High blood pressure solution tips

High blood pressure solution tips , Tips To Control High Blood Pressure, Blood Pressure, high blood pressure treatment

High blood pressure solution tips, Tips To Control High Blood Pressure

మన రక్తపోటు అదుపులో ఉండేందుకు చిట్కాలు

Posted: 11/23/2013 04:14 PM IST
High blood pressure solution tips

మనం చాలా మంది అధిక రక్తపోటుతో బాధపడివారి చూసే ఉంటాం. అలాంటి వారికి  రక్తపోటు ఎలా నివారించుకోవాలో ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.  ఈ అధిక రక్తపోటు వల్ల వచ్చేవి  పక్షవాతం, కిడ్నీజబ్బు వంటి ఇబ్బందులు పొంచి ఉంటాయి. అందువల్ల రక్తపోటును అదుపులో ఉంచుకోవటం ఎంతో అవసరం. క్రమం తప్పకుండా మాత్రలు వేసుకోవటం మానరాదు. ఇవే కాదు కొన్ని చిట్కాలూ రక్తపోటు అదుపులో ఉండేందుకు తోడ్పడతాయి.

 

ప్రకృతి దృశ్యాలు: పచ్చని ప్రకృతి దృశ్యాలను చూసినప్పుడు మెదడులో హాయిని కలిగించే అల్ఫా తరంగాలు పుట్టుకొస్తాయి. ఇవి కేంద్ర నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతాయి. రక్తపోటును పెంచే కార్టిజోల్‌ హార్మోన్‌ ఉత్పత్తినీ తగ్గిస్తాయి. కాబట్టి గోడ మీద ప్రకృతి దృశ్యాల చిత్రాలను అలంకరించుకోవటం మంచిది. 

 

నెమ్మదిగా శ్వాస: నెమ్మదిగా, దీర్ఘంగా శ్వాస తీసుకోవటం వల్ల మహిళల్లో రక్తపోటు 14 పాయింట్లు తగ్గుతున్నట్టు బయటపడింది. ఈ ప్రక్రియ ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో రక్తనాళాలు వదులుగా అవుతాయి, రక్తపోటు అదుపులో ఉంటుంది.

 

నిటారుగా కూచోవటం: ముందుకు వంగి కూచున్నప్పుడు రక్తపోటు 16% వరకు పెరుగుతుంది. మన మెడలో ప్రశాంతతకు సంబంధించిన సందేశాలను మెదడుకు చేరవేసే నాడులుంటాయి. ముందుకు వంగటం వల్ల మెడలోని వెన్నుపాము, డిస్కుల మీదా ఒత్తిడి పడుతుంది. దీంతో ఆ భాగంలోని సున్నితమైన నాడులు నొక్కుకుపోయి వాటి పనితీరు మందగిస్తుంది. అందువల్ల వీలైనంతవరకు నిటారుగా కూచుంటే మంచిది.

 

బంగాళాదుంపలు: బంగాళాదుంపలను తింటే రక్తపోటు అదుపులో ఉండేందుకు తోడ్పడుతున్నట్టు ఒక అధ్యయనంలో తేలింది. దుంపల్లో పొటాషియం, క్లోరోజెనిక్‌ ఆమ్లం, ట్రీప్టోఫాన్‌ దండిగా ఉంటాయి. ఇవి రక్తనాళాలు వదులుగా ఉండేందుకు దోహదం చేస్తాయి. అయితే బంగాళాదుంపలోని పోషకాలు చాలావరకు పొట్టులోనే ఉంటాయి కాబట్టి వీటిని పొట్టు తీయకుండా తినటం మంచిది.

 

నువ్వులనూనె: ఇందులో ఆరోగ్యకరమైన బహుళ అంసతృప్త కొవ్వు ఆమ్లాలతో పాటు సిసమిన్‌ అనే రసాయనమూ ఉంటుంది. ఇవి రక్తనాళాల గోడలు వదులుగా ఉండేలా చేస్తూ హఠాత్తుగా రక్తపోటు పెరగకుండా చూస్తాయి. ఈ నూనెను అన్నం, సలాడ్ల మీద కొద్దిగా వేసుకొనీ తినొచ్చు.

 

కొబ్బరినీళ్లు: దాహం తీరటానికే కాదు. రక్తపోటు తగ్గటానికీ కొబ్బరినీరు ఉపయోగపడుతుంది. ఇందులో కేంద్ర నాడీవ్యవస్థను ప్రశాంతంగా ఉంచేందుకు, రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడేందుకు తోడ్పడే పొటాషియం దండిగా ఉంటుంది. సుమారు 600 మిల్లీలీటర్ల కొబ్బరినీరుతో 1,500 మి.గ్రా. పొటాషియం లభిస్తుంది.

 

దాల్చినచెక్క: మసాలా దినుసుల్లో ఒకటైన దాల్చినచెక్కలోని వృక్ష రసాయనాలు గుండె కండరాలు, రక్తనాళాలు వదులుగా ఉండేందుకు దోహదం చేస్తాయి. ఇలా రక్తపోటు అదుపులో ఉండేందుకు తోడ్పడతాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more