Bumrah bags 5 wickets as India win by 318 runs సమిష్టిగా రాణించిన టీమిండియా.. తొలిటెస్టులో విజయం

India vs west indies 1st test bumrah bags 5 wickets as india win by 318 runs

india vs west indies, ind vs wi test score, ind vs wi, ind vs wi test match, india vs west indies score, india vs west indies cricket score, antigua test match score, cricket score, ind vs wi score, ind vs wi cricket score, india vs west indies test match, india vs west indies antigua test, ind vs wi test, ind vs wi test score, ind vs wi test 1st test score, india vs west indies antigua test, sports news, cricket news, sports, cricket

Jasprit Bumrah took five wickets for seven runs as India bowled out West Indies for 100 on Sunday to clinch a 318-run win in the series-opening test match. It was India's biggest-ever away win in Test cricket.

సమిష్టిగా రాణించిన టీమిండియా.. తొలిటెస్టులో విజయం

Posted: 08/26/2019 08:38 PM IST
India vs west indies 1st test bumrah bags 5 wickets as india win by 318 runs

వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇప్పటికే వన్డే, టీ-20 సిరీస్ లను కైవసం చేసుకున్న టీమిండియా, ఇప్పుడు టెస్టు సిరీస్‌ పై కూడా పట్టుబిగించేందుకు సమాయత్తం అయ్యింది. అంటిగ్వాలో జరిగుతున్న టెస్టు మ్యాచ్ లో విరాట్ సేన నాలుగు రోజుల్లోనే విండీస్ పై విజయాన్ని అందుకుని టెస్టు మ్యాచుల్లోనూ జయకేతనం ఎగురవేసింది. తొలి టెస్టులో టీమిండియా జట్టు సమిష్టిగా రాణించడంతోనే విజయం నల్లేరు మీద నడకలా సాగింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ తో పాటు గ్రౌండ్ లోనూ భారత ఆటగాళ్లు చెలరేగిపోయారు.

తొలి ఇన్నింగ్స్ లో టాప్ ఆర్డర్ విఫలం కావడంతోనే టెస్టులో విండీస్ పైచేయి సాధిస్తుందని అందరూ భావించారు. కానీ ఆ తరువాత రంగంలోకి దిగిన బ్యాట్స్ మెన్లు నెమ్మదిగా అడి స్కోరుబోర్డుకు గౌరవప్రదమైన స్కోరు చేరేలా శ్రమించారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో రహానే సెంచరీకి తోడు మిగతా ప్లేయర్లు కూడా రాణించడంతో, 343/7 వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ వత్యాసాన్ని కూడా కలుపుకుని విండీస్ ఎదుట 419 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సొంతగడ్డపై బ్యాట్స్ మన్ కు స్వర్గధామంగా ఉన్న పిచ్ ని అంచనా వేయలేకపోయిన విండీస్ ఆటగాళ్లు కేవలం 100 పరుగులకు ఆలౌట్ అయ్యారు.

దీంతో భారత్ 318 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. వెస్టిండీస్ జట్టుపై భారత్‌ కు ఇదే అత్యుత్తమ విజయం కావడం గమనార్హం. భారత బౌలర్లలో బుమ్రా 7 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీయగా, ఇశాంత్ శర్మ 31 పరుగులిచ్చి 3, షమీ 13 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. వెస్టిండీస్ ఆటగాళ్లలో రోస్టన్ చేజ్ (12), కీమర్ రోచ్ (38), మిగెల్ కమిన్స్ (19) మినహా మరెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోవడం గమనార్హం. కాగా, విండీస్ తో రెండో టెస్టు ఈనెల 30 నుంచి కింగ్‌ స్టన్‌ లో జరుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs west indies  ajinkya rahane  bumrah  ishanth sharma  shami  antigua test  sports  cricket  

Other Articles