Seemandhra erupts in protest

Seemandhra erupts in protest, Seemandhra erupts in protest, Sri Venkateswara University tension, Seemandhra bandh

Seemandhra erupts in protest, Bandh continue in Tirupati

ఎస్వీయులో ఉద్రిక్తలు - రద్దు చేసిన తిరుపతి దేవస్థానం?

Posted: 08/01/2013 05:20 PM IST
Seemandhra erupts in protest

రాష్ట్రం విభజనను వ్యతిరేకిస్తూ తిరుపతి ఎస్వీయూలో విద్యార్థుల ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. తరగతులను బహిష్కరించి వీధుల్లో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంద్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

హోరెత్తిన నిరసనలు

సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఉదయం టైర్లకు నిప్పంటించి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మండలంలోని వివిధ గ్రామాల్లో కూడా రహదారుల దిగ్బంధనం చేపట్టారు. కుప్పం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తిరుపుత్తూరు రహదారిపై భైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. కుప్పం పట్టణంలో కూడా ఆటోడ్రైవర్లు , బస్ డ్రైవర్లు, విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రభుత్వ , ప్రైవేటు విద్యాసంస్థలు మూసివేశారు.

టిటిడి డయల్ యువర్ రద్దు

తిరుమల అన్నమయ్య భవన్ లో శుక్రవారం నిర్వహించాల్సిన డయల్ యువర్ తితిదే ఈవో కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆ దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి టి. రవి ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలన పరమైన కారణాలతో రద్దు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. రద్దు విషయాన్ని భక్తులు గుర్తించి సహకరించాలని విజ్నప్తి చేశారు.

 

బహిష్కరణ

మదనపల్లి లో సమైక్యాంద్రకు మద్దతుగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బంది, తహశీల్థార్ కార్యాలయ సిబ్బంది విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా మండలంలో ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కేసిఆర్ కు వ్యతిరేకంగా నినాధాలు చేశారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles