Coffee black coffee health benefits disadvantages

coffee health benefits, black coffee health benefits, coffee disadvantages, black coffee disadvantages, health tips, health tips telugu, healthy food items, healthy fruits, healthy drinks

coffee black coffee health benefits disadvantages : The advantages and disadvantages with coffee and black coffee

కాఫీ ఆరోగ్యానికి మంచిదా..? కాదా..?

Posted: 03/10/2015 04:17 PM IST
Coffee black coffee health benefits disadvantages

కాఫీ తాగడానికి ఇష్టపడనివారు ఎవరూ వుండరు. ఉదయం లేచినప్పుడు ఓసారి, తిరిగి సాయంత్రం మళ్లీ ఇంకోసారి కాఫీ తాగే అలవాటు ప్రతిఒక్కరికి వుంటుంది. ఇలా కాఫీ తాగడం వల్ల కాస్త పని ఒత్తిడి తగ్గుతుందని, మైండ్ ఫ్రెష్ అవుతుందని భావిస్తూ అంతా తాగుతారు. అయితే.. కొంతమంది కాఫీ ప్రియులు మాత్రం విచ్చలవిడిగా తాగుతుంటారు. రోజుకు కనీసం 5 నుంచి 8 గ్లాసుల కాఫీ తాగుతారు. ఇలా తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాఫీ కంటెంట్ అధికమైతే శరీరంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ.. కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? కాదా..? అన్నది మాత్రం చాలామందికి తెలియదు. ఆ విషయాలు తెలుసుకుందాం...

సాధారణంగా కాఫీ లేదా బ్లాక్ కాఫీ రెండు రకాలుగా వుంటాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కరకంగా పనిచేస్తాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లు రెగ్యులర్ గా పాలు, చక్కెరతో తయారు చేసే కాఫీకి బదులుగా తక్కువ కేలరీలు కలిగిన బ్లాక్ కాఫీ తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే.. ఒక కప్ బ్లాక్ కాఫీలో కేవలం 4.7 కేలరీలు ఉన్నాయి. అదే రెగ్యులర్ కాఫీలో అయితే ఏకంగా 56.6 కేలరీలు ఉంటాయి. అంటే.. దీనిని ఎక్కువగా తాగితే శరీర బరువు బాగా పెరిగిపోతుందన్నమాట! కాబట్టి.. బ్లాక్ కాఫీ తీసుకోవడమే ఎంతో మంచిది. అలాగే.. సాయంత్రం వేళల్లో నిద్ర సమస్యలతో బాధపడేవారు సాధారణ కాఫీ అంతగా తీసుకోకపోవడమే మంచిదని న్యూట్రీషన్లు అంటున్నారు.

అయితే.. కొందరు నిద్రపోకుండా వుండేందుకు కాఫీ తాగుతుంటారు. అప్పుడు సాధారణ కాఫీ కాకుండా బ్లాక్ కాఫీ తాగితే మంచిది. ఇది నిద్రను పోగొట్టడంతోపాటు ఎటువంటి ఆరోగ్య సమస్యల్ని కలిగించదు. కానీ.. ఎసిడిటి వున్నవాళ్లు మాత్రం బ్లాక్ కాఫీ తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ కాఫీతో మరిన్ని ఉపయోగాలు, ఇతర వివరాలు తెలుసుకోవాలంటే.. దగ్గరలో వున్న వైద్యుల దగ్గర సలహాలు తీసుకోవడం చాలా మంచిది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coffee health benefits  black coffee health benefits  healthy drinks  health tips  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more