Vemana Sathakam in Telugu 30746 Vemana Satakalu

Vemana satakam

Vemana Sathakam, Vemana Satakalu, Telugu Satakalu, Vemana Satakalu in Telugu ఈదిదాటగలుగు నే సాగరంబైన Vemana satakam

Get the Vemana Sathakam ఈది దాట గలుగును- ఈదుకుంటూ దాటగలుగుతాడు, ఏ సాగరంబైన- సముద్రమైనా సరే, సాధువృత్తి తోడు- సత్ప్రవర్తనతో, సమయమందు- ఆ సమయానికి తగ్గట్టుగా, పాడుకొనుచు- భక్తి గీతాలు పాడుకుంటూ, మనసు పరిపూర్ణమొందును- మనసునిపరిపూర్ణంగా చేసుకుంటాడు. In Telugu Vemana Satakalu

వేమన శతకం 46

Posted: 01/17/2012 06:49 PM IST
Vemana satakam

vemana-inner

ఈదిదాటగలుగు నే సాగరంబైన

సాధువృత్తితోడ సమయమందు

పాడుకొనుచు మనసు పరిపూర్ణమొందును

విశ్వదాభిరామ వినురవేమ

ఈది దాట గలుగును- ఈదుకుంటూ దాటగలుగుతాడు, ఏ సాగరంబైన- సముద్రమైనా సరే, సాధువృత్తి తోడు- సత్ప్రవర్తనతో, సమయమందు- ఆ సమయానికి తగ్గట్టుగా, పాడుకొనుచు- భక్తి గీతాలు పాడుకుంటూ, మనసు పరిపూర్ణమొందును- మనసునిపరిపూర్ణంగా చేసుకుంటాడు.

సాధుప్రవర్తనతో మెలిగినట్లైతే సమయాన్నిబట్టి ఏ సముద్రాన్నైనా ఈది దాటగలుగుతాడు. భక్తి తత్వాలు మనసులో పాడుకుంటూ తన మనసుని నిర్మలంగా చేసుకోవటం వలన కాలక్రమేణా అది పరిపూర్ణమౌతుంది.

చూడటానికి ఇవి మామూలు సూక్తులలా ఉన్నా ఈ పద్యంలోని పదాలు అత్యంత నిగూఢమైన, లోతైన అర్థాన్ని కలిగివున్నాయి. సాగరం దాటటమంటే నిజంగా సముద్రాన్ని ఈదుకుంటూ అవతలి ఒడ్డుకి పోవటమని కాదు. అది ఎవరికైనా సాధ్యం కాదు కూడా. సముద్రమనేది చాలా లోతైన, ఎత్తైన అధిగమించలేని దాటలేని పరిష్కరించలేని సమస్యకు ప్రతీక. సంసారసాగరం అని అంటారు. జీవితంలో ఆటుపోట్లు, తుఫాన్ చెలరేగటం ఇవన్నీ సముద్రానికి సంబంధించిన మాటలు. జీవితం అగమ్యగోచరంగా దిక్కు తోచకుండా ఉంటే చుక్కాని లేని నావ అని అంటారు. ఇలాంటి పదాలన్నీ జీవితంలో ఉన్న సమస్యలూ మనసులోని సందిగ్ధావస్థలను తెలియజేయటానికి వాడుతారు. అందువలన ఏ సముద్రమైనా దాటటం అని అంటే, ఎటువంటి సమస్యలనైనా అధిగమించటం అని అర్థం వస్తుంది.

మనసు ఎప్పుడూ ఏదో ఒక విషయం మీదికి పరిగెడుతూ ఉంటుంది. అటువంటి మనసుని నియంత్రించటానికి దాని వెనకాల మనం కూడా పరిగెడితే అది జరిగే పని కాదు. ఎగురుతున్న పక్షులను పట్టుకోవటానికి ఎలాగైతే వాటికి కావలసిన దాణా వేస్తారో, జంతువులను పట్టుకోవటానికి దానికి ఇష్టమైన ఆహారాన్ని ఎలాగైతే చూపించి అది దగ్గరకు రాగానే పట్టుకుంటారో అలాగే మనసుని నిశ్చలంగా ఉంచుకోవాలంటే దాన్ని ముందుగా ఏదో ఒక విషయం మీద లగ్నం చేసి ఉంచాలి. అలాంటి ప్రయత్నమే భక్తిగీతాలను మనసులో కానీ బిగ్గరగా కానీ చదువుకోవటం. దానివలన మనసు ముందు నిశ్చలమవుతుంది, ఆ తర్వాత నిర్మలమవుతుంది, ఆ తర్వాత పూర్తిగా లయమవుతుందని కనిపెట్టిన మహాత్ములు మనకూ ఆ సాధనానిచ్చారు. అందుకే పాడుకొనుచు మనసు పరిపూర్ణమగును అంటారు వేమనాచార్యులవారు.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vemana satakam
Vemana satakam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 15 | తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలవరకు... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 14 | పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు పట్టెనేని బిగియఁ బట్టవలయు పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 12 | చంపదగిన యట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు సేయరాదు పొనగ మేలుచేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : మనకు ఎల్లప్పుడూ హాని కలిగించే మన శత్రువును చంపే సమయం వచ్చినప్పుడు.. అతనిని... Read more

  • Vemana satakam in telugu

    వేమన శతకము

    Apr 11 | చెప్పులోన ఱాయి చెవిలోని జోరిగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ ! భావం : చెప్పులో రాయి రావడం, చెవిలో జోరిగ తిరగడం, కంటిలో నలుసు పడటం,... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 08 | చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీట గలిసె బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా మారిపోతుంది. అదే చినుకు... Read more