Rahul Flops With The Bat Again విండీస్ తో రెండో టెస్టులోనే కేఎల్ రాహుల్..

India vs west indies lokesh rahul flops with the bat again

Prithvi Shaw, kl rahul, Team India, india vs west indies 2nd test, ind vs wi 2nd test, Umesh Yadav, Ashwin, virat kohli, Shardul Thakur, Roston Chase, Kuldeep Yadav, hyderabad test, sports news, sports, latest sports news, cricket news, cricket

Indian batsman KL Rahul yet again failed to grab his chance as his slump in form continued in the second Test against West Indies in Hyderabad

విండీస్ తో రెండో టెస్టులోనే కేఎల్ రాహుల్..

Posted: 10/13/2018 04:58 PM IST
India vs west indies lokesh rahul flops with the bat again

హైదరాబాద్ వేదికగా, ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోమారు విఫలం అయ్యాడు. విండీస్ తో అడుతున్న రెండో టెస్టులోనూ ఆయన విఫలం కావడంతో క్రికెట్ అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు. తొలి టెస్టులోనూ విఫలమైన రాహుల్ వరుసగా రెండో టెస్టులోనూ తన బ్యాటుతో ప్రదర్శన చేయలేక వచ్చిన వెంటనే వెనుదిరిగాడు.

రాజ్‌కోట్ వేదికగా గత శనివారం ముగిసిన తొలి టెస్టులో డకౌటైన కేఎల్ రాహుల్.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో తాజాగా జరుగుతున్న రెండో టెస్టులోనూ 4 పరుగులకే ఔటయ్యాడు. ఆటలో రెండో రోజైన శనివారం తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు 311 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ని ఆరంభించిన భారత్‌ జట్టు 61 పరుగుల వద్ద రాహుల్‌ వికెట్ కోల్పోయింది.

ఇన్నింగ్స్‌ 9వ ఓవర్ వేసిన విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ బౌలింగ్లో బంతిని టచ్ చేసి వదిలేందుకు కేఎల్ రాహుల్ ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ అంచున తాకిన బంతి.. క్రీజులో పడి అనంతరం బెయిల్స్ ని పడగొట్టింది. భారత టెస్టు జట్టులో మురళీ విజయ్, శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా రూపంలో ఓపెనింగ్ స్థానానికి కేఎల్ రాహుల్ కు ఇప్పటికే గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో.. అతని ఫెయిల్యూర్స్‌ జట్టులో అతని స్థానాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. ఇక దీనిపై క్రికెట్ అభిమానులు కూడా నెట్టింట్లో రాహుల్ పై విమర్శలు కురిపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles