Vizag to get MS Dhoni Cricket Academy విశాఖలో ధోని క్రికెట్ అకాడమి.. కుదిరిన ఒప్పందం..

Visakhapatnam to get ms dhoni cricket academy

MS Dhoni,Visakhapatnam, MS Dhoni Cricket Academy, MS, Dhoni Academy in Visakha, Arka Sports Management Pvt. Ltd, Vizag Breaking News, Andhra Pradesh sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Visakhapatnam will soon play host to the MS Dhoni Cricket Academy. An agreement in the regard was reached at a meeting held between Andhra Pradesh government and Arka Sports Management Pvt. Ltd (of MS Dhoni)

విశాఖలో మిస్టర్ కూల్ క్రికెట్ అకాడమి.. కుదిరిన ఒప్పందం..

Posted: 11/17/2018 05:55 PM IST
Visakhapatnam to get ms dhoni cricket academy

భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీకి విశాఖపట్నంతో వున్న అనుబంధం అత్యంత ప్రత్యేకమైనది. క్రికెటర్ గా తన ప్రస్థానాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లిన విశాఖపై ధోనికి ఆకాశమంత ప్రేమ వుందని అనడం అతిశయోక్తి కాదు. ఆ మధ్య తన కెప్టెన్సీలో మ్యాచ్ అడిన తరువాత ఆయన విశాఖ ఎంతో అందమైన నగరమని కూడా కితాబిచ్చాడు. దీంతో విశాఖలో తన నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని వుందని తన మదిలోని మాటను చెప్పిన మిస్టర్ కూల్.. ఆవాసం కాకుండా అకాడమీకే ప్రాధాన్యత ఇచ్చాడు.

ఈ నేపథ్యంలో, విశాఖ సాగర తీరంలో రూ. 60 కోట్ల వ్యయంతో ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీని ఆయన నెలకొల్పబోతున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గంటా సమక్షంలో ప్రభుత్వ అధికారులతో ధోనీకి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ మిహిర్ దివాకర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు దశల్లో అకాడమీతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఈ క్రికెట్ అకాడమీలో క్రికెట్ తో పాటు ఇతర క్రీడలకూ ఉపయోగకరంగా ఉండేలా 24 మైదానాలు (ఇండోర్, ఔట్ డోర్)లను నిర్మించనున్నారు. ఈ అకాడమీతో ఏపీ క్రీడా ముఖచిత్రంలో సమూల మార్పులు సంభవిస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన పలు వివరాలను ఆర్కా స్పోర్ట్ త్వరలోనే వెల్లడించనుంది. అయితే ధోని క్రికెట్ అకాడమితో స్థానిక యువతతో పాటు ఆంధ్రప్రదేశ్, పరిసర రాష్ట్రాల చిన్నారులకు ఈ క్రికెట్ పట్ల అసక్తిని కూడా పెంచడంతో పాటు వారిని క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో దోహదపడుతుంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles