ISIS | Chicken | Bombs | Suicide bombs

Isiss suicide chickens

ISIS, Chicken, Bombs, Suicide bombs

ISISs suicide CHICKENS. Pictures appear to show bombs strapped to hens by bird-brained jihadis ISIS militants said to be building suicide belts for use on live chickens. Jihadis strap bombs onto the hens and send them into an enemy camp site. Suicide chickens are able to get close to top fighters without being spotted . ISIS militants can then use simple remote controls to detonate the IEDs

ఇక కోళ్లే ఆత్మాహుతి దళాలు.. ఐఎస్ఐఎస్

Posted: 07/22/2015 11:44 AM IST
Isiss suicide chickens

ఇప్పటి దాకా మానవ బాంబులు, ఆత్మాహుతి దళాల గురించి విన్నాం. చూశాం. కానీ ఇస్లామిక్ తీవ్రవాదులు మరో సరికొత్త దారిని కనిపెట్టారు. కోళ్ళ వంటికి బాంబులు అమర్చి ప్రత్యర్థుల ప్రాణాలను తీసే విధానానికి భయంకరమైన ఐసిస్ ఉగ్రవాదులు సన్నాహాలు చేస్తున్నారని విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం. కోళ్ళ వంటికి బాంబులు అమర్చి, వాటిని ప్రత్యర్థుల సమీపంలోకి పంపించి దూరం నుంచి రిమోట్ కంట్రోల్ తో పేల్చివేసేందుకు ఐసిస్ ఉగ్రవాదులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో కోళ్ళకు బాంబులు అమర్చిన చిత్రాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఐసిస్ ఉగ్రవాదులు ఇప్పటికే బాంబులను సొంతంగా తయారు చేసుకుంటున్నారు.

Also Read:  జమ్ముకాశ్మీర్ లో ఐఎస్ఐఎస్.. పాక్ జెండాలు

ఇప్పుడు కోళ్ళను ఆత్మాహుతి దళాలుగా మార్చి విధ్వంసం సృష్టించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఇరాక్ లోని ఫలూజా నగరంలోను, చుట్టుపక్కల శత్రువుకు పట్టున్న ప్రాంతాలను విచ్ఛిన్నం చేయడానికి ఆత్మాహుతి కోళ్ళ బాంబులతో ఐసిస్ దాడులు చేస్తున్నది. బాంబులు అమర్చిన కోళ్ళు శత్రు స్థావరాల్లోకి వెళ్ళిన వెంటనే రిమోట్ కంట్రోల్ పరిధి నుంచి వాటిని పేల్చివేయడం ద్వారా తమ క్రూరత్వాన్ని ప్రదర్శించడానికి ఐసిస్ ఉగ్రవాదులు సిద్ధమయ్యారు. ఇలాంటి దుశ్చర్యల ద్వారా ఐసిస్ ఉగ్రవాదులు తమ పైశాచిక నైజాన్ని బయట పెట్టుకుంటున్నారని నిపుణులు అంటున్నారు.

Also Read:  ఐఎస్ఐఎస్ టార్గెట్ నరేంద్ర మోదీ..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  Chicken  Bombs  Suicide bombs  

Other Articles