పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన
పట్టునా జగంబు పట్టిదెపుడు
యముని లెక్కరీతి అరుగుచు నుందురు
విశ్వధాభిరామ వినురమేమ
జగంబు = ప్రపంచము, లెక్కరీతి = లెక్క ప్రకారము , అరుగుచు నుందురు = చనిపోవుచుందురు
పుట్టినవారందఱు బ్రతికియుండినయెడల ప్రపంచమే పట్టదు. కాబట్టి లెక్క ప్రకారం చనిపోవుట సంభవించుచున్నది.
మగని కాలమందు మగువ కష్టించిన
సతుల కాలమందు సుఖమునందు
కలిమి లేని రెండు గలవెంతవారికి
విశ్వధాభిరామ వినురమేమ.
మగని కాలమందు =మగడు సంపాదించి పెట్టు సమయమున, సతుల కాలమందు = కొడుకులు పెరిగి పెద్దవారైన సమయమున, కలిమి = ధనము, లేమి = ధారిద్ర్యము.
మగడు (భర్త) సంపాదించి పెట్టు సమయములో కష్టపడిన స్ర్తీ, తన కొడుకులు పెరిగి పెద్దవారైన వేళ సుఖపడుచున్నది. ఎంతటి వారికైనా ధనము, దారిద్య్రయము రెండు దశలు తప్పవు.
(And get your daily news straight to your inbox)
Apr 15 | తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలవరకు... Read more
Apr 14 | పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు పట్టెనేని బిగియఁ బట్టవలయు పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ... Read more
Apr 12 | చంపదగిన యట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు సేయరాదు పొనగ మేలుచేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : మనకు ఎల్లప్పుడూ హాని కలిగించే మన శత్రువును చంపే సమయం వచ్చినప్పుడు.. అతనిని... Read more
Apr 11 | చెప్పులోన ఱాయి చెవిలోని జోరిగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ ! భావం : చెప్పులో రాయి రావడం, చెవిలో జోరిగ తిరగడం, కంటిలో నలుసు పడటం,... Read more
Apr 08 | చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీట గలిసె బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా మారిపోతుంది. అదే చినుకు... Read more