కాశ్మీర్ లో అధికరణం 370 రద్దు తర్వాత పాక్ భారత్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఒకరకంగా రెండు దేశాల మధ్య నడిచే బస్సులు రైళ్ళు కూడా నిలిచిపోయాయి. అంతర్జాతీయంగా కూడా ఇరు దేశాలు ఈ సమస్యను హైలైట్ చేస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి సమయంలో ఇరు దేశాల మధ్య రాకపోకలు ఉంటే చాలని అనుకుంటుంటారు కొంత మంది. అయితే ఈ ఉద్రిక్త సమయంలో ఏకంగా ఒక భారత యువతిని పెళ్ళాడి షాక్ ఇచ్చాడు పాక్ క్రికెటర్.
పాకిస్థాన్ ఫాస్ట్‌బౌలర్ హసన్ అలీ భారతీయ యువతి షామియా అర్జూను పెళ్లాడాడు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అటు పాక్ లో ఇటు ఇండియాలో కాకుండా దుబాయ్ లో నిన్న వీరు వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని హసన్ అలీ ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. తన బ్యాచిలర్ జీవితానికి ఇదే చివరి రాత్రి అని ట్వీట్ చేశాడు. ఎడారి మధ్యలో నిర్వహించిన మెహిందీ కార్యక్రమానికి సంబంధించిన వీడియో కూడా ఆయన అప్ లోడ్ చేశాడు.
ఇండియాలోని హర్యానాలో పుట్టి పెరిగిన సామియా ఆర్జూ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటోంది. ఫ్లైట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆమె కొన్నాళ్ల క్రితం అలీకి పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్న సమయంలో ఆమె కొన్నాళ్ల క్రితం హసన్ అలీకి పరిచయమైంది. తన వివాహానికి ఇండియన్ క్రికెటర్లను కూడా హసన్ అలీ ఆహ్వానించాడు. తన పెళ్లికి ఇండియన్ క్రికెటర్లు కూడా వస్తే తనకు మరింత సంతోషంగా ఉంటుందని హసన్ తెలిపాడు.
మరోవైపు, హసన్ అలీకి ఇండియన్ టెన్నిస్ స్టార్, పాక్ క్రికెటర్ ను పెళ్లి చేసుకున్న సానియా మీర్జా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. 'కంగ్రాట్ హసన్ అలీ. మీరిద్దరూ జీవిత కాలం సంతోషంగా, ప్రేమాభిమానాలతో ఉండాలి.' అని ట్వీట్ చేసింది. భారతీయురాలిని పెళ్లి చేసుకున్న నాలుగో పాక్ క్రికెటర్ హసన్ అలీ కావడం గమనార్హం. ఇంతకు ముందు జహీర్ అబ్బాస్, మోహ్సిన్ ఖాన్, షోయబ్ మాలిక్ లు భారతీయ యువతులనే పెళ్లాడారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more