Narsingh Yadav slapped with four-year ban by CAS, out of Rio Olympics 2016

Narsingh yadav s olympic dream over after 4 year doping suspension

74kg freestyle, banned, CAS, Court of Arbitration for Sports, NADA, Narsingh Yadav, Narsingh Yadav doping controversy, Olympics 2016, Rio 2016, Rio Olympics 2016, WADA, WFI, When in Rio, Wrestling, india rio olympics, india olympics, olympics news, sports, sports news

Indian wrestler Narsingh Yadav was ousted from the Olympics and slapped with a four-year ban for flunking a dope test after Court of Arbitration for Sports overturned the NADA clean chit.

నర్సింగ్ యాదవ్ అశలు బుగ్గి.. నాలుగేళ్ల నిషేదం..

Posted: 08/19/2016 10:31 AM IST
Narsingh yadav s olympic dream over after 4 year doping suspension

రియో ఒలింపిక్స్ లో పాల్గోనే అంశంమై అది నుంచి వివాదాలకు కేంద్రంగా మారిన భారత్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ అశలన్నీ బుగ్గిపాలయ్యాయి. రియోకు ఆయన ఎంపిక నుంచి ప్రారంభమైన వివాదం.. తన సహచర అటగాడు సుశీల్ కుమార్ కోర్టును ఆశ్రయించడం వరకు వెళ్లినా.. చివరకు భారత రెజ్లింగ్ ఫెడరేషన్ జోక్యంతో అన్ని సద్దుమణిగాయని అనుకున్నా.. అంతలోనే డోపింగ్ అంశం తెరపైకి రావడం.. ఏకంగా ప్రధానమంత్రి ఈ అంశంలో జోక్యం కల్పించుకునేంత వరకు వెళ్లింది.

దీంతో నర్సింగ్ యాదవ్ పై చర్యలకు స్వప్తి పలికిన జాతీయ డోపింగ్ ఏజెన్సీ.. అతనికి రెండో పర్యాయం నిర్వహించిన డోపింగ్ టెస్టులోనూ పాజిటివ్ గా తేలినా.. క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) నీళ్లు చల్లింది. అతడిపై నాలుగేళ్లు నిషేధం విధించింది. దీంతో చివరి నిమిషంలో ఒలింపిక్స్ నుంచి అతడు వైదొలగాల్సి వచ్చింది. ఈ రోజు జరగనున్న పురుషుల 74 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ఈవెంట్లో అతడు బరిలో దిగాల్సివుంది. డోపింగ్‌లో 'నాడా' ఇచ్చిన క్లీన్ చీట్ ను సీఏఎస్ లో 'వాడా'  సవాల్ చేసింది.

కుట్ర కారణంగానే అతడు డోపింగ్ లో ఇరుక్కున్నాడన్న వాదనను సీఏఎస్ అంగీకరించలేదు. అతడి ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని, నర్సింగ్ పై నాలుగేళ్లు నిషేధం విధిస్తున్నట్టు సీఏఎస్ పేర్కొంది. రియో ఒలింపిక్స తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్ రెజ్లర్ జలీమ్ ఖాన్‌తో నర్సింగ్ పోటీపడాల్సివుంది. సీఏఎస్ తీర్పు దురదృష్టకరమని భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్) వ్యాఖ్యానించింది. ఒలింపిక్స్ కు అర్హత సాధించిన ఆటగాడిపై చివరి నిమిషంలో నిషేధం విధించడం పట్ల డబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు బీబీ శరణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో అగస్టు 18 నుంచి నాలుగేళ్ల పాటు అతనిపై నిషేదం కోనసాగనుంది, కాగా జూన్ 25 నుంచి అతడు పాల్గోన్న అన్ని పోటీలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narsingh Yadav banned  Wrestling  CAS  WADA  Doping  rio olympics  

Other Articles