Usain Bolt wins the 200m final and eighth Olympic medal, but admits he is unlikely to run the race again

Rio olympics 2016 usain bolt wins 200m final

Adam Gemili, canada, Olympics, Usain Bolt, jamaica, Rio Olympics 2016, 200m run, Sport, rio 2016 olympics, olympics, olympics news

Usain Bolt has scripted his exit to perfection, haring to victory in his beloved 200 metres in 19.78 seconds to complete the sprint double at his third consecutive Games.

చిరుతకందని వేగంతో.. బోల్ట్ ఖాతాలోకి మరో స్వర్ణం..

Posted: 08/19/2016 12:04 PM IST
Rio olympics 2016 usain bolt wins 200m final

చిరుతలు కూడా చిన్నబోయేలా.. క్షణాల్లోనే మెరుపు వేగాన్ని అందుకుని పరుగు లంఖించుకునే జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ రియో ఒలింపిక్స్ లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. రియోలో రెండో స్వర్ణాన్ని సాధించి తనకు తిరుగులేదని నిరూపించాడు.  తాజాగా జరిగిన  200 మీటర్ల పరుగు పందెంలో 19.78 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి... మరో స్వర్ణ పతకాన్ని ఉసేన్ తన ఖాతాలోకి వేసుకున్నాడు. ఇప్పటికే రియోలో 100 మీటర్ల పరుగులో ఉసేన్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న బోల్ట్.. 200 మీటర్ల రేసులో కూడా ఆద్యంత దుమ్మురేపాడు. దీంతో అతని ఖాతాలో వరుసగా ఎనిమిదో ఒలింపిక్స్ స్వర్ణం చేరింది.

తాజా ఒలింపిక్స్ లో 100 మీటర్ల పరుగులో పసిడిని సొంతం చేసుకున్నబోల్ట్.. 120 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. 100 మీ. ఈవెంట్ లో వరుసగా మూడో ఒలింపిక్స్‌లో  స్వర్ణం గెలుచుకున్న తొలి అథ్లెట్‌గా బోల్ట్ చరిత్ర సృష్టించాడు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లలో కూడా బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్లు, 4x 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన సంగతి  తెలిసిందే. ఇక రియోలో బోల్ట్ ముందు  4x 100 జట్టు రేసు మాత్రమే మిగిలి ఉంది. ఇందులో కూడా పసిడి సాధిస్తే ఒలింపిక్స్ లో అపజయమే లేని ధీరుడిగా బోల్ట్ నిలిచిపోతాడు. అయితే మలి విడతలో తాను పరుగులో పాల్గొనన్న సంకేతాలను బోల్ట్ ఇచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rio Olympics  sprinter  Usain Bolt  second gold medal  Rio olympics 2016  

Other Articles