ttdp mla revanth reddy makes settairic comments on telangana cm kcr pushkar bath | telangana controversy

Revanth reddy settairic comments on kcr pushkar bath

revanth reddy, kcr, kcr family members, kcr pushkar bath, godavari pushkaralu, revanth reddy controversy, cash for vote, revanth reddy updates, revanth reddy sensational comments, revanth reddy

revanth reddy settairic comments on kcr pushkar bath : ttdp mla revanth reddy after a long break makes settairic comments on telangana cm kcr pushkar bath.

కేసీఆర్ పుష్కరస్నానంపై రేవంత్ ఘాటు విమర్శ

Posted: 07/14/2015 07:15 PM IST
Revanth reddy settairic comments on kcr pushkar bath

‘ఓటుకు నోటు’ కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బెయిల్ పై విడుదలైన మహాబూబ్ నగర్ కొడంగల్ తెలంగాణ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీడియా మరోమారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వ్యంగస్త్రాలు సంధించారు. జైలు శిక్ష అనంతరం అంతగా మీడియా ముందుకు రాని రేవంత్.. రెండో పర్యాయం మీడియా ముఖంగా మరోమారు కేసీఆర్ పై సెటైరికల్ కామెంట్లు చేశారు. అయితే.. ఇన్నాళ్ల మౌనం తర్వాత ఆయన ఇప్పుడు మళ్లీ తన మాటలబాణాన్ని పేల్చారు. సీఎం కేసీఆర్ ని గద్దెని దించడమే తన లక్ష్యమని గతంలో పేర్కొన్నట్టుగానే ఆయన మీద తాజాగా ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యంగా కేసీఆర్ పుష్కరస్నానంపై రేవంత్ ఆయనపై విమర్శిలు చేస్తూనే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

కరీంనగర్ జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా పవిత్ర పుష్కరస్నానం ఆచరించిన విషయం తెలిసిందే! ఈ పుష్కరస్నానం పట్ల రేవంత్ తనదైన శైలిలో స్పందించారు. కేసీఆర్ ఆ పుష్కరస్నానాన్ని ఆచరించడం వల్ల ఇక నుంచి రాష్ట్రానికి కీడు వాటిల్లుతుందని ఆయన అన్నారు. ఎందుకంటే.. వదిన చనిపోవడంతో సీఎం కేసీఆర్ కు మైల వుంటుందని ఆయన వివరించారు. ఆయన పుష్కరస్నానం ఆచరించరాదని వేద పండితులు చెప్పినప్పటికీ.. కేసీఆర్ వారి మాటను పెడచెవినబెట్టి గోదావరిలో మునిగారని ఆయన మండిపడ్డారు. ఇక చివరగా తన పాత స్టైల్లోనే.. లక్ష పాపాలు చేసి గోదావరిలో మునిగితే పాప పరిహారం జరుగుందని కేసీఆర్ భావిస్తున్నట్లుందని ఆయన వ్యంగ్యాస్త్రం సంధించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : revanth reddy  kcr pushkar bath  godavari pushkaralu  

Other Articles