Indiramma kalalu meeting with minnister galla aruna kumari

minister galla aruna kumari, indiramma kalalu, galla aruna kumari, congress party, sc-st sub plane

indiramma kalalu meeting with minnister galla aruna kumari

ఇందిరమ్మ కలలు కాంగ్రెస్‌ప్రభుత్వంతోనే సాధ్యం

Posted: 04/09/2013 07:26 PM IST
Indiramma kalalu meeting with minnister galla aruna kumari

రాష్ట్ర ప్రభుత్వం ఉగాదిని పురస్కరించుకుని ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కలల, ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ నేటికి నిజమవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా అమలుచేయని అనేక పథకాలు ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టడం ఆశాజనకంగా వుందన్నారు. భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత ఇందిరాగాంధీ కన్న కలలు కాంగ్రెస్‌ప్రభుత్వంతోనే సాధ్యమవుతాయని, దళితుల అభ్యున్నతికోసం కాంగ్రెస్‌పార్టీ ఎల్లప్పుడూ కష్టపడుతుందని రాష్ట్ర భూగర్భ గనుల శాఖమంత్రి గల్లా అరుణకుమారి తెలిపారు. మండలంలోని సి. రామాపురం ఎస్‌సి కాలనీల్లో ఇందిరమ్మ కలలపై సబ్‌ ప్లాన్‌ ప్రారంభించారు. ఈ ఉగాది నుంచి అమలు కానున్న ఈ పథకాలను అధికారులు దళితులకు తెలియజేసి అన్నివిధాలా ఆదుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ సాల్మన్‌ ఆరోగ్యరాజ్‌ మాట్లాడుతూ మండలంలో ఎస్‌సిల శాతం ఎక్కువగా వున్న పంచాయతీని గుర్తించి అందులోనే మొదటిగా సబ్‌ప్లాన్‌ చట్టాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles