ఒక హీరోయిన్ అందరితో క్లోజ్ ఉంటే చాలు ..ఇక ఎఫైర్ ఉన్నట్లే లెక్క. ఇప్పటివరకు రణ్‌వీర్‌సింగ్, ఉదయ్‌చోప్రా, అర్జున్‌కపూర్, జాకీ భగ్నానీలతో నాకు ఎఫైర్ అంటగట్టారు. కొత్తగా దర్శకుడు మనీష్ శర్మ తో ప్రేమలో పడినట్లుగా చెబుతున్నారు. ఇంతమందితో నేను ఒక్కదాన్ని ఎలా చెయ్యగలను చెప్పండి అంటూ ప్రేమగా అడుగుతుంది బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా. మేకప్ వేసుకోవడానికి సినిమాలు ఓ వంక అని, సులువుగా డబ్బు సంపాదించుకోవడానికి చాలామంది ఎంచుకొనే మార్గం అని, దూరప్రయాణాలు కూడా చేయొచ్చు కాబట్టి.. ఇష్టపడి సినిమాల్లోకి వస్తారని.. ఇలా నాకు సినిమా పరిశ్రమ మీద చాలా చిన్న చూపు ఉండేది’’ అంటున్నారు పరిణీతిచోప్రా. ‘ఇషక్జాదే ’తో కుర్రకారుకి కలల రాణి అయిపోయిన పరిణీతికి ఇప్పుడు సినిమాల మీద చిన్నచూపు కాదు పెద్ద చూపే ఉంది. యాక్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాతే, ఇది ఆషామాషీ వ్యవహారం కాదని, కష్టపడనిదే డబ్బు రాదని తెలుసుకున్నానని అంటున్నారామె. సినిమా అంటే గౌరవం ఏర్పడిందని కూడా పేర్కొన్నారు ఈ బ్యూటీ. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో బొద్దుగా ఉన్న పరిణీతి ఇప్పుడు సన్నబడే పనిలో పడ్డారు. దానికోసం తనకెంతో నచ్చిన పిజ్జాలకు దూరమయ్యానని, ఇంకా చాలా త్యాగాలు చేస్తున్నానని పరిణీతి తెలిపారు. ప్రస్తుతం మనీష్శర్మ దర్శకత్వంలో ఆమె ఓ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఇక్కడే ఈ ఇద్దరి మద్య ప్రేమ చిగురించిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే పరిణీతి మాత్రం..‘ప్లీజ్.. ఎఫైర్ అని అనకండి? మా మద్య ఉన్నది స్నేహ బంధమేనని సిగ్గుపడుతూ చెబుతున్నట్లు బాలీవుడ్ బాబులు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more