రిటైల్ రంగంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి నిర్ణయంపై ప్రతిపక్షాలు గత రెండు వారాలుగా పార్లమెంటును స్తంభింప చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఎఫ్‌డీఐ నిర్ణయాన్ని నిలిపివేస్తున్నామని, యూపీఏ భాగస్వామ్య పక్షాలు, ప్రతిపక్ష పార్టీలతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఇందుకోసం రేపు ప్రధాని నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈమేరకు విపక్ష నేతలకు కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ ఫోన్ చేసి.. ఎఫ్‌డీఐ నిర్ణయాన్ని నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై పార్లమెంటులో ప్రకటన చేస్తామని తెలిపారు. యూపీఏ సంకీర్ణ భాగస్వామ్య పక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, డీఎంకేలు కూడా ఎఫ్‌డీఐ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండటం.. అన్నివైపుల నుంచీ తీవ్ర వ్యతిరేకత ఎదురుకావటంతో ఎఫ్డీఐపై కేంద్రం వెనక్కు తగ్గలేక తప్పలేదు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more