ఉప్పులేని కూర యొప్పదు రుచులకు
పప్పులేని తిండి ఫలము లేదు
అప్పు లేనివాడే యధిక సంపన్నుడు
విశ్వధాభిరామ వినురమేమ
ఫలము = లాభము , అధిక సంపన్నుడు = గొప్ప భాగ్యవం తుడు .
కూరలో ఉప్పు లేకపోవుట రుచికి లోపము . పప్పులేని తిండి ప్రయోజము లేనిది . అప్పులేని వాడే భాగ్యవంతుడు .
ఎద్దుకైన యేడాది దెల్పిన
మాట తెలిసి నడచు మర్మ మెఱిఁగి
ముప్పె తెలియలేఁడు ముప్పదేండ్లకు నైన
విశ్వధాభిరామ వినురమేమ .
ఏడాది = సంవత్సర కాలము , మర్మము = రహస్యము , ముప్పె = మూఢుండు .
ఒక సంవత్సరము పాటు భోధించిన యెడల యెద్దయినా సంగతి సందర్భములు తెలిసికొనఁ గలదు. కాని
మూఢుడు ఎన్ని సంవత్సరాలు గడిచినను తెలిసికొనఁ జాలడు.
(And get your daily news straight to your inbox)
Apr 15 | తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలవరకు... Read more
Apr 14 | పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు పట్టెనేని బిగియఁ బట్టవలయు పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ... Read more
Apr 12 | చంపదగిన యట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు సేయరాదు పొనగ మేలుచేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : మనకు ఎల్లప్పుడూ హాని కలిగించే మన శత్రువును చంపే సమయం వచ్చినప్పుడు.. అతనిని... Read more
Apr 11 | చెప్పులోన ఱాయి చెవిలోని జోరిగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ ! భావం : చెప్పులో రాయి రావడం, చెవిలో జోరిగ తిరగడం, కంటిలో నలుసు పడటం,... Read more
Apr 08 | చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీట గలిసె బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా మారిపోతుంది. అదే చినుకు... Read more