Tips for healthy heart excercise

health tips, healthy heart tips, heart tips, healthy heart benefits, health tips telugu, healthy food items, excercise tips, cholesterol problems, heart diseases, health problems

tips for healthy heart excercise : Healthy tips to prevent heart related diseases.

హెల్తీ హార్ట్ కోసం ఆరోగ్య చిట్కాలు...

Posted: 02/25/2015 04:59 PM IST
Tips for healthy heart excercise

ప్రస్తుత ఫాస్ట్ జనరేషన్ లో పనిఒత్తిడి ఎక్కువగా పెరిగిపోవడంతో మానసికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. పైగా.. ఆఫీసుల్లో నిత్యం కూర్చుని వుండటం, వ్యాయామం చేసేంత సమయం దొరకకపోవడంతోపాటు మారిన జీవన విధానానికి మూలంగా గుండె సంబంధిత వ్యాధుల బారినపడాల్సి వస్తోంది. అలాగే.. ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను తీసుకోకపోవడం శరీరంలో కొవ్వుశాతం ఎక్కువగా పెరుగుతుంది. తద్వారా ఇది రక్తనాళాల్లో ఎక్కువగా పేరుకుపోయి, రక్తప్రసరణను అడ్డుకుంటుంది. దీంతో హార్ట్ ఎటాక్ సంభవించే ప్రమాదముంది. ఒక్కసారి గుండెజబ్బులు వస్తే.. తర్వాత విముక్తి చెందడం సాధ్యపడదు. కాబట్టి.. ఆ జబ్బులు రాకముందే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. ఆరోగ్యకరమైన హార్ట్ ను పొందవచ్చు. మరి.. అవేమిటో తెలుసుకుందామా..

* ప్రతిరోజూ ఆరోగ్యకరమైన పండ్లు, శరీరానికి పోషకాలు అందించే కూరగాయలు, ఆహారపదార్థాలు తీసుకోవాలి.
* ముఖ్యంగా ఆహారాపదార్థాల్లో ఉప్పు శాతం తక్కువగా వుండేలా జాగ్రత్త వహించాలి.
* ఉదయాన్నే లేవగానే కొద్దిసేపు (కుదిరితే 45 నిముషాలు) వాకింగ్ చేస్తే గుండెకు మంచిది.
* ఆఫీసుల్లోకానీ, అపార్ట్ మెంటుల్లోగానీ లిఫ్ట్ వాడకాన్ని తగ్గించి, మెట్ల ద్వారా వెళ్లేందుకు ప్రయత్నిస్తే మంచిది.
* కొవ్వు పదార్థాలు లేని ఆహారాలు తీసుకునేలా జాగ్రత్త పాటించండి.
* ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ పరీక్షలు, బ్లడ్ షుగర్, బీపీని చెక్ చేయించుకుంటే మంచిది.
* శరీర బరువును నియంత్రణలో వుంచుకోవాలి. ఎలాబడితేఅలా, ఏదిదొరికితేఅది తనకుండా వుండాలి.
* సాయంత్రంవేళ ఓ గంటపాటు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఈ చిట్కాలు పాటిస్తే గుండెను పదిలం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.a

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : healthy heart tips  healthy food items  health tips telugu  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more