20 months on salary

tirupati children hospital, no sarly, lab employees,

20 months on salary

జీతం లేకుండా 20నెలలుగా ఉద్యోగాలు చేస్తున్న నిరోద్యోగులు?

Posted: 06/03/2013 05:26 PM IST
20 months on salary

నెల జీతం కాస్త ఒకట్రెండు రోజులు ఆలస్యమైతే ఎన్ని ఇబ్బందులో? ఇంటి అద్దె నుంచి సరుకుల వరకు సర్దుబాటు చేయడం తల ప్రాణం తోకకు వస్తుంది. అలాంటిది 20 నెలలుగా జీతమే రాకుంటే.. వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. తిరుపతిలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదికన ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్న వారు జీతాల్లేక, జీవనాధారం కోసం అప్పులు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు. వెంటనే జీతాలివ్వాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదు. తిరుపతిలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ప్రభుత్వం చిన్నపిల్లల ఆసుపత్రిని ఏర్పాటు చేసింది.

ఈ ఆస్పత్రికి కాంట్రాక్టు ప్రాతిపదికన నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లను నియమించారు. వీరికి 9 నెలల పాటు ఎన్ఆర్‌హెచ్ఎం గ్రాంటు కింద నెలకు రూ.5 వేల నుంచి రూ. 6 వేలను జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి చెల్లించారు. ఆ తర్వాత నిధులు విడుదల కాలేదు. అప్పటి నుంచి జీతం ఆగిపోయింది. చిన్నపిల్లల ఆస్పత్రిలో అత్యవసర కేసులకు 24 గంటలూ వీరు అందుబాటులో ఉండి రక్తం, మలం, మూత్రం ఇతరత్రా పరీక్షలు నిర్వహిస్తారు. కానీ 20 నెలలుగా జీతం అందకున్నా వచ్చే నెలైనా ఇస్తారులే అని సర్దిచెప్పుకొంటూ పనిచేస్తున్నారు. రెగ్యులర్ చేస్తారన్న ఆశ కూడా వీరి చేత జీతంలేకుండా పని చేయిస్తోంది. ఇకనైనా అధికారులు స్పందించి ల్యాబ్ టెక్నీషియన్లకు జీతాలిచ్చేలా చర్యలు చేపట్టాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles