Mandhana, Raj Guide India to Series-Clinching Win కివీస్ తో రెండో వన్డేలో టీమిండియా విజయం.. సిరీస్ కైవసం

India vs new zealand mandhana raj guide india to series clinching win

Amelia Kerr, Amy Satterthwaite, India women, India Women vs New Zealand Women 2019, Lea Tahuhu, mithali raj, New Zealand women, smriti mandhana, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Another clinical outing from the bowling unit followed up by half-centuries from Smriti Mandhana and Mithali Raj saw India women clinch the ODI series against New Zealand by taking the second ODI by eight wickets at the Bay Oval in Tauranga.

కివీస్ తో రెండో వన్డేలో టీమిండియా విజయం.. సిరీస్ కైవసం

Posted: 01/29/2019 06:30 PM IST
India vs new zealand mandhana raj guide india to series clinching win

న్యూజిలాండ్ లోని మౌంట్ మాంగనుయ్ లో మరోసారి భారత పతాకం రెపరెపలాడింది. రెండో వన్డేలో ఉమన్స్ టీం 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 88 బాల్స్ మిగిలి ఉండగానే విక్టరీ కొట్టడం విశేషం. 162 పరుగుల టార్గెట్‌ను 36 ఓవర్లలోనే చేరుకొని... సత్తా చాటింది మిథాలీ రాజ్ టీం. ఇదే స్టేడియంలో కోహ్లీ సేన మూడో వన్డేలో అద్భుత విజయం సాధించి ఐదు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో వశం చేసుకోగా... వుమన్స్ టీం... మూడు వన్డేల సిరీస్‌లో రెండు వన్డేలు గెలిచి... 2-0 తేడాతో సిరీస్‌ని కైవసం చేసుకుంది.

టాస్ గెలిచిన టీంఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ప్లేయర్లు.. వరుసగా పెవిలియన్ దారి పట్టారు. 44.2 ఓవర్లలో ఆలౌట్ అయ్యి 161 పరుగులు చేసింది. ఆ తర్వాత క్రీజులోకి దిగిన టీం ఇండియా మహిళా ఓపెనర్లలో స్మృతి మంధాన మరోసారి చెలరేగి ఆడింది. 83 బాల్స్‌లో 90 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచింది.

కెప్టెన్ మిథాలీ రాజ్ సైతం 111 బాల్స్ ఆడి... 63 పరుగులు చేసి... నాటౌట్‌గా నిలిచింది. వీళ్లిద్దరూ విజృంభించి ఆడటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టి... 35.2 ఓవర్లకే విజయం టీంఇండియా వశమైంది. కోహ్లీ టీం లాగే... వుమన్స్ టీం కూడా చక్కటి విజయాలు సాధిస్తుండటంతో మహిళా జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా మంథాన పెర్ఫార్మెన్స్‌కి క్రికెట్ దిగ్గజాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles