గత కొన్ని రోజులుగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరగవచ్చన్న ఊహాగాలు వస్తున్నాయి. అయితే అవి ఎప్పుడు గాలి వార్తల్లాగే మిగిలిపోతున్నాయి. ఆ మధ్య ఆ వార్తల పై స్పందించిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా నా సీటు 2014 వరకు పదిలం అని బల్లగుద్ది చెప్పుకున్నారు. దానికి తోడు కేంద్రమంత్రి వాయిలార్ రవి కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉండదని చెప్పారు. రాజకీయంలో ఎప్పుడు ఏం జరగుతుందో తెలియదు కాబట్టి.. తాజాగా కేంద్ర మంత్రి జైపాల్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మధ్య తలెత్తిన గ్యాస్ వ్యహారం కిరణ్ సీటుకు ఎసరు పెట్టేవిధంగా ఉంది. కిరణ్ వర్గం సై అంటే సై అనడంతో కేంద్రంలో జైపాల్ రెడ్డి కిరణ్ ని ఎలాగైనా దింపడానికి పావులుకదుపుతున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఎన్నడూ లేని విధంగా ఊహాగానాలు వస్తున్నాయి.
దీనికి బలం చేకూరే విధంగా కేంద్రమంత్రి వాయిలార్ రవి చేసిన వ్యాఖ్యలు ఉండటంతో రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండబోతుందనే వార్తలు ఇవాళ గుప్పుమన్నాయి.
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వాయిలార్ రవి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేయలేనని కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు వాయిలార్ రవి అభిప్రాయపడ్డారు. ఎప్పుడు రాష్ట్రనికి వచ్చినా ముఖ్యమంత్రి మార్పు పై స్పష్టంగా వివరణ ఇచ్చే వాయిలార్ ఈసారి ఇలా మాట్లాడటంతో మార్పు తథ్యమనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more