంకయ్యనాయుడు, బీజేపి సీనియర్‌ నేత అద్వానీ, కాంగ్రెస్ నేతలు అభిషేక్ మను సింఘ్వి, రాజీవ్ శుక్లా తదితరులు పాల్గొన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more