ICC T20I Rankings: Kuldeep Attains Career-Best Rank కెరీర్ బెస్ట్ ర్యాంకులో కుల్దీప్, ధావన్

Icc t20i rankings kuldeep yadav shikhar dhawan make significant gain

ICC T20I Rankings, Kuldeep Yadav, Rohit Sharma, Shikhar Dhawan, Babar Azam, T20I rankings, Team India, Virat Kohli, sports news,sports, latest sports news, cricket news, cricket

Rewarded for his impressive performance in the recently-concluded T20I series against Australia, India’s Kuldeep Yadav has vaulted into the top-five of the ICC Rankings for T20I Bowlers.

కెరీర్ బెస్ట్ ర్యాంకులో కుల్దీప్, ధావన్

Posted: 11/26/2018 07:24 PM IST
Icc t20i rankings kuldeep yadav shikhar dhawan make significant gain

అస్ట్రేలియా పర్యటనలో భాగంగా ముందుగా టీ20 సిరీస్ అడిన టీమిండియా.. సిరీస్ ను 1-1తో సమం చేసింది. అయితే ఆటలో మాత్రం తమ అద్భుత ప్రతిభను కనబర్చిన టీమిండియా క్రికెటర్లు తమ కెరీర్ లోనే అత్యుత్తమ ర్యాంకులకు ఎగబాకారు. తాజాగా ఐసీసీ టీ20 ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తో పాటు భారత జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ లు కెరీర్ బెస్ట్ ర్యాంక్ లను సాధించారు. ఇందుకు ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్ లో వారికి దోహదపడింది.

కుల్దీప్ యాదవ్ తన మణికట్టు మాయాజాలంతో బంతులు విసిరి అస్ట్రేలియాను కట్టడి చేయడంతో పాటు వికెట్లను పడగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో తాజాగా ప్రకటించిన ర్యాంకులలో ఆయన ఏకంగా 20 స్థానాలు ఎగబాకి ఏకంగా టాప్ ఐదుగురిలో స్థానం సంపాదించాడు. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మిగిలిన రెండు మ్యాచులలో మొత్తంగా నాలుగు వికెట్లను సాధించిన కుల్దీప్ తన కెరీర్ లో అత్యుత్తమంగా మూడో స్థానంలో నిలిచాడు.

ఇక టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ లో 11వ స్థానంలో నిలిచాడు. కెప్టెన్ కోహ్లీ ర్యాంకింగ్ (14వ స్థానం)లో ఎలాంటి మార్పు లేదు. కాగా, ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంక్ లలో పాకిస్తాన్ కి చెందిన బ్యాట్స్ మెన్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో ఉండగా, ఆఫ్ఘానిస్తాన్ కి చెందిన రషీద్ ఖాన్ బౌలింగ్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే, ఆల్ రౌండర్ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు మాక్స్ వెల్ మొదటి స్థానంలో నిలిచాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC T20I Rankings  Kuldeep Yadav  Shikhar Dhawan  T20I rankings  Team India  cricket  sports  

Other Articles