A hair raising story of tirupathi

venkateswara temple, tirupati, tirumala tirupati devasthanam, ttd, e-auction, swamy laddu, 31 inches hair cutting, tirupathi laddu free, ttd new scheme,

a hair raising story of tirupathi

hair-raising.gif

Posted: 03/14/2013 04:10 PM IST
A hair raising story of tirupathi

a hair raising story of tirupathi

మీరు గానీ, మీ ఇంట్లో వారు గానీ  దేవుడికి  తలనీలాలు ఇవ్వలనుకుంటున్నారు? అయితే మీకు తిరుపతి వెంకటేశ్వరస్వామి అతీప్రీతీకరమైన  లడ్డు ఉచితంగా ఇస్తారు?  అయితే కండిషన్స్ వర్తిస్తాయి.  ఒక్కసారి తలనీలాలు సమర్పిస్తే.. ఉచితంగా 5 తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు వస్తాయి.  శ్రీవారికి మొక్కు చెల్లించుకునే భక్తులకు  తిరుమల తిరుపతి దేవస్థానం  ఈ బంపర్ ఆఫర్ పెట్టింది. అయితే ఈ పథకానికి కొన్ని షరతులు వర్తిస్తాయి. మీ కురులు  పొడుగు 31 అంగుళాలు  ఉంటేనే ఈ  ఆఫర్ కు అర్హులు.  అంటే మీ కురులు దాదాపు రెండున్నర అడుగులు  ఉంటేనే ఉచితంగా 5  తిరుపతి లడ్డూలు వస్తాయి.  ఈ ఆఫర్  ఎప్రిల్  నుంచి ప్రవేశపెడుతున్నట్లు టిటిడి అధికారులు చెబుతున్నారు. 31 అంగుళాల పొడవున్న వెంట్రుకలకు మార్కెట్ లో మంచి గిరాకీ ఉంది. అందుకే  టిటిడి అధికారులు  ఈ పథకం పెట్టినట్లు తెలుస్తోంది. 

a hair raising story of tirupathi

 

అయితే  ఈ పథకం పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారికి భక్తితో  ఇచ్చే తలనీలాలు కూడా చివరకు వ్యాపారం చేశారని భక్తులు మండిపడుతున్నారు. భక్తులు భక్తితో మొక్కు తీర్చుకుంటారు. లడ్డూల కోసం ఆశపడి మొక్కు తీర్చుకోరాని టిటిడి అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  అంతేకాకుండా  మామూలుగా భక్తులకు ఎక్కువ లడ్డూలు కావాలంతటే  లేవని చేతులెత్తేసే టీటీడీ అధికారులు ఈ పథకానికి మాత్రం ఎక్కణ్నుంచి  లడ్డూలు తెచ్చిపెడతారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.  శ్రీవారికి  మొక్కుకున్నవారు ఎలాగూ  తలనీలాలు ఇస్తారు.  అందచందాల గురించి పట్టించుకోకుండా   వెంకటేశ్వర స్వామి మీద భక్తితో ఇస్తారు. ఈ పథకాన్ని టీటీడీ అధికారులు వెంటనే విరమించుకోవాలని  భక్తులు డిమాండ్ చేస్తున్నారు. 

a hair raising story of tirupathi

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brahmostavam at sri kodandarama swamy temple at tirupati
Srigandha tree plantation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles