Benefits of rosewood oil

health,rosewood,oil,benefits,essential

The health benefits of Rosewood oil.

రోజ్ వుడ్ ఆయిల్ ఉపయోగాలు

Posted: 01/18/2014 03:24 PM IST
Benefits of rosewood oil

రోజ్ వుడ్ నూనె సౌందర్య సాధనంగానే కాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా ఒత్తిడిని పారదోలే ఆయుధం ఇది. పలు రకాలుగా దోహదపడుతున్న ఈ నూనెని ఎలా వాడాలంటే...

* రోజ్‌వుడ్ నూనె సహజ యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. గోరువెచ్చటి నీళ్లలో నాలుగు చుక్కల రోజ్ వుడ్ నూనె కలిపి టవల్ మీద చల్లాలి. ఈ టవల్‌ను కొద్దిసేపు వంటికి చుట్టుకుని పడుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వచ్చేస్తాయి. ప్రతికూల భావాలు తొలగిపోయి మనసు ఉల్లాసంగా మారిపోతుంది. అలాగే ఒక బకెట్ గోరు వెచ్చటి నీళ్లలో పది చుక్కల రోజ్ వుడ్ నూనె కలిపి స్నానం చేసినా ఒత్తిడి నుంచి క్షణాల్లో బయటపడొచ్చు. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

* ఈ నూనెను షాంపూలో కలిపి తలస్నానం చేస్తే మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. పొడిచర్మం గల వాళ్లు బాదం, రోజ్ వుడ్ నూనెల్ని కలిపి ముఖానికి మర్దనా చేసుకుంటే మరుసటి రోజుకి చర్మం మృదువుగా అవుతుంది. కంటికింది వలయాలు కూడా పోతాయి. ఈ నూనెను శరీరానికి రాసుకుంటే చర్మ కణజాలం గట్టిపడుతుంది.

* వేడి నీళ్లలో నాలుగైదు చుక్కల రోజ్ వుడ్ నూనె కలిపి ఆవిరిపడితే జలుబు, దగ్గు వంటి సమస్యలు అదుపులోకి వస్తాయి. ముక్కు పట్టేసినప్పుడు ఈ పద్ధతి వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది. కండరాల, కీళ్ల నొప్పులు ఉన్న వాళ్లు బాదం, రోజ్‌వుడ్ నూనెల్ని కలిపి మర్దనా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

* రోజ్‌వుడ్ నూనెను మాయిశ్చరైజింగ్ లోషన్‌తో కలిపి రాసుకోవడం వల్ల పొడిబారిన చర్మానికి తేమ అందుతుంది. దాంతోపాటు మృతకణాలు తొలగిపోయి చర్మం కొత్త మెరుపు సంతరించుకుంటుంది.

* సబ్బుతో, లిక్విడ్ సబ్బులతో చేతులు శుభ్రం చేసుకునేప్పుడు సబ్బు నురగలో కొద్దిగా రోజ్ వుడ్ నూనె కలిపితే రసాయనాల ప్రభావం చర్మం మీద పడదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Tips to convince to parents about love marriage

    ప్రేమవివాహంకోసం పెద్దలను ఒప్పించడం ఎలా..?

    Apr 25 | ప్రేమ... ప్రస్తుతకాలంలో ఇది కంప్యూటర్ లో వైరస్ పాకిపోయినట్లుగా ప్రపంచం నలుమూలలా వ్యాపించిపోయింది. 7వ తరగతి నుంచి విద్యార్థివిద్యార్థినులు ప్రేమించుకుంటున్నామంటూ తమ పెద్దలనే ఎదురిస్తుంటారు. ప్రేమిస్తున్నవారికి ఎలాగైనా దక్కించుకోవాలని తమ ఇంట్లోవున్నవారిగురించి, వారి ప్రేమను... Read more

  • Love tips for boys

    మనసులోని భావాలను వ్యక్తపరచడం ఎలా..?

    Apr 22 | సాధారణంగా అబ్బాయిలు తమ మనసులోని భావాలను ప్రియురాలికి వ్యక్తపరచడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. ప్రియురాలు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లడం, ప్రతి రోజూ ఆమెను వెంబడించడం, ప్రేమ లేఖలు రాయడం, తనకు నచ్చిన గిఫ్ట్... Read more

  • Love tips for boys in telugu

    తొందరపడి ‘‘ఐ లవ్ యూ’’ చెప్పకండి..!

    Apr 09 | సాధారణంగా ప్రేమ వ్యవహారాలు స్నేహం నుంచే మొదలవుతాయి. ఎవరైనా ఒకరు నచ్చినప్పుడు వారితో ముందుగా స్నేహం చేసుకుంటారు. ఆ తరువాత తమలో వున్న భావాలను, ఇష్టాయిష్టాలను తెలుసుకుని, అనుకోకుండా ప్రేమలో పడిపోతారు.  ఇటువంటి వ్యవహారాలు... Read more

  • Love tips for boys

    మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్నీ ప్రేమిస్తోందా..? లేదా..?

    Apr 05 | ప్రస్తుతకాలంలో ప్రేమ అనే విషయం సర్వసాధారణం అయిపోయింది. పిల్లల నుంచి పెద్దలవరకు ప్రతిఒక్కరు ఎవరినిపడితే వారిని ప్రేమించేసుకుంటున్నారు. ఎవరైనా ఒక అమ్మాయి నచ్చితే చాలు... అప్పటికప్పుడే వెళ్లి ఐ లవ్ యూ చెప్పేస్తారు. అదేవిధంగా... Read more

  • Affair with colleague is not good

    సహోద్యోగితో అఫైర్స్ పెట్టుకోవడం మంచిదేనా..?

    Apr 02 | సాధారణంగా ఏదైనా ఒక వ్యక్తితో పరిచయం అయినప్పుడు ముందు అది స్నేహంగా మారుతుంది. క్రమక్రమంగా వారితో నిత్యం కలుస్తుండడం, మాట్లాడుతుండడంతో అది ప్రేమగా మారిపోతుంది. అలా వారిమధ్య ప్రేమ చిగురించి, తరువాత పెళ్లి చేసుకుంటారు. ... Read more