పెళ్లి అంటే తమలో వున్న భావనలను వ్యక్తపరుచుకుని, లోపాలను సరిదిద్దుకొని ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక సమస్య ఏర్పడినప్పుడు దానికి తగ్గ పరిష్కారమార్గాన్ని వెదుక్కునేలా ఒకరికొకరు తోడుగా వుండాలి. తమకు కావాలసిన వస్తువులు, అవసరాలు, రహస్యాలను దాచిపెట్టకుండా ఒకరికొకరు సహాయపడేలా చూసుకోవాలి. ఆర్థికపరంగా సమస్యలు వచ్చినప్పుడు దానిని అధిగమించేందుకు ఇద్దరు ప్రయత్నించాలి. అప్పుడే ఇద్దరి మధ్య దాంపత్య బంధం గట్టిపడుతుంది.
ప్రస్తుతకాలంలో వివాహం చేసుకున్నవారు కేవలం చిన్నచిన్న కారణాలకే విడాకులను తీసేసుకుంటున్నారు. తమ జీవిత భాగస్వామితో వారితో ఎక్కువ సమయం కేటాయించడం లేదని లేదా తనతో స్నేహాపూర్వకంగా లేదనే భావనతో విడాకులు తీసేసుకుంటున్నారు. అనవసరంగా అనుమానాలను పెంచుకుని తమ అన్యోన్య జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.
సాధారణంగా ఇటువంటి సమస్యలు ఉద్యోగస్తులైన దంపతుల మధ్యే ఎక్కువగా కనిపిస్తాయి. ఆఫీసులోనే ఎక్కువ సమయం కేటాయించడం, పనిభారం ఎక్కువవడంతో ఒత్తిడికి గురై తమ జీవిత భాగస్వామితో జీవితాన్ని ఆస్వాదించలేకపోతారు. ఒకరికొకరు తమ మనసులోని భావాలను వ్యక్తపరుచుకోలేకపోతున్నారు. దీంతో వారు అటు కలిసి వుండలేక, విడిపోయి వుండలేక ఏమి చేయాలో తోచక విడాకులు తీసేసుకుంటున్నారు.
విడాకులను నివారించడానికి కొన్ని మార్గాలు :
1. పెళ్లయిన ప్రతి జంట తమలో వుండే అసమ్మతి మార్గాలను ముందుగా గుర్తించుకోవాలి. ఏదైనా ఒక చిన్న సమస్య ఏర్పడినప్పుడు దాని గురించి అనవసరంగా సంభాషించకుండా పరిష్కారమార్గాన్ని వెదుక్కోవాలి. అవసరమైతే ఒకరికొకరు తమ జీవనశైలి విధానాన్ని మార్చుకోవడానికి కూడా సిద్ధంగా వుండాలి. అప్పుడే ఇద్దరి మధ్య వున్న బంధం బలపడుతుంది. మొండితన వైఖరిని దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
2. కొత్తగా పెళ్లయిన జంటలు కొన్నాళ్లవరకు కలిసిమెలిసి, అన్యోన్యంగా సంతోష జీవనాన్ని గడుపుతారు. కానీ కొన్నాళ్ల తరువాత చిన్నచిన్న సమస్యలతో దూరంగా వుండిపోతున్నారు. ఇటువంటి తప్పు ఎప్పుడూ చేయకూడదు. సాధ్యమైనంతవరకు జీవిత భాగస్వామితో గడిపేందుకు ఆసక్తి చూపించాలి. ఆఫీసు పనులు ముగియగానే ఒకరికొకరు తమ భావనలను పంచుకోవాలి. దాంతోపాటు ఆఫీసు పనులలో ఏదైనా సమస్య వస్తే.. జీవిత భాగస్వామితో పంచుకోవడంతో వారిమధ్య బంధుత్వం ఇంకా బలంగా మారుతుంది.
3. ఒకవేళ వివాహ జీవితంలో నిత్యం గొడవలు లేదా తగాదాలు ఏర్పడుతే.. వాటిని మర్చిపోయేందుకు మీరు మీ వివాహ జీవితాన్ని తిరిగి ప్రారంభించేందుకు ఆసక్తి చూపించాలి. ఇటువంటి ప్రణాళిక మహిళలకే సాధ్యం అవుతుంది. దంపతులు దూరంగా వుంటున్నప్పుడు తమ మధ్య ఇంతకుముందున్న మంచి విషయాలు, క్షణాల గురించి గుర్తుచేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇవి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే మీ జీవిత భాగస్వామి మీద మీకు ఎంత ప్రేముందో వారికి తెలియజేసేటట్లు చేయాలి. మీరు మీ హావభావాలతో వారిని ఆకట్టుకునేలా చేసుకోవాలి. అప్పుడే ఇద్దరి మధ్య వున్న దూరం తగ్గి, తిరిగి సంతోష జీవనాన్ని కొనసాగించవచ్చు.
4. దంపతుల మధ్య ఏదైనా సమస్య వచ్చి తగాదాలు ఏర్పడినప్పుడు దానికి గొడవ పడకుండా ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకోవడం ఎంతో ఉత్తమమైన పద్ధతి. ఇటువంటి పద్ధతిని అనుసరిస్తే.. ఒకరిమీద ఇంకొకరికి ప్రేమ చిగురిస్తుంది. అసలు ఆ తప్పు ఏమి జరిగిందో కూడా గుర్తించలేరు. ఇద్దరిలో తప్పు ఎవరిచేసినా.. ఒకరికొకరు దానిని పరిష్కరించుకోవడానికి సహాయపడాలి. అప్పుడే మీ మధ్య వున్న దాంపత్య జీవితం బలపడుతుంది.
5. మీ జీవిత భాగస్వామి మీ స్నేహితులతో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని అనవసరంగా బాధపడకుండా వుండాలి. లేకపోతే ఇవి తీవ్రమై మానసికంగా ఒత్తిళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే ఎవరైనా తప్పులు చేసినప్పుడు అది తమకుతామే గుర్తించుకోవాలి. దానికి తగ్గ పరిష్కారాన్ని సొంతంగా వెదుక్కోవాలి.
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more