Ganguly backs MS Dhoni to continue after World Cup ఐసిసి ప్రపంచకప్ తరువాత ధోని ఆడోచ్చా..

Sourav ganguly backs ms dhoni to continue playing after 2019 world cup

MS Dhoni, Sourav Ganguly, ICC Cricket World Cup 2019, Indian Cricket Team, Team India, Virat Kohli, MS Dhoni, chasing rate, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Former India captain Sourav Ganguly has backed veteran wicket-keeper batsman MS Dhoni to continue playing even after the 2019 World Cup. The erstwhile opener has insisted that age cannot be a metric in deciding the future of a talented cricketer.

ఐసిసి ప్రపంచకప్ తరువాత ధోని ఆడోచ్చా..

Posted: 03/09/2019 10:02 PM IST
Sourav ganguly backs ms dhoni to continue playing after 2019 world cup

ఐసీసీ ప్రపంచకప్ ప్రారంభం కాకముందే ఇప్పుడందరినీ మదిని తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే. మరీ ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అభిమానులను అందోళనకు, కలవరానికి గురిచేస్తున్న ప్రశ్న.. ప్రపంచకప్ టోర్నీ ముగియగానే ధోని రిటైర్మెంట్ ప్రకటించాలా..? లేక ఆటను కొనసాగించాలా.? అన్నదే. ఇప్పటికే క్రికెట్ ప్రముఖులంతా మహీ రిటైర్మెంట్‌పై స్పందించారు. తాజాగా ఆ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా చేరిపోయాడు.

క్రికెట్ ప్రపంచమంతా వరల్డ్ కప్ తర్వాత ధోనీ రిటైర్ అయిపోతాడని భావిస్తుంది.. కానీ, గంగూలీ మాత్రం దానికి విరుద్ధంగా కామెంట్లు చేస్తున్నాడు. అతనికి వయస్సుతో సంబంధం లేదని ప్రతిభను బట్టి రిటైర్మెంట్ ఉండాలని చెప్పుకొస్తున్నాడు. కీపింగ్.. బ్యాటింగ్ అనేవి ఏజ్‌తో ఆధారపడి ఉండదని వెల్లడించాడు. ‘ఎంఎస్ దోనీ.. వరల్డ్ కప్ తర్వాత కంటిన్యూ అవ్వొచ్చు. ఒకవేళ ప్రపంచ కప్‌లో మహేంద్ర సింగ్ ధోనీ బాగా రాణిస్తే.. అతను రిటైర్ అవ్వాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.

అంతేకాదు టాలెంట్ ఉన్న వాళ్లకు వయస్సుతో సంబంధం లేదని గంగూలీ వివరించాడు. 'మహేంద్ర సింగ్ ధోనీని విమర్శించడానికి ఎవరూ సరిపోరు. అతని గురించి మాట్లాడే ముందు మీకు క్రికెట్ గురించి ఏమైనా తెలుసానని ఆలోచించుకోండి. ధోనీ.. సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్‌లతో సమానం. ఇలాంటి 30..40ఏళ్లకు ఒకసారి వస్తారు. అతను ఆటకే ఆభరణం లాంటి వాడు. నెంబర్ వన్ టెస్టు జట్టు కెప్టెన్.. రెండు ప్రపంచ కప్‌లు గెలుచుకున్న కెప్టెన్' న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నప్పుడు రవిశాస్త్రి కామెంట్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Australia  ODI Series  Team India  MS Dhoni  sourav ganguly  sports  cricket  

Other Articles