Cup of tea will help to overcome pressure problems | Health Tips

Tea health benefits cancer pressure overcome tips

tea health benefits, tea health tips, health tips telugu, health tips, apple health tips, healthy vitamins, healthy foods, healthy snacks, pressure health tips, pressure overcome tips, cancer health tips, diabetics health tips

Tea Health Benefits Cancer pressure overcome tips : Health benefits with team which help to overcome pressure, diabetics, cancer and many other problems. It contains number of vitamins which most important to human bodies.

టీ తాగండి.. ఒత్తిడిని జయించండి!

Posted: 05/11/2015 01:42 PM IST
Tea health benefits cancer pressure overcome tips

రోజువారి ఇంటి కార్యకలాపాలతోపాటు అటు ఆఫీసు పనులు కూడా ఎక్కువగా వుండటంతో ప్రతిఒక్కరు ఒత్తిడికి గురి అవుతుంటారు. ఈ ఒత్తిడి కాలక్రమంలో పెరిగితే.. ఎన్నో ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మెదడు సంబంధిత వ్యాధులు, మానసికపరమైన సమస్యలు లేదా గుండెసంబంధిత వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం వుంటుంది. కాబట్టి.. ఈ ఒత్తడి సమస్యను తక్షణమే అధిగమించాల్సి వుంటుంది. మరి.. ప్రస్తుత ఫాస్ట్ జనరేషన్ లో ఒత్తిడిని జయించడం ఎలా సాధ్యపడుతుంది? అని అనుకుంటున్నారా! ఇప్పుడు ఆ ఆలోచన లేకుండా నిపుణులు ‘సింపుల్ చిట్కా’ అందిస్తున్నారు.

తీవ్ర ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నవారు ఓ కప్పు టీ తాగితే చాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆ టీ కాస్త తియ్యగా ఉంటే ఇంకా బెటరని పరిశోధనలు సైతం తేల్చాయి. టెన్షన్‌లో ఉన్నప్పుడు తియ్యని టీ తాగిన వారిలో ఒత్తిడి హార్మోన్లు సమతుల్యంగా వుంటాయని.. అదే టీ తాగని వారిలో ఒత్తిడి ఎక్కువుగా ఉన్న విషయం పరిశోధనలో తేలింది. అందుకే.. టీ తాగితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. కానీ తియ్యటి టీ అనగానే ఎక్కువ మోతాదులో పంచదార ఉపయోగిస్తే మాత్రం లేనిపోని ఇబ్బందులు కొనితెచ్చుకోవాల్సి వస్తుందని.. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా వుండాలని వారు అంటున్నారు.

టీ వల్ల కలిగే ప్రయోజనాలు :
* రోజూ మూడు కప్పుల టీ తాగితే ఆరు యాపిల్ పండ్లు తిన్నదానితో సమానం.
* ఒక టీ కప్పులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఒక కప్పు పండ్ల రసం కంటే అధికం.
* ఒత్తిడి, డయాబెటిస్, క్యాన్సర్, దంతక్షయం మొదలగు ఎన్నో రోగాల నుంచి టీ రక్షించగలదు.
* టీ తాగితే వయస్సును కూడా తగ్గిస్తుంది. శరీరం ముడతలు పడకుండా కాపాడుతుంది.
* టీలో పాలు వేసుకొని తాగడం వల్ల శరీరానికి విటమిన్స్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పొంది ఎముకలు దృఢంగా తయారవుతాయి.
* మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tea health benefits  Health Tips  Pressure overcome tips  cancer tips  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more