Not much for tirupati in rail budget

Not much for Tirupati in rail budget.png

Posted: 02/20/2013 09:21 PM IST
Not much for tirupati in rail budget

రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు నిధులు, కొత్త ప్రాజెక్టులు లభించే అవకాశాలు కనిపించడం లేదు. తిరుపతి రైల్వే స్టేషన్‌ను వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా చేస్తామన్న ప్రకటన అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్రానికి చెందిన రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నెల 26వ తేదీన రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆ బడ్జెట్‌లో తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధుల కొరతను సాకుగా చూపుతున్నట్టు సమాచారం. తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి పక్కనే సత్రాలు ఉన్న ప్రాంతంలో స్థలాన్ని కేటాయించడానికి టీటీడీ ముందుకు వచ్చింది. టీటీడీ ఈవో, చైర్మన్, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంయుక్తంగా ఈ ప్రాంతాలను పర్యటించి, ప్రణాళికను సిద్ధం చేశారు.అయితే, రైల్వే శాఖ ఈ విస్తరణ పనులకు ప్రాధాన్యతను ఇవ్వడం లేదని సమాచారం. కారణాలను ఆరా తీస్తే నిధుల లేమి అనే సమాధానం వినబడుతోంది. చిత్తూరు జిల్లాకు ఇది వరకు వచ్చిన ప్రాజెక్టులు కూడా అమలుకు నోచుకోవడం లేదు. తిరుపతి-కడప, తిరుపతి-గుంటూరు మధ్య కొత్త రైళ్లను 2011 బడ్జెట్‌లోనే ప్రతిపాదించారు. అయితే అవి ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. అకోలా-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు కూడా రాలేదు. శ్రీకాళహస్తి నుంచి నడికుడి వరకు 306 కిలోమీటర్ల రైల్వే లైన్ ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  High alert in tirupati
Jayaprada visits tirumala  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles