Vemana Sathakam in Telugu 33332 Vemana Satakalu

Vemana Sathakam, Vemana Satakalu, Telugu Satakalu, Vemana Satakalu in Telugu తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుండు Vemana satakam

Get the Vemana Sathakam వేమన శతకంలో వేమన దేవతలతో సమానమైన తల్లిదండ్రుల మీద దయ, జాలి, కరుణ చూపని కొడుకు పుట్టినా ఏం ఉపయోగం లేదు. వాడు చనిపోయినవాడితో సమానం. అలాంటి కొడుకు పుట్టలో పుట్టి పుట్టలోనే నశించి పోయే చెదలుతో సమానం అని పోల్చాడు. In Telugu Vemana Satakalu

వేమన శతకం

Posted: 04/07/2012 12:17 PM IST

 

 

తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుండు

పుట్టనేమి వాడు గిట్టనేమీ

పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా

విశ్వధాభిరామ వినురమేమ.

             పుత్రుండు = పుత్రుడు, గిట్టనేమి = చనిపోయిన నేమి,

వేమన శతకంలో వేమన దేవతలతో సమానమైన తల్లిదండ్రుల మీద దయ, జాలి, కరుణ చూపని కొడుకు పుట్టినా ఏం ఉపయోగం లేదు. వాడు చనిపోయినవాడితో సమానం. అలాంటి కొడుకు పుట్టలో పుట్టి పుట్టలోనే నశించి పోయే చెదలుతో సమానం అని పోల్చాడు.

ధనము కూడబెట్టి దానంబు చేయక

తాను దినక లెస్స దాచుకొనగ

తేనెటీగ గూర్చి తెరువరి కియ్యదా

విశ్వధాభిరామ వినురమేమ.

            లెస్స = బాగుగా, తెరువరికి = బాట సారికి

             వేమన శతకంలో వేమన లోభి గురించి ఈ విధంగా వర్ణించాడు. బాగా ధనము కలిగిన పిసినారి ఆ ధనమును ఇతరులకు ధాన ధర్మములు చేయక, తాను కూడా తినక, అనుభవించక వాటిని చూసుకుంటూ జీవతం గడిపేసి చివరికి చనిపోతాడు. తేనెటీగ కూడ ఎంతో కష్టపడి పూలలోని మకరంధాన్ని తెచ్చి తేనెను తయారు చేసి అవి తాగకుండా పరుల పాలు చేస్తాయి. ఈ పద్యంలో వేమన లోభిని తేనె టీగలతో పోల్చాడు. లోభి తేనెటీగ లాంటి వాడు అని అర్థం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vemana sathakam
 
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 15 | తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలవరకు... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 14 | పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు పట్టెనేని బిగియఁ బట్టవలయు పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 12 | చంపదగిన యట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు సేయరాదు పొనగ మేలుచేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : మనకు ఎల్లప్పుడూ హాని కలిగించే మన శత్రువును చంపే సమయం వచ్చినప్పుడు.. అతనిని... Read more

  • Vemana satakam in telugu

    వేమన శతకము

    Apr 11 | చెప్పులోన ఱాయి చెవిలోని జోరిగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ ! భావం : చెప్పులో రాయి రావడం, చెవిలో జోరిగ తిరగడం, కంటిలో నలుసు పడటం,... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 08 | చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీట గలిసె బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా మారిపోతుంది. అదే చినుకు... Read more