Kidambi Srikanth enter BWF pre-quarterfinals ప్రీక్వార్టర్ పైనల్ లోకి కిదాంబి శ్రీకాంత్

Kidambi srikanth enters pre quarters of bwf world championship

PV Sindhu, Kidambi Srikanth, world badminton championships, Pablo Abian, BWF World Championships, india, star badminton player, badminton, sports

Kidambi Srikanth survived scare against little-known Pablo Abian of Spain 21-15, 12-21, 21-14 to sail into the pre-quarterfinals of the BWF World Championships in Nanjing.

ప్రీక్వార్టర్ పైనల్ లోకి కిదాంబి శ్రీకాంత్

Posted: 08/01/2018 07:59 PM IST
Kidambi srikanth enters pre quarters of bwf world championship

చైనా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్స్ లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ జోరు కొనసాగిస్తున్నాడు. టోర్నీలో భాగంగా ఇవాళ జరిగిన ఉత్కంఠ మ్యాచులో స్పెయిన్ షట్లర్ పాబ్లోని 21-15, 12-21, 21-14 తేడాతో ఓడించిన కిదాంబి శ్రీకాంత్ ప్రీక్వార్టర్స్‌ చేరాడు. 62 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో.. తొలి సెట్‌ని అలవోకగా చేజిక్కించుకున్న శ్రీకాంత్.. రెండో సెట్ ను మాత్రం చేజార్చుకున్నాడు.

అయితే.. మ్యాచ్ లో గెలుపును నిర్ధేశించే నిర్ణయాత్మకమైన మూడో సెట్‌లో మళ్లీ పుంజుకుని గెలుపుతో ముగించేశాడు. దీంతో టోర్నీలో ముందజవేస్తూ ప్రీ క్వార్టర్ ఫైన్సల్స్ కు చేరుకున్నాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో ఐర్లాండ్ షట్లర్ నాట్‌ నుయెన్‌ని 21-15, 21-16 తేడాతో వరుస సెట్లలో ఓడించి అలవోక విజయాన్ని అందుకున్న శ్రీకాంత్.. ప్రీక్వార్టర్స్‌లో మలేషియా‌‌కి చెందిన డారెన్‌ను ఢీకొట్టనున్నాడు. ఇక మరోవైపు ఒలంపిక్స్ తరువాత కూడా వరుస విజయాలతో దూసుకెళ్తున్న పివీ సింధూ, సాయి ప్రణీత్ విజయాలను అందుకుని ప్రీక్వార్టర్స్ లోకి అడుగపెట్టగా, ప్రణయ్ రాయ్ మాత్రం ఓటమిని చవిచూసి ఇంటిబాట పట్టాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles