‘‘ప్రేమ’’... ఈ రెండక్షరాల పదం ఇద్దరి జీవితాలను ఒకటిగా కలపవచ్చు లేదా ఇద్దరి జీవితాలను చిన్నాభిన్నం చేసి, వారి అడ్రస్ లేకుండా చేసిపారేయొచ్చు. మునుపటికాలంకంటే.. ప్రస్తుతకాలంలో ప్రేమ అనేది సహజమైపోయింది.
ఇది ఎవరితో, ఎప్పుడు, ఎలా కలుగుతుందో ఎవ్వరికి తెలియదు. మనం వుండే ఇంటిదగ్గర ఎవరితోనైనా కావొచ్చు లేదా మనం పనిచేసే కార్యాలయంలో అయినా కావొచ్చు.
ఇటీవలే కాలంలో అయితే ఈ ప్రేమవ్యవహారాలు చాలావరకు ఆఫీసు కార్యాలయాలలోనే జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు స్టాంప్ వేసి మరీ చెబుతున్నారు. అదెలా అంటే.. ఆఫీసు అనేది తరుచుగా కలుసుకునే ప్రదేశం.
మనం మన గృహాలలో కేటాయించే సమయం కంటే ఆఫీసుల్లోనే ఎక్కువగా కేటాయిస్తుంటాం. అలాంటప్పుడు చాలావరకు మన సహోద్యోగులతోనే ఈ ప్రేమ పులకరించడం అనేది సహజం. ఇలా తరుచు కలుస్తుండడంతో సహోద్యోగుల వ్యక్తిత్వం తెలియడమే కాకుండా, వారి ఆలోచనలసైతం గ్రహించవచ్చు.
ఇటువంటి ప్రేమ విషయాలను తెలుసుకోవడం చాలా సులభం. మీరు ఆఫీసులో వున్నప్పుడు మీ మార్గంలో సహోద్యోగి వస్తున్నప్పుడు మీ గుండె కొట్టుకోవడం, మీ చుట్టూ వున్న వాతావరణం నిశ్శబ్దంగా అనిపించడం జరిగితే.. మీరు వారితో ప్రేమలో వున్నట్టు చిహ్నంగా చెప్పుకోవచ్చు. మీరు తరుచుగా వారివైపు ఆకర్షించడాన్ని కూడా మరో చిహ్నంగా చెప్పుకోవచ్చు.
మీరు మీ సహోద్యోగితో ప్రేమలో వున్నారని చెప్పడానికి మరికొన్ని సంకేతాలు....
సహజంగా ప్రతిరోజు ఆఫీసులో ఒకరికొకరు పలకిరించుకుంటుంటారు. ఒకరిగురించి ఇంకొకరు చాలా లోతువరకు తెలుసుకుంటారు. ఒకవేళ ఏదైనా ఒకరోజు మీ సహోద్యోగి ఆఫీసుకు రాకపోతే.. మీరు వారిగురించే ఆలోచించడం మొదలుపెడతారు. మీరు తన గురించే ఆలోచిస్తూ, దిగులు పడుతుంటారు. అంతేకాకుండా మీరు విశ్రాంతి తీసుకునే సమయంలో కలలో కూడా వారు కనిపిస్తుంటారు. ఇటువంటి సంకేతాలు కనుక వున్నట్లయితే.. మీరు మీ సహోద్యోగితో ప్రేమలో వున్నట్టే.
అదేవిధంగా ఆఫీసులో వున్న వారాంతంలోనూ మీరు వారితో సన్నిహితంగా నడుచుకుంటారు. వారితోనే ఎక్కువకాలం గడపడానికి ప్రయత్నిస్తుంటారు. అలాగే ఆఫీసుకు సెలవు వున్నప్పటికీ మీరు వారితో సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా లేదా ఫోన్ ద్వారా కనెక్ట్ అయి వుంటే... మీరు వారితో ప్రేమలో వున్నట్టు అతిపెద్ద చిహ్నంగా చెప్పుకోవచ్చు.
కార్యాలయ శృంగార విషయానికి సంబంధించి, మీరు వారికి సంబంధించిన చిన్న విషయాలను గుర్తుంచుకోవడం, దాని గురించి చర్చించుకోవడం కూడా ప్రేమకు సంకేతంగా చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా మీరు మీ సహోద్యోగులకు సంబంధించిన పర్సనల్ విషయాలను కూడా తెలుసుకోవడం ప్రేమకు సంకేతమే. అందులో భాగంగా.. వారి పుట్టినరోజుకు వారికి నచ్చిన, ఇష్టమైన బహుమతులు బహూకరించడం.
మీరు ఆఫీసులో చేస్తున్న పనిలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, వారు మీకు సహకరించడం... మీ పని బాధ్యతను వారు తీసుకోవడం ద్వారా ఇద్దరి మధ్య మర్యాదపూర్వకమైన బంధం ఏర్పడుతుంది. దీంతో ఇద్దరు ఇంకా దగ్గరయ్యే అవకాశాలు చాలావరకు వుంటాయి.
మీరు మీ సహోద్యోగి ముందు ఇంకొకరితో స్నేహాపూర్వకంగా మెలిగితే వారు దానిని సహించలేరు. మీరు ఎవరితైనా సరసాలాడటం ప్రారంభించినప్పుడు వారిలో అసూయ భావన కలుగుతుంది.
ఆరోగ్యరీత్యా కారణాలవల్ల మీరుగానీ ఆఫీసుకు రాకపోతే, ఇతరు సహోద్యోగుల ద్వారా వారు మీ గురించి సమాచారాన్ని సేకరిస్తారు. మీ జీవిత విషయాల గురించి తెలుసుకోవడానికి వారు ఆసక్తి చూపుతారు.
మీ సహోద్యోగి ఏదైనా పని ఒత్తిడిగానీ, కఠినమైన పరిస్థితులలో వున్నప్పుడు మీరు వారిని ప్రేమతో పలకరించి, ఒక చిరునవ్వు ఇవ్వవచ్చు. తద్వారా వారు కూడా మీకు అదే రీతిలో సమాధానం ఇస్తారు.
ఇలా ఈ విధంగా మీరు మీ సహోద్యోగులతో ప్రేమలో వున్నారనడానికి సంకేతాలు ఇవి.
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more