Vemana Sathakam in Telugu 35341 Vemana Satakalu

Vemana Sathakam, Vemana Satakalu, Telugu Satakalu, Vemana Satakalu in Telugu విత్తము, ధనము, Vemana satakam

Get the Vemana Sathakam అధిక ధనం గలవాని వీపు పైన అయిన పుండు సైతము నలుగురి నోళ్ళలోబడి ప్రచారమగును. కానీ బీదవానింట పెండ్లయిన ఎవ్వరూ చెప్పుకోరు. In Telugu Vemana Satakalu

వేమన శతకం

Posted: 06/13/2012 06:50 PM IST

 

విత్తముగలవాని వీపు పుండైనను

వసుధలోన జాల వార్తకెక్కు

బేదవానియింట బెండ్లయిననెగరు

విశ్వధాభిరామ వినురమేమ

విత్తము = ధనము, వసుధ = ప్రపంచము, చాలా వార్త కెక్కును = మిగుల ప్రసిధ్ధి కెక్కును.

అధిక ధనం గలవాని వీపు పైన అయిన పుండు సైతము నలుగురి నోళ్ళలోబడి ప్రచారమగును. కానీ బీదవానింట పెండ్లయిన ఎవ్వరూ చెప్పుకోరు.

 

విద్యలేని వాడు విద్యాధికుల చెంత

నుండినంత బండితుండు కాఁడు

కొలని హంసలకడఁ గొక్కెరయున్నట్లు

విశ్వధాభిరామ వినురమేమ.

విద్యలేని వాడు = చదువురాని వాడు, విద్యాధికుల చెంతన్ = పండితల దగ్గర, కొక్కెర = కొంగ.

హంసలతోఁ గలసిమెలసి యున్నంత మాత్రాన కొంగ మార్పు జెందలేనట్లు, పండితులతో గూడియు మూఢుఁడు మారజాలడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

 
 
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 15 | తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలవరకు... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 14 | పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు పట్టెనేని బిగియఁ బట్టవలయు పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 12 | చంపదగిన యట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు సేయరాదు పొనగ మేలుచేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : మనకు ఎల్లప్పుడూ హాని కలిగించే మన శత్రువును చంపే సమయం వచ్చినప్పుడు.. అతనిని... Read more

  • Vemana satakam in telugu

    వేమన శతకము

    Apr 11 | చెప్పులోన ఱాయి చెవిలోని జోరిగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ ! భావం : చెప్పులో రాయి రావడం, చెవిలో జోరిగ తిరగడం, కంటిలో నలుసు పడటం,... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 08 | చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీట గలిసె బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా మారిపోతుంది. అదే చినుకు... Read more