సోదరి అంటే వైఎస్ జగన్ సోదరి షర్మిలా కాదండి? మన కొత్త రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీ సోదరి అన్నపూర్ణ దేవి? రాష్టప్రతి అశ్వం ఎందుకు కావాలి? నువ్వు ఈ జన్మలోనే రాష్టప్రతివి అవుతావు’ అని సోదరి అన్నపూర్ణాదేవి ఆయనతో అన్నారు. యుపిఎ రాష్టప్రతి అభ్యర్థి 76 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీ కన్నా పదేళ్లు పెద్ద అయిన అన్నపూర్ణాదేవి ‘సిఎన్‌ఎన్-ఐబిఎన్’ టివి విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గుర్తు చేసుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ ఎంపి అయిన కొత్తల్లో ఆయనతో ఆమె సంభాషిస్తున్నారు. వారుభయులు న్యూఢిల్లీలోని ఆయన అధికారిక క్వార్టర్స్ వరండాలో కూర్చుని తేనీరు సేవిస్తున్నారు. ‘అతని ఇంటి నుంచి రాష్టప్రతి భవన్ ఎంతో దూరంలో లేదు. రాష్టప్రతి అశ్వాలను నడిపించే మార్గం మేము వరండాలో నుంచే చూడగలిగేవారం. ఆశ్విక రక్షకుడు వాటిని పోషించడం, వాటికి ఆహారం పెట్టడం, నీరు తాగించడం చూడగలిగేవారం. టీ సేవిస్తూండగా ‘అక్కా! ఆ గుర్రాలు ఎంత హాయిగా ఉన్నాయో... అలా చూడు.. అవి పని చేయనక్కరలేదు. అవి తింటాయంతే. వాటి రంగుల మెరుపు చూడు. నేను చనిపోయిన తరువాత రాష్టప్రతి గుర్రంగా జన్మిస్తాను’ అని అతను అన్నాడు. అప్పుడు ‘రాష్టప్రతి గుర్రంగా ఎందుకు కావడం? నువ్వు ఈ జన్మలోనే రాష్టప్రతివి అవుతావు’ అని నేను అన్నాను’ అని అన్నపూర్ణాదేవి తెలియజేశారు. తన జోస్యం ఫలించినందుకు ఆయన సోదరి ఆనందంగా ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more