Gurajala jaganmohan comment on chandrababu naidu

gurajala jaganmohan comment on chandrababu naidu, telugu desam party chief n chandrababu naidu, vastunna meekosam, chandrababu naidu birthday

gurajala jaganmohan comment on chandrababu naidu

పాదయాత్ర చేస్తున్న బాబు బాగుండాలి : జగన్

Posted: 04/20/2013 04:13 PM IST
Gurajala jaganmohan comment on chandrababu naidu

ప్రజల కోసం 64 ఏళ్ళ వయస్సులోపాదయాత్ర చేపట్టి ప్రజలకు బాసటగా నిలిచి ప్రతి పల్లెను పరిశీలిస్తూ, ప్రతి గుండెను పలకరిస్తూ తన ప్రాణానికన్నా ప్రజలే దేవుడ్లుగా భావించి అండగా నిలిచిన మహోన్నత నాయకుడు చంద్రబాబు అన్నారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర బాధ్యతలను చేపట్టి బడుగు జీవులకు బాసటగా నిలవడానికి కృషి చేయాలని ప్రజలంతా వేయి కండ్లతో ఎదురు చూస్తూ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు గురజాల జగన్‌ మోహన్‌ తెలిపారు. పలమనేరు నియోజకవర్గ ప్రజలందరి తరపున చంద్రన్నకు 64వ జన్మదిన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల కష్టాలను కళ్లారా చూడడానికి వారి వెతలు తొలగించడానికి వస్తున్నా మీ కోసం కార్యక్రమం పూర్తి అయి రెండు వందల రోజులు అవుతున్న సందర్భంగా, అదేవిధంగా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా వర్ధిల్లాలని కోరుతూ ఆయనకు 64వ జన్మదిన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు జిసిఎన్‌ గ్రూప్స్‌ అధి నేత, గురజాల గ్లోబల్‌ పౌండేషన్‌ వ్యవస్థాపకుడు, పలమనేరు నియోజకవర్గ టిడిపి నాయకుడు గురజాల జగన్‌ మోహన్‌ తెలిపారు. ఈ సందర్భంగా పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకములు, హోమాలు, నిర్వహించి అనాధలకు, వృద్దులకు, వికలాంగులకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు గురజాల జగన్‌మోహన్‌ తెలిపారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles